కోవిడ్ ఎఫెక్ట్ : రూల్స్ అతిక్రమిస్తే అంతే.. బిగ్ బాస్ సెట్ సీల్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా విలయతాండవానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనితో అవసరమైన చోట్ల ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నాయి. కోవిడ్ ని అదుపు చేసేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. సినిమా రంగం విషయానికి వస్తే.. మూవీ షూటింగ్స్, థియేటర్స్ లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది.
కోవిడ్ ప్రభావం తాజాగా మలయాళం బిగ్ బాస్ షోపై పడింది. చెన్నైలోని చెంబరంబాక్కం ఎవిపి ఫిలిం సిటీలో మలయాళం బిగ్ బాస్ సీజన్ 3 షూటింగ్ జరుగుతోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ షూటింగ్ జరుపుతుండడంతో బుధవారం అధికారులు బిగ్ బాస్ సెట్ సీల్ చేశారు. దీనితో మధ్యలోనే మలయాళీ బిగ్ బాస్ సీజన్ 3కి బ్రేక్ పడింది.
కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతుండడంతో టెలివిజన్, సినిమా షూట్స్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మలయాళం బిగ్ బాస్ 3 షూటింగ్ కొనసాగించారు. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు బృందంగా వెళ్లి సీల్ చేశారు. నిర్వాహకులపై రూ లక్ష ఫైన్ కూడా విధించారు.
తమిళ బిగ్ బాస్ 4 ముగిసిన సెట్ లోనే మలయాళీ బిగ్ బాస్ 3 షూట్ చేస్తున్నారు. సెట్ లో కొన్ని మార్పులు మాత్రమే చేశారు. మలయాళీ బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోవడం ఇది రెండవసారి. గత ఏడాది లాక్ డౌన్ సందర్భంగా సీజన్ 2 మధ్యలో నిలిచిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout