‘నో కామా-నో ఫుల్ స్టాప్-నాన్ స్టాప్‌గా’ ఓటీటీ వేదికగా బిగ్‌బాస్ , ఆకట్టుకుంటోన్న ప్రోమో

  • IndiaGlitz, [Tuesday,February 15 2022]

భారతదేశంలో బిగ్‌బాస్ షోకి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ రియాలిటీ షో.. నెమ్మదిగా ప్రాంతీయ భాషల్లోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్లు హోస్ట్‌లుగా వ్యవహరించడంతో షో జనాల్లోకి బాగా వెళ్లింది. ఇంటిల్లిపాది టీవీల ముందు కూర్చొని వీక్షించడంతో పాటు కంటెస్టెంట్‌లకు ఓట్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ బాగా సక్సెస్ అయిన వారికి సినిమాలు, ఇతర రంగాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే.. విజయవంతంగా 5 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ 5 సీజన్‌కు వీజే సన్నీ విన్నర్‌గా నిలవగా.. షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

అయితే గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఓటీటీ వేదికగా బిగ్‌బాస్ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీనికి డిస్నీ హాట్‌స్టార్ సైతం క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఫలానా డేట్ అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో పుకార్లు చెక్ పెట్టేసింది హాట్‌స్టార్. ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుందట. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. ఇందులో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నాగార్జున కలిసి నటించారు. ‘నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఫిబ్రవరి 26 నుంచి షో మొదలవుతుందని అనౌన్స్ చేసినా సరైన క్లారిటీ లేదు. ఇకపోతే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్ తెలుగు ఐదు సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్స్ ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. మరి పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అలాగే ఈ 24/7 ఓటీటీ బిగ్‌బాస్ జనాన్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More News

రెండు వారాల్లో గుడ్‌న్యూస్ చెబుతానన్నారు.. అలీకి జగన్ క్లారిటీ ఇచ్చేశారా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్రభుత్వం ఇన్విటేషన్ పంపింది, నాన్నకి అందనివ్వలేదు.. ఎవరిపనో తెలుసు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

యువ ప్రేక్షకులకు నచ్చేలా "వర్జిన్ స్టోరి" ఉంటుంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.

పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ బాసట.. అన్నదాతల ఖాతాల్లోకి రూ.542 కోట్లు విడుదల

రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ స్కామ్‌లో దోషిగా నిర్ధారణ, మరోసారి జైలుకు తప్పదా..?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.