Keerthi Bhatt: వాళ్ళు దొరికితే రోడ్డు మీద నించోబెట్టి కొడతా! : బిగ్ బాస్ కీర్తి భట్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చింది. హౌస్‌లో నలుగురు కటెంస్టులు మాత్రమే నిలిచారు. వీరిలో ఒకరి విజేతగా నిలవనున్నారు. ఇదంతా పక్కనపెడితే హౌస్‌లో కటెంస్టుల కొట్లాటల గురించి చెప్పనక్కర్లేదు. టాస్క్‌లో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హల్‌చల్ చేస్తుంటారు. వీరికి మద్దతుగా బయట ఉండే ప్రేక్షకులు కూడా సోషల్‌మీడియాలో కొట్లాడుతూ ఉంటారు. ఏకంగా వారి పేర్లతో ఆర్మీ పేజీలు ఏర్పాటుచేసి ఇతర కటెంస్టులను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ వార్ మామూలు అయిపోయింది.
ఈ వార్ ఎంతవరకు వెళ్లింది అంటే కటెంస్టుల కుటుంబసభ్యులను కూడా విమర్శిస్తూ అసభ్యపదజాలం ఉపయోగిస్తున్నారు. ఏ సెలబ్రిటీ అయినా తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయకపోయినా.. వారిని విమర్శించినా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది. బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్.. ఇటీవల ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అతడి వెల్‌కమ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇంకేముంది సీరియల్ బ్యాచ్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. అమర్‌దీప్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆమెను పచ్చిబూతులు తిడుతూ వేధిస్తున్నారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కీర్తి ఓ వీడియో రిలీజ్ చేశారు.
కొద్ది రోజుల నుంచి తనకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయని.. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ వెలెకమ్ సెలబ్రేషన్స్‌కు తాను వెళ్లానని తెలిపారు. . అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎవరి గురించీ చెడుగా మాట్లాడలేదన్నారు. అయినా కానీ అమర్ ఫ్యాన్స్ కొందరు తనను పచ్చి బూతులు తిడుతున్నారని వాపోయారు. మీ తల్లి కూడా ఒక ఆడదే కదా.. తాను బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ప్రియాంక, మానస్, మహేశ్ తప్ప తనకెవరూ సపోర్ట్ చేయలేదని తెలిపారు. సోలోగా ఎవరు ఆడతారో వారికే సపోర్ట్ చేస్తున్నానని స్పష్టం చేశారు. గౌతమ్ ఒంటరిగా ఆడటం నచ్చిందని.. అందుకే తన దగ్గరకు వెళ్లి సపోర్ట్ చేశానని పేర్కొన్నారు.
తనకు నచ్చింది చేస్తా.. ఎందుకిలా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు దండం పెడతా.. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని మర్చిపోకండన్నారు. ఫ్యాన్స్ ముసుగులో ఇతరులను బాధపెట్టకండని విజ్ఞప్తిచేశారు. తన తప్పుంటే మీ అందరి కాళ్లు మొక్కుతా.. తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెడుతుంటే చూసి చాలా హర్ట్ అవుతున్నానన్నారు. తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అమ్మాయిలను గౌరవించండన్నారు. లోపల ఉన్న నలుగురి స్నేహితులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాను.. అది మీకేం తెలుసు? అని ప్రశ్నించారు. తాను ఎవరి దగ్గరా అడుక్కోవట్లేదని.. వీలైతే మీరు సాయం చేయండన్నారు. ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్‌లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్ చేసి మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా.. మీ అమ్మతోనే కొట్టిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కీర్తి. మొత్తానికి బిగ్ బాస్ వ్యవహారాలు వ్యక్తిగత విమర్శలకు దారితీయడం మంచిది కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments