BiggBoss: బిగ్‌బాస్ హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం.. కంటెస్టెంట్స్‌ని ఏడిపించిన సుదీప కథ
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్నిరోజులుగా గొడవలు, అలకలు, వాగ్వాదాలతో నడిచిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు మాత్రం ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. తమ జీవితంలో జరిగిన విషాదభరిత సంఘటనలను చెబుతూ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ కొట్టుకుంటూ వుండే వారు సైతం తమ గుండెల్లోని బాధను పంచుకుని అందరినీ ఎడిపించేశారు. షో ప్రారంభమైన వెంటనే మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో పాటు, మీకు ఒక పాప వుండటం ద్వారా మీ జీవితానికి ఎలాంటి అర్ధం వస్తుందో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించారు. అప్పటికే గత రెండు రోజులుగా జరిగిన సిసింద్రీ టాస్క్‌లో బేబీ బొమ్మలతో బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ పిల్లల విషయం వచ్చేసరికి పిల్లల మాదిరిగా ఏడ్చేశారు.
తొలుత ఆదిరెడ్డి మాట్లాడుతూ.. తన కుమార్తె పేరు అద్విత అని, అయితే తనకి పిల్లలంటే అంతగా ఇష్టం వుండదని చెప్పాడు. కానీ తన వైఫ్ డెలివరీ రోజున పక్కన లేననే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే వుంటుందన్నాడు. తన సిస్టర్ బ్లైండ్ కావడం వల్ల తన కుమార్తె కూడా అలాగే పుట్టిందని అంతా దెబ్బిపొడుస్తుండటంతో ఆరోజున చాలా బాధపడ్డానని ఎమోషనల్ అయ్యాడు. అంతా బాగా జరిగితే బిగ్‌బాస్ హౌస్‌లో తన బిడ్డ కూడా నడుస్తుందని కంటతడి పెట్టాడు.
ఇక ఈరోజు ఎపిసోడ్‌లో అందరికంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యింది, ఎడిపించింది నువ్వు నాకు నచ్చావ్ పింకి అలియాస్ సుదీప. తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ అమ్మాయి జీవితంలో ఇలాంటి విషాదం వుంటుందని ఎవ్వరూ అనుకుని వుండరు. 2015లో తాను గర్భవతిని అయ్యానని, కానీ ఆ సమయానికి తాను రెడీగా లేనని, ఇప్పుడు వద్దులే అనుకున్నానని చెప్పింది. అయితే అందరూ ప్రెజర్ పెట్టడం వల్ల కాలేకపోయానని.. నాటి నుంచి బేబితో కనెక్ట్ అవ్వడం ప్రారంభించానని, ఈ క్రమంలో ఓ రోజున బేబీ హార్ట్ బీట్ వచ్చిందని సుదీప తెలిపింది. సరిగ్గా అదే సమయంలో తన థైరాయిడ్ బాగా పెరిగిందని.. దానిని అంచనా వేయలేక బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది. కానీ తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకుంటున్నానని.. కానీ ఏదో ఒకరోజున దాన్ని వాళ్లకి ఇచ్చేయాలంటే ప్రాణం పోయినట్లు అనిపించిందని, ఫ్యూచర్‌లో తల్లిని అవుతానని భావిస్తున్నానని సుదీప కన్నీటిపర్యంతమైంది. కంటెస్టెంట్స్ వచ్చి ఆమెను ఓదార్చారు.
తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య గర్భవతి అని , ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎగ్జయిటింగ్‌గా వుందని చెప్పాడు. అనంతరం కీర్తి భట్ చెబుతూ.. యాక్సిడెంట్‌లో ఫ్యామిలీ మొత్తాన్ని పొగొట్టుకున్నాని, తర్వాత ఒక బిడ్డను దత్తత తీసుకున్నానని చెప్పింది. ఆమెనే తన సర్వస్వంగా భావిస్తూ పెంచుకుంటున్నానని, కానీ బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చేడప్పుడే తెలిసింది. తన పాప ఇక లేదని, చివరి నిమిషంలో ఆమె దగ్గర వుండలేకపోయా అంటూ కీర్తి కంటతడి పెట్టింది.
బ్యూటిఫుల్ కపుల్ మెరీనా రోహిత్ మాట్లాడుతూ.. ఎన్నో కలలతో బిడ్డను కనాలని అనుకున్నామని, తర్వాత ఆసుపత్రిలో చెక్ చేస్తే హార్ట్ బీట్ లేదని డాక్టర్లు చెప్పారని.. మూడు నెలలు నిండాక గర్భాన్ని తొలగించారని మెరీనా కన్నీటిపర్యంతమైంది. ఇక తెరపై నవ్వులు పంచే చలాకీ చంటి మాట్లాడుతూ.. తన కళ్లెదుటే అగ్నిప్రమాదంలో అమ్మ కాలిపోయిందని వాపోయాడు. తన బాధను దేవుడు విన్నాడేమో కానీ.. అమ్మను ఇద్దరు బిడ్డలుగా చేసి పంపించాడని చంటి చెప్పారు. అలాగే పిల్లలున్న తల్లిదండ్రులు.. బిడ్డలను రోడ్డు పాలు చేయొద్దని అందరికీ సూచించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments