బిగ్‌బాస్‌లో ఏజ్ షేమింగ్ ప్రకంపనలు.. గీతూని పక్కకినెట్టి ఇనయా డామినేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6వ సీజన్ నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్ల ప్రక్రియ వుండటంతో యథావిధిగా రచ్చ జరిగింది. అయితే ప్రతీవారం నామినేషన్స్‌కి కంటెస్టెంట్స్ చెప్పే రీజన్స్ చాలా బలంగా వుండేవి. కానీ ఈసారి మాత్రం సిల్లీ రీజన్స్‌తో కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయడం.. దీనికి అరుపులు, కేకలు తోడు కావడంతో బొత్తిగా పస లేకుండా కనిపించింది. నామినేషన్స్‌లో భాగంగా ఇద్దరు సభ్యుల తలపై ఒక్కో టమోటాను చితిపివేస్తూ తాము వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నామో రీజన్ చెప్పాలి. దీనిలో భాగంగా శ్రీహాన్- ఇనయా మధ్య మళ్లీ పిట్ట టాపిక్ వచ్చింది. ఈ ఇష్యూపై నాగ్ గడ్డిపెట్టినా శ్రీహాన్‌లో మాత్రం ఏ మార్పూ రాలేదు. అటు ఇనయా సైతం వయసు ప్రస్తావన తీసుకొచ్చింది. నాగార్జున ముందు మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ అంటుండగా.. శ్రీహాన్ తాను చిన్నవాడిని అంటూ సెటైర్లు వేశాడని ఇనయా లేవనెత్తింది. నా ఏజ్ ఎక్కువని నువ్వు ఎలా అనుకుంటావ్..? నా గురించి నీకు ఏం తెలుసు..? అని ఇనయా రచ్చ చేసింది.
ఇక ఎప్పుడూ మాట్లాడని కీర్తి కూడా ఈసారి తగ్గేదే లే అన్నట్లుగా వాదించింది. కానీ సరైన రీజన్స్ చెప్పలేక, తనను తాను డిఫెండ్ చేసుకోలేకపోయింది. కాకపోతే కెమెరా స్పేస్ కోసం ప్రయత్నించి ఫర్వాలేదనిపించింది. అటు ఫైమా- ఆరోహి గొడవ కూడా హైలైట్‌గా నిలిచింది. ఫైమా.. ఆరోహిని నామినేట్ చేస్తూ.. ఎప్పుడో పాత విషయాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని నామినేట్ చేయడం తప్పని చెప్పిన నువ్వు.. కెప్టెన్సీ విషయంలో నన్ను ఎందుకు టార్గెట్ చేశామని ఫైమా ప్రశ్నించింది. శ్రీహాన్ కోసమే నన్ను కెప్టెన్ కాకుండా అడ్డుకున్నావంటూ గద్దించింది. నీ భాషతో ప్రాబ్లమ్ కాదు.. నువ్వు మాట్లాడే విధానంతోనే సమస్య అంటూ ఫైమా గట్టిగా ఇచ్చింది.
ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే :
శ్రీహాన్... ఇనయా, రాజ్
సుదీప ... ఇనయా ,రాజ్
గీతూ... ఇనయా, చంటి
వాసంతి... రేవంత్ , ఆర్జే సూర్య
ఆరోహి... ఇనయా, రేవంత్
శ్రీసత్య... ఇనయా, రేవంత్
బాలాదిత్య.. సూర్య, రేవంత్
ఇనయా.. సుదీప, శ్రీహాన్
చంటి.. ఇనయా, గీతూ
అర్జున్ కల్యాణ్... రాజ్, గీతూ
ఆర్జే సూర్య... ఇనయా, వాసంతి
రేవంత్.. శ్రీ సత్య, ఆరోహి
రాజ్.. శ్రీహాన్, ఆరోహి
రోహిత్ అండ్ మెరీనా... ఇనయా, ఆర్జే సూర్య
కీర్తి... ఇనయా, రేవంత్
ఫైమా... ఆరోహి, సుదీప
ఆదిరెడ్డి... ఆరోహి, సుదీప
మొత్తంగా ఈసారి సుదీప, కీర్తి, ఆరోహి, గీతూ, శ్రీహాన్, ఇనయా, రాజశేఖర్, సూర్య, అర్జున్, రేవంత్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో కీర్తి, అర్జున్ కల్యాణ్‌లు నేరుగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఇంటిసభ్యులు ఇనయాని మరోసారి టార్గెట్ చేసి ఆమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మార్చారు. ఇప్పటి వరకు హౌస్‌లో ఆధిపత్యం చెలాయించిన గీతూ.. ఇనయా ధాటికి సైడ్ అవ్వక తప్పలేదు. ప్రేక్షకుల నుంచి కూడా ఇనయాకు మంచి ఓటింగ్ పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇనయా కోసం ఆర్మీ రెడీ అయ్యేలా వుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రేపటి నుంచి బిగ్‌బాస్ ఇంట్లో వాతావరణం ఎలా వుండబోతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments