Lucky Lakshman Teaser : బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ ‘‘లక్కీ లక్ష్మణ్’’ టీజర్ ఎలా వుందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ షో వల్ల కొద్దో గొప్పో పేరు వచ్చిన వారు వున్నారంటే వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ఒకరు సయ్యద్ సోహైల్. ఇతను ఇంతకుముందు కూడా సినిమాలు చేసినా కనీసం అవి వచ్చినట్లుగా కూడా తెలియదు. అయితే హౌస్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత తెలుగు లోగిళ్లకు చేరువయ్యాడు. తాజాగా సోహైల్ హీరోగా నటించిన సినిమా ‘‘లక్కీ లక్ష్మణ్’’. దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని రూపొందిన ఈ చిత్రంలో సోహైల్‌కు జంటగా మోక్ష నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన లక్కీ లక్ష్మణ్ ఫోటోలు, సాంగ్స్‌కి మంచి స్పందన లభించింది. త్వరలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
లక్ లేనోడి దురదృష్టం చుట్టూ కథ:
దీనిలో భాగంగా శనివారం లక్కీ లక్ష్మణ్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లక్కీ అని ఫీలయ్యే ఓ వ్యక్తి దురదృష్టం ఎలా వుంటుందనేదే ఈ సినిమా కథ. టీజర్ మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వుంది. హీరో స్కూల్లో వుండగా తోటి విద్యార్ధులతో కలిసి పికినిక్కి వెళ్లడానికి వంద అడిగితే.. వాళ్ల నాన్న చెప్పే రీజన్ ద్వారా మధ్య తరగతి కష్టాలు ఎలా వుంటాయో చెప్పే ప్రయత్నం చేశారు. హీరో పెరిగి పెద్దయిన తర్వాత కూడా అతని లక్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రేమలో పడిన తర్వాత ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు బ్రేకప్ చెబుతారు. మరి ఇంతకీ మనోడికి లక్ ఎప్పుడు కలిసి వస్తుందనే బేస్ పై సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.
ఆకట్టుకుంటోన్న డైలాగ్స్:
‘‘నువ్వు కాకపోతే లక్ష్మణ్ గాడిని లక్షమంది కోరుకుంటున్నారు’’. ‘‘ఆస్తుల్ని అమ్ముకున్నోడైనా పైకి వస్తాడు గానీ.. అమ్మాయిలను నమ్ముకున్నోడు మాత్రం పైకి రాలేదు’’ అంటూ హీరో సోహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా వున్నాయి. మొత్తం మీద యూత్‌ని టార్గెట్ చేసేలా వున్న ఈ సినిమా వారిని థియేటర్‌కు రప్పించేలాగా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments