Lucky Lakshman : నడి సముద్రంలో పడిపోయిన సోహైల్.. తృటిలో తప్పిన ప్రమాదం, జాలర్లు స్పందించకుంటే
Send us your feedback to audioarticles@vaarta.com
యువ నటుడు, బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహైల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. చేపలు పడుతూ నడి సముద్రంలో పడిపోయారు. పక్కనే వున్న మత్స్యకారులు వెంటనే ఆయనను రక్షించారు. అసలేం జరిగిందంటే.. సోహైల్ హీరోగా తెరకెక్కిన ‘‘లక్కీ లక్ష్మణ్’‘ ఈ నెల 30 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్ లోకల్‌బాయ్ నానితో కలిసి ప్రమోషన్ నిర్వహించాడు.
లోకల్ బాయ్ నానితో కలిసి ప్రమోషన్ :
మత్స్సకారుడి గెటప్‌లో లుంగీ కట్టి.. నాటు పడవలో సముద్రంలో వేటకు వెళ్లాడు సోహైల్. మార్గమధ్యంలో చేపలు పట్టే విధానం, వల విసిరే విధానం వంటి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో పడవ అంచుపై నిలబడగా అదుపు తప్పి సముద్రంలో పడిపోయాడు. పక్కనేవున్న లోకల్ బాయ్ నాని సోహైల్‌ను కాపాడి, తిరిగి పడవలోకి చేర్చాడు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలయ్యాయి. కాలి నుంచి నెత్తురు కారడంతో సోహైల్‌కు చికిత్స అందించారు.
ఈ నెల 30న రిలీజ్ కానున్న లక్కీ లక్ష్మణ్ :
కాగా... దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని రూపొందించిన ‘‘లక్కీ లక్ష్మణ్’’లో సోహైల్‌కు జంటగా మోక్ష నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన లక్కీ లక్ష్మణ్ ఫోటోలు, సాంగ్స్‌కి మంచి స్పందన లభించింది. దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. లక్కీ అని ఫీలయ్యే ఓ వ్యక్తి దురదృష్టం ఎలా వుంటుందనేదే ఈ సినిమా కథ. మరి సోహైల్‌కు లక్ కలిసి వచ్చిందో లేదో త్వరలోనే తేలిపోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments