Shanmukh Jaswanth: అరే ఏంట్రా ఇది.. గంజాయి సేవిస్తూ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అరెస్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా.. ఒకే దెబ్బకి రెండు పిట్టలా.. పోలీసులకు ఇద్దరు అన్నదమ్ములు భలే దొరికారు. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం కాస్త వెరైటీగా.. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్.. తనని శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు సంతప్ కోసం ప్లాట్‌కి వెళ్లారు. అక్కడ తనిఖీలు చేస్తుండగా గంజాయి తాగుతూ తమ్ముడు షణ్ముఖ్ పట్టుబడ్డాడు. వీడగియో తీస్తుండగా గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ వాదన చేశాడు. దీంతో అన్న కోసం వెళ్తే తమ్ముడు భలే దొరికాడు అన్నట్లు ఇద్దరిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అన్నపై చీటింగ్ కేసు నమోదు చేయగా.. తమ్ముడిపై గంజాయి కేసు పెట్టారు. ఏపీకి చెందిన ఓ అమ్మాయితో షణ్ముఖ్ సోదరుడు సంతప్ ప్రేమలో ఉన్నాడు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో జూబ్లీహిల్స్‌లోనూ తప్పతాగి రాష్ డ్రైవింగ్ చేసి వాహనాలను ఢీ కొట్టిన కేసులో షణ్ముఖ్ అయ్యాడు. తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో షణ్యుఖ్ నడిపిన ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో మనోడి లవర్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు అన్న కూడా ఓ యువతిని మోసం చేసి ఇరుక్కునాడు. దీంతో అన్నదమ్ములు ఇద్దరు అమ్మాయిలని మోసం చేయడంలో ఎక్స్పర్ట్స్లా ఉన్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కాగా షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్.. 'సాఫ్ట్వేర్ డెవలపర్స్’ వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఇక షణ్ముఖ్ అన్నయ్య.. సంపత్ వినయ్ ఓ కంపెనీకి కో ఫౌండర్‌గా ఉన్నాడు. ఏజెంట్ సాయి సతీష్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే స్టూడెంట్ వెబ్ సిరీస్‌తో మెప్పించాడు. తాజాగా ప్రముఖ కమెడియన్ వైవా హర్ష చిత్రం సుందరం మాష్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పడు అన్నదమ్ములు ఇద్దరు కటకటాలు పాలయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments