బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవికి ఎంగేజ్మెంట్ అయిపోయింది
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలంకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇన్స్టాగ్రాం వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంగేజ్‌మెంజ్ రింగ్‌తో ఉన్న ఓ పిక్‌ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘ఫైనల్లీ! ఇట్స్ హ్యాపెనింగ్’ అనే క్యాప్షన్‌ను పున్ను ఇచ్చింది. ఆ పిక్‌లో తనకు కాబోయే వ్యక్తి చెయ్యిని తప్ప ఫేస్ మాత్రం పున్ను కనిపించనివ్వలేదు. ఆ పిక్‌లో పున్ను చేతిని తన చేతిలోకి తీసుకుని డైమండ్ రింగ్ తొడిగినట్టుగా మాత్రమే కనిపించింది.
కనీసం తనకు కాబోయే వ్యక్తి పేరును కూడా పున్ను రివీల్ చేయలేదు. అయితే ఆమె పెట్టిన కాప్షన్ మాత్రం పెళ్లి చేసుకోబోతోందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. 24 ఏళ్ల పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’, ‘మనసుకు నచ్చింది’ వంటి సినిమాలను చేసింది. అయితే ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ద్వారానే చాలా ఫేమస్ అయిపోయింది.
బిగ్‌బాస్ సీజన్ 3లో ఆ సీజన్ విన్నర్ రాహుల్‌తో ఆమె ప్రేమలో పడినట్టు రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ కూడా రూమర్స్ వచ్చాయి. అయితే వారిద్దరూ ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే వచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతూ వచ్చారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్‌తో ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments