Deepti Sunaina : ఇల్లు కొనడానికి అంత డబ్బెక్కడిది.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునైన స్ట్రాంగ్ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన. సోషల్ మీడియాలో తనకున్న బేస్‌తోనే అవకాశాలు సృష్టించుకుంటోంది ఈ హైదరాబాద్ అమ్మాయి. నగరంలోని స్టెవెన్స్ అన్నాస్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీప్తి.. ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్కి ఎంట్రీ ఇచ్చారు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో దీప్తికి భారీ ఫ్యాన్ బేస్:
వైట్ స్కిన్ టోన్‌తోనే, మంచి ఫిగర్‌తో చూడగానే ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం. అందుకే చీరకట్టుతో పాటు లేటెస్ట్ ట్రెండీ వేర్‌తో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తూ వుంటోంది. అందాల ఆరబోతతో పాటు మంచి డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ నిత్యం యూత్‌తో టచ్‌లో వుంటోంది దీప్తి సునైన. అలా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటోంది.
ఇటీవల కొత్తింట్లో అడుగుపెట్టిన దీప్తి సునైన:
ఇదిలావుండగా వెండితెర, బుల్లితెర నటులు ఒక్కొక్కరిగా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తీన్మార్ సావిత్రి, సీరియల్ నటి శ్రీవాణిలు గృహ ప్రవేశాలు చేశారు. తాజాగా దీప్తి సునైన కూడా ఈ జాబితాలోకి చేరారు. హైదరాబాద్ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన ఆమె.. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టి పాలు పొంగించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు దీప్తి సునైన.
ఇల్లు కొనడానికి నీకు డబ్బెక్కడిది:
ఇకపోతే.. లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో ముచ్చట్లు పెట్టింది దీప్తి. ఈ సందర్భంగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. అయితే ఓ నెటిజన్ కొంటే ప్రశ్న అడిగాడు. దీనికి ఆమె ఏమాత్రం తడబడకుండా ఆన్సర్ ఇచ్చింది. మీరు రీసెంట్గా కొత్త ఇల్లు కొన్నారు కదా.. అంత డబ్బు ఎక్కడిది అని అతను ప్రశ్నించాడు. దీనికి ఆమె యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి నేను సంపాదించిన దాంట్లో 30 శాతం ఖర్చు పెట్టుకుని, మిగతా 70 శాతం సేవ్ చేసుకున్నాను. అలా దాచుకున్న డబ్బుతో ఇల్లు కొన్నాను అని దీప్తి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments