అఖిల్, మోనాల్‌ను అపార్థం చేసుకున్నావని అభికి చెప్పిన నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మైండ్ బ్లాక్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా ఎవరిపైనా అక్షింతలు వేయకుండా.. సున్నితంగానే డీల్ చేశారు. నిన్న జరిగిన షోలో అమ్మ రాజశేఖర్.. దివి, అరియానాలతో ఎలిమినేషన్ గురించి మీటింగ్. తరువాత అమ్మ, అవినాష్‌ల మధ్య చర్చ. తరువాత అమ్మ వెళ్లి సొహైల్‌తో మీటింగ్.. మొత్తంగా అమ్మ రాశేఖర్నే ఎక్కువగా చూపించారు. తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్ల టాస్క్. రెండు టీంలుగా విడిపోయి దోశ, ఇడ్లీపిండిని రుబ్బాలి. గేమ్‌ని అమ్మ రాజశేఖర్ టాస్క్‌లో కాస్త ఓవర్ రియాక్ట్ అవుతున్నారనిపించింది. సొహైల్ సరదాగా ఒక మాస్టర్ టీం వేసిన ఒక దోశను తీస్తే.. అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. అందుకేరా నీకు దొంగ అని పేరు పెట్టిందంటూ మాట జారారు. ఇక టాస్క్‌కు సంబంధించి మాస్టర్ టీం 15 దోశలు, లాస్య టీం 12 దోశలు చేసింది. మాస్టర్ గురించి నోయెల్, సొహైల్ మధ్య చర్చ. ఆయన మాట జారడం నచ్చలేదని సొహైల్ చెప్పడమే కాదు.. వెళ్లి మాస్టర్ని అడిగాడు. తరువాత సొహైల్ వచ్చి అఖిల్ దగ్గర చెప్పి చాలా ఫీలయ్యాడు. తరువాత అఖిల్ మాస్టర్ని పిలిచి సొహైల్ క్యారెక్టర్ గురించి మాట్లాడవద్దని.. ఇక నుంచి వాడిని దొంగ అని అనొద్దని స్ట్రెయిట్‌గా చెప్పేశాడు.
రెండు సార్లు కెప్టెన్ అయిన నోయెల్‌కి శుభాకాంక్షలు చెప్పిన వెంటనే.. పుషప్స్ విషయమై నాగ్.. నోయెల్ని ప్రశ్నించారు. నువ్వు అవకాశం వదిలేస్తే అవినాష్ అందుకున్నాడని.. రియల్ నోయెల్ బయటకు రావాలని సూచించారు. తరువాత సొహైల్‌ని ఇప్పుడు చాలా హైట్స్‌లో చూస్తున్నానని చెప్పారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఆ విషయంలో కంట్రోల్ చేసుకుని ఫ్రస్టేషన్ ఫీల్ అవ్వొద్దని నాగ్ సూచించారు. ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా? అని ప్రశ్నించారు. నెక్ట్స్ అరియానాను.. సొహైల్ కోపంగా లేడని నువ్వు అరుస్తావా? అని అడిగి... అరియానాతో సారీ చెప్పించారు. తరువాత టాస్క్‌లో అవినాష్‌కి ఎందుకు కోపం వచ్చిందని ప్రశ్నించారు. అవినాష్‌కి నాగ్ క్లాస్ పీకారు. సొహైల్ డెసిషన్ ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఎక్కడా సొహైల్ పక్షపాతంగా చూడలేదని చెప్పారు. టాస్క్ బాగా చేశావని దివిని అభినందించారు. మోనాల్ 6 రోజులుగా ఆ డ్రెస్‌లో ఉన్నావా? అని నాగ్ ఆశ్చర్యపోయారు. అయితే మోనాల్ డ్రెస్‌ను ఎవరైనా వేసుకుంటే మోనాల్ నార్మల్ డ్రెస్ వేసుకోవచ్చని చెప్పారు. అరియానా వేసుకుంటానని ఒప్పుకుంది.
అఖిల్ టీంకి మరో డీల్.. అరగుండు, హాఫ్ షేవ్ చేయించుకుంటే నెక్ట్స్ వీక్ నామినేషన్స్ నుంచి సేఫ్ అనడంతో అమ్మ రాజశేఖర్ ముందుకొచ్చారు. మనోడికి ఎక్కడ వెళ్లిపోతానో అని మనసులో ఉన్నట్టుంది. మరో ఆఫర్ కూడా హాఫ్ షేవ్ చేసుకున్న వాళ్లు మరొకరిని కూడా నామినేషన్స్ నుంచి సేఫ్ చెయ్యొచ్చు. దీనికి అమ్మ రాజశేఖర్ ఓకే చెప్పారు. అరగుండు చేయించుకున్నందుకు అమ్మ రాజశేఖర్ కంటే దివి ఎక్కువగా ఫీల్ అయింది. నామినేషన్స్ నుంచి సేఫ్ అవడం కోసం అమ్మ రాజశేఖర్ చేయించుకుంటే దానికి దివి ఎందుకు అంతలా ఫీల్ అయ్యిందో అర్థం కాలేదు. ఇదే ఆమెకు ఫ్యూచర్లో మైనస్ అవుతుందేమో అనిపిస్తోంది. అమ్మ రాజశేఖర్, అరియానాలను నాగ్ అభినందించారు. తరువాత టాస్క్‌లో ఆల్ మిక్స్డ్ జ్యూస్ తాగినందరకు లాస్యను, హెయిర్ కట్ చేసుకున్నందుకు హారికను అభినందించారు. అందరికీ సాగ్స్ ఇచ్చారు. దానిలో గ్రీన్ చిల్లీ ఉన్నవాళ్లు సేఫ్ అని చెప్పారు. లాస్య సేఫ్ అయింది. తరువాత ఒక హౌస్మేట్స్ గురించి మరో హౌస్‌మేట్ ఏం రాశారో నాగ్ చదివి వినిపిస్తారు.. అదెవరో కనుక్కుని వారిని హేమర్తో కొట్టాలి.
అవినాష్‌కి టాస్క్ సమయంలో క్రూర మనస్తత్వం ఉంటుంది. అది అన్నది దివి అని అవినాష్ కరెక్ట్‌గానే చెప్పాడు. మెహబూబ్ స్వార్థపరుడు కానీ స్నేహం కోసం నటిస్తున్నట్టు కలరింగ్ ఇస్తాడని అన్నదెవరనగానే కుమార్ సాయి అని కరెక్ట్‌గానే చెప్పాడు. లాస్యది మోసపూరిత నవ్వు అని అన్నదెవరు అనగానే.. దివి అని చెప్పింది కానీ రాంగ్ అని నాగ్ చెప్పారు. అమ్మ రాజశేఖర్ అన్నారని నెక్ట్స్ లాస్య కరెక్ట్‌గానే చెప్పింది. అభిజిత్‌కి చాలా అహంకారం అని అఖిల్, మోనాల్ అన్నారని చెప్పగా.. అఖిల్, మోనాల్‌ను తప్పుగా అర్థం చేసుకున్నావని నాగ్ చెప్పారు. చివరకు అన్నది దివి అని తేలింది. తాత్కాలిక స్నేహం అని నోయెల్ గురించి అనుకున్నదెవరు? అంటే అమ్మ, దివిలు అని నోయెల్ అనుకున్నాడు. కానీ నిజానికి అలా అన్నది అవినాష్ అని నాగ్ చెప్పారు. అరియానా.. అతిగా స్పందించడం.. హద్దులు దాటడం.. పాట పాడటం అని అన్నదెవరంటే లాస్య, మోనాల్‌ను కొట్టింది. అన్నది మాత్రం మెహబూబ్ అని నాగ్ చెప్పారు. నెక్ట్స్ నోయెల్ని సేఫ్ చేశారు.
దివికి చాలా అహంకారం.. సభ్యత లేకుండా మాట్లాడుతుంది.. ఇతరుల మనోభావాలను గురించి పట్టించుకోదు అంటే అవినాష్, లాస్యలను ఎంచుకుంది. అన్నది మోనాల్ అని నాగ్ చెప్పారు. తనని తాను నినజాయితీ పరుడిగా.. వంచన లేని వ్యక్తిగా చూపించుకుంటాడు అని అఖిల్ విషయంలో ఎవరన్నారంటే ఫస్ట్ కుమార్ సాయిని ఎంచుకోగా.. నాగ్ రాంగ్ అని చెప్పడంతో అభిని ఎంచుకున్నాడు. మోనాల్ అబద్ధాల కోరు అని ఎవరన్నారంటే.. దివి, అరియానాలను ఎంచుకుంది. కానీ చెప్పింది అభి అని నాగ్ చెప్పారు. అమ్మ రాజశేఖర్.. ఏమారుస్తాడు.. నిజాయితీ అన్న మసుగులో దాచుకుంటున్నాడు అని ఎవరన్నారంటే అభి అని చెప్పారు. అది నిజమేనని నాగ్ చెప్పారు. ఆయన క్యారెక్టర్‌పై ఎటాక్ చేస్తారని అభి వివరణ ఇచ్చాడు. నెక్ట్స్ హారికను సేఫ్ చేశారు. లాస్ట్‌లో వచ్చే వారం నువ్వు సేఫ్ అవుతున్నావా? ఎవరినైనా సేఫ్ చేస్తున్నావా? అంటూ నేనే సేఫ్ అవుతానని ఆయన చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com