నోయెల్, కుమార్ల మధ్య రచ్చ.. సొహైల్ హైలైట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవాళ షో అంతా చాలా ఫన్నీ ఫన్నీగా నడిచింది. సొహైల్ ఇవాళ షోకే హైలైట్ అని చెప్పాలి. బద్రి టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. సొహైల్ నిద్ర పోతుంటే కుక్కలు అరిచాయి. మొన్ననే చెప్పాడుగా నాగ్‌కి.. కాసేపు పడుకోవడం అలవాటని.. మధ్యమధ్యలో నాప్ వేస్తుంటానని. ఇక టాస్క్. సీక్రెట్‌గా బెడ్ వెనుక పడుకున్నా కూడా కెమెరాలు పట్టేశాయి. తరువాత టీవీఎస్ అపాచి టాస్క్. దీనిలో రౌండ్ 1, 2 ఉంటాయి. మొదటి రౌండ్లో పుషప్స్ చేయాలి. చివరిగా మిగిలిన ఐదుగురు నెక్ట్స్ రౌండ్‌కి సెలక్ట్ అవుతారు. మొదటి రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ దివి, లాస్య, అరియానా, మోనాల్ వచ్చేశారు. తరువాత అవినాష్, హారిక, అభి ఔటయ్యారు. ఫైనల్‌గా మెహబూబ్, సొహైల్, అఖిల్, కుమార్, నోయెల్ రెండో రౌండ్‌కు ఎంపికయ్యారు. ఇక నోయెల్, కుమార్ల మధ్య రచ్చ. కుమార్ ఆగిపోయాడనేది నోయెల్ వాదన. నేను ఆగలేదనేది కుమార్ వాదన. ఒక్కరోజైనా నిజాయితీగా ఉండమని నోయెల్ చెప్పాడు. నా ఆటను నువ్వు జడ్జ్ చేయకూడదని కుమార్ చెప్పాడు. ఇక నేను ఆడనని నోయెల్ చెప్పేశాడు. అయినా సంచాలకుడి జడ్జిమెంట్ ఫైనల్ అయినప్పుడు నోయెల్ ఎందుకు ఫీలయ్యాడో అర్థం కాలేదు.
రెండో రౌండ్‌ను కుమార్ సాయి ప్రారంభించాడు. 1 మినిట్ 35 సెకండ్స్లో కుమార్ పూర్తి చేశాడు. నెక్ట్స్ వచ్చిన అఖిల్ 1 మినిట్ 10 సెకండ్స్లో పూర్తి చేశాడు. ఇక నోయెల్ తప్పుకోవడంతో రెండో రౌండ్లోకి అవినాష్ వచ్చాడు. ఆటలో అవినాష్ పడిపోయాడు. వెంటనే లేచి ఆటను కొనసాగించాడు. ఇక టాస్క్‌ని 1 మినిట్ 18 సెకండ్స్లో పూర్తి చేశాడు. నెక్ట్స్ వచ్చిన సొహైల్ 1 మినిట్‌లో కంప్లీట్ చేశాడు. ఫైనల్‌గా మెహబూబ్.. 49 సెకండ్స్లో టాస్క్‌ని కంప్లీట్ చేసి విజేతగా నిలిచాడు. అఖిల్, సొహైల్‌ల మధ్య చర్చ. అఖిల్ పుషప్స్ గురించి మెహబూబ్ కామెంట్ చేశాడని.. బాగా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడని అఖిల్ బాగా ఫీలయ్యాడు. ఇక సొహైల్ వెళ్లి మెహబూబ్‌ని పిలుచుకు వచ్చాడు. ఏదైనా ఉంటే నాకు చెప్పాలని.. బయట చెప్పొద్దని మెహబూబ్‌కు అఖిల్ చెప్పాడు. మెహబూబ్ అన్న దానికి సొహైల్‌ని కూడా అఖిల్ తప్పుబట్టడంతో సొహైల్ చాలా ఫీలయ్యాడు.
ఇంట్లో అమ్మాయిలకు బిగ్‌బాస్ నైట్ అవుట్ పార్టీ చేసుకునే అవకాశం ఇచ్చారు. పార్టీకి ముందుగా అభి వెళ్లాడు. హారికను చాలా బాగున్నావని అభి చెప్పాడు. అందరి గురించి పాజిటివ్ కామెంట్స్ చేశాడు. దివి అందం కళ్లలో ఉంటుందని చెప్పాడు. మోనాల్‌కి క్రౌన్ వేసుకోమని అభి చెప్పడంతో మోనాల్ క్రౌన్ వేసుకుంటుంటే గ్లాస్ నుంచి కెమెరా అఖిల్‌ని చూపించడం ఫన్నీగా అనిపించింది. అరియానాతో డేట్‌కి వెళతానని అభి చెప్పడంతో అరియానా పొంగిపోయింది. తరువాత అమ్మ రాజశేఖర్ వచ్చారు. పూల చొక్కా వేసుకుని చాలా ఫన్నీగా వచ్చారు. అమ్మతో అమ్మాయిలు ఓ ఆటాడుకున్నారు. నెక్ట్స్ వెళ్లిన సొహైల్.. ఫుల్ కామెడీ చేశాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ కాస్తా.. ఫన్నీ యంగ్ మ్యాన్‌గా మారిపోయాడు. హారిక సొహైల్ లుంగీ లాగడంతో మరింత ఫన్నీగా మారిపోయింది. అంత జరిగాక కూడా కథ వేరుంటుంది అనడంతో అమ్మాయిలు సొహైల్‌తో లుంగి డ్యాన్స్ చేయించారు. సొహైల్‌తో అమ్మాయిలాగా నడిపించారు. తరువాత అఖిల్ వచ్చాడు. అఖిల్‌తో అమ్మాయిలాగా నటింపచేసి బాగా ఆటాడుకున్నారు. అర్థరాత్రి అవినాష్‌తో మోనాల్ డ్యాన్స్. యు ఆర్ మై ఎవ్రిథింగ్ అంటూ చిందులు.. ఇది అఖిల్ చూస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో అనిపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com