రెండో పెళ్లి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్..

  • IndiaGlitz, [Thursday,November 05 2020]

తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ తాజాగా రెండోసారి పెళ్లి పీటలెక్కాడు. పంచాక్షరి, బావ, అహ నా పెళ్లంట వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటుడు సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. బిగ్‌బాస్ 2 సీజన్‌లో పాల్గొని సామ్రాట్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొదటి భార్య హర్షిత రెడ్డికి సామ్రాట్ విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడే ఈ విడాకులకు సంబంధించిన కేసు నడిచిందని తెలుస్తోంది.

ఒకటి రెండు సార్లు బిగ్‌బాస్ షో నుంచి సామ్రాట్ బయటకు వెళ్లి వచ్చాడు. అది ఈ కేసు కోసమేనని టాక్. సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్రాట్ సోదరి, మోడల్ శిల్పారెడ్డి సామ్రాట్‌కు సంబంధించిన కొన్ని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. సామ్రాట్‌ను పెళ్లి కొడుకును చేస్తున్న వీడియోను సైతం శిల్పారెడ్డి పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

కాగా.. సామ్రాట్ రెడ్డి.. శ్రీలిఖిత అనే యువతిని వివాహం చేసుకున్నట్టు శిల్పారెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సామ్రాట్ వివాహం కాకినాడలో జరిగిందని సైతం ఆమె వెల్లడించింది. కరోనా నిబంధనల మేరకు వివాహ వేడుకంతా చాలా నిరాడంబరంగా సమీప బంధువుల సమక్షంలోనే జరిగింది. కాగా.. సామ్రాట్ పెళ్లికి బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ తనీష్‌తో పాటు పలువురు హాజరైనట్టు తెలుస్తోంది.

More News

పంజాబ్‌లో ఎన్టీఆర్ సాంగ్.. వీడియో వైరల్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ప్రతీక ‘జై లవకుశ’ చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్‌లో నటించి మెప్పించాడు.

అంకిత నాపై నిర్మాతకు ఫిర్యాదు చేసింది: నవదీప్

‘జై’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. హీరో పాత్రలే కాకుండా అందివచ్చిన అవకాశాన్ని పట్టుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవదీప్.

విజయానికి ఆరు ఓట్ల దూరంలో బైడెన్...

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీకి తెరపడే సమయం ఆసన్నమవుతోంది.

మాదాపూర్ టు మియాపూర్.. మెట్రోలో ప్రయాణించిన పవన్

జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మెట్రోలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది.

బోరింగ్ టాస్క్.. విసుగు తెప్పించిన షో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్. ‘పల్లెకు పోదాం చలో చలో’.