BiggBoss6:శ్రీహాన్‌కు ఎక్కడ తగ్గాలో తెలుసు, కీర్తిని మహా వృక్షంతో పోల్చిన బిగ్‌బాస్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 6 (Bigg Boss 6)చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. చివరి వారం కావడంతో టాస్క్లేవి లేకుండా కంటెస్టెంట్స్ ఇంతకాలం ఇంట్లో వున్నప్పుడు ఎదుర్కొన్న సంఘటనలు, బెస్ట్ మూమెంట్స్‌ను ఒక్కొక్కరికి అందిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌లకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఇంట్లో మిగిలిన కీర్తి, శ్రీహాన్‌ల వంతు వచ్చింది.
తొలుత శ్రీహాన్‌కు (Shrihan) గార్డెన్ ఏరియా నుంచి పిలుపొచ్చింది. అక్కడ తన ఫోటోలను చూసుకుంటూ ముందుకు వెళ్తుండగా ఫోన్ రింగైంది. కట్ చేస్తే శ్రీహాన్ తల్లి గొంతు వినిపించింది. బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న కల నెరవేరింది. ఇక కప్ గెలుచుకుని ఇంటికి రా అని కొడుకును ఆశీర్వదించింది. అనంతరం బిగ్‌బాస్ మాట్లాడుతూ.. అందరితో సరదాగా వుండటం, అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా ఎదిరించడం మీ సొంతమని ప్రశంసించారు. మీలోని అల్లరి మీకు ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చింది. తోటి సభ్యుల కోసం నిలబడ్డ తీరు మీరు స్నేహానికి ఎంత విలువ ఇస్తారో చెబుతోంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో మీకు బాగా తెలుసునంటూ శ్రీహాన్‌పై ప్రశంసలు కురిపించారు. పట్టుకోవడంలోనే కాదు.. వదిలేయడంలోనూ బలం వుంటుందని మీరు నిరూపించారని, మీ వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తూ బిగ్‌బాస్ అతనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.
తర్వాత కీర్తిని (Keerthi Keshav Bhat) లోపలికి పిలిచాడు బిగ్‌బాస్. అందరికంటే ఆమె వీడియో ప్రేక్షకులను బలంగా తాకింది. కుటుంబ సభ్యులంతా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసినా.. అనాథ అయినా ధైర్యం కోల్పోక పట్టుదలతో సెలబ్రెటీగా మారింది కీర్తి. గుండెలు పిండేసి విషాదాన్ని పంటి బిగువతో భరిస్తూ.. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తోంది. అదే మాటలు చెబుతూ.. బిగ్‌బాస్ కీర్తి జీవితాన్ని అందంగా వర్ణించారు. ఆమెను ఏకంగా అడవిలోని మహా వృక్షంతో పోల్చారు. సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారనే మాటలు వినిపించినా.. మీ ఆట ఆగలేదని కీర్తిని కొనియాడాడు. ఇప్పుడు మీ కుటుంబం సంఖ్య ఒక్కటి కాదు.. కొన్ని లక్షలు అని బిగ్‌బాస్ అన్నాడు. కష్టాల పునాదులపై నిర్మించిన విజయాన్ని కదిలించడం అంత తేలిక కాదని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. అమ్మాయిలు దేనిలోనూ తక్కువ కాదని, అన్నింట్లో ముందుంటారని నిరూపించారని.. ఈ సీజన్లో ఫస్ట్ లేడీ కెప్టెన్ అయ్యారని , అలాగే ఫస్ట్ లేడీ విన్నర్ కూడా కావాలని బిగ్‌బాస్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
అనంతరం కీర్తి (Keerthi Keshav Bhat Bigg Boss 6) కంటతడి పెడుతూ మాట్లాడిన మాటలు హృదయాన్ని చివుక్కుమనేలా చేశాయి. ఎవరైతే నన్ను ఛీ తూ అన్నారో, అందంగా లేనన్నారో వారందరికీ ఇది కీర్తి అనేలా చేశా. ఈరోజు నా తల్లిదండ్రుల ఆత్మకు ఖచ్చితంగా శాంతి కలుగుతుంది.. బిగ్‌బాస్ వల్ల నాకు పెద్ద ఫ్యామిలీ దొరికింది. వారందరికీ రుణపడి వుంటానని కీర్తి ఎమోషనల్ అయ్యింది.
కాగా.. బిగ్‌బాస్ హౌస్‌లో వున్న ఆరుగురిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేయబోతున్నట్లు హోస్ట్ నాగార్జున (Nagarjuna Akkineni) గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారంతో బిగ్‌బాస్ సీజన్ 6 ముగియనుంది. ఈ గురువారం ఆరుగురు సభ్యుల్లో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. అది ఎవరనే దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డిలు టాప్ ఓటింగ్‌లో వున్నందున వారు సేఫ్‌గానే వుంటారని తెలుస్తోంది. ఎటొచ్చి కీర్తి, శ్రీసత్య, రోహిత్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. మరి ఎవరు ఇంటిని వీడతారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com