నరేంద్ర మోడీపై ట్వీట్ చేసిన చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఓవియా చిక్కుల్లో పడ్డారు. ఈ చిక్కులను ఆమె తనకు తాను క్రియేట్ చేసుకున్నారు మరి. అసలు ఇంతకీ ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. రెండు, మూడు రోజుల ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడి చెన్నై నగరానికి విచ్చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కొందరు చెన్నై వాసులు నరేంద్ర మోడి రాక వ్యతిరేకించారు. అలాంటి వారిలో నటి ఓవియా ఒకటి. ఈమె తన నిరసనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. ఓవియా తన ట్విట్టర్‌లో గో బ్యాక్ మోడీ అంటూ ఓవియా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. అయితే ట్వీట్ కారణంగానే ఓవియా చిక్కుల్లో పడింది. తన ప్రియ నేత చెన్నై పర్యటనపై ఓవియా నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్న అలెక్స్ సుధాకర్ కమీషనర్‌కు ఓవియాపై ఫిర్యాదు చేశాడు. నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకిస్తూ హ్యాష్ ట్యాగ్‌తో ఓవియా ట్వీట్ చేశారని, ఆమె చర్య ఇతరులను రెచ్చగొట్టేలా ఉందని సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓవియా కలవాణి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆమె నటించిన సినిమాలేవీ ఆమెకు ఆశించిన స్థాయిలో పేరుని తెచ్చి పెట్టలేదు. అదే సమయంలో ఆమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్‌బాస్ ద్వారా ఓవియా తగినంత గుర్తింపు దక్కించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments