నరేంద్ర మోడీపై ట్వీట్ చేసిన చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ బ్యూటీ

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఓవియా చిక్కుల్లో పడ్డారు. ఈ చిక్కులను ఆమె తనకు తాను క్రియేట్ చేసుకున్నారు మరి. అసలు ఇంతకీ ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. రెండు, మూడు రోజుల ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడి చెన్నై నగరానికి విచ్చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కొందరు చెన్నై వాసులు నరేంద్ర మోడి రాక వ్యతిరేకించారు. అలాంటి వారిలో నటి ఓవియా ఒకటి. ఈమె తన నిరసనను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. ఓవియా తన ట్విట్టర్‌లో గో బ్యాక్‌ మోడీ అంటూ ఓవియా ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. అయితే ట్వీట్‌ కారణంగానే ఓవియా చిక్కుల్లో పడింది. తన ప్రియ నేత చెన్నై పర్యటనపై ఓవియా నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్న అలెక్స్‌ సుధాకర్‌ కమీషనర్‌కు ఓవియాపై ఫిర్యాదు చేశాడు. నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకిస్తూ హ్యాష్‌ ట్యాగ్‌తో ఓవియా ట్వీట్‌ చేశారని, ఆమె చర్య ఇతరులను రెచ్చగొట్టేలా ఉందని సుధాకర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓవియా కలవాణి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆమె నటించిన సినిమాలేవీ ఆమెకు ఆశించిన స్థాయిలో పేరుని తెచ్చి పెట్టలేదు. అదే సమయంలో ఆమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్‌బాస్‌ ద్వారా ఓవియా తగినంత గుర్తింపు దక్కించుకుంది.

More News

తూచ్.. వర్షాలు రాకూడదనలేదు: కొత్త మేయర్ విజయలక్ష్మి

నగరంలో వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడ్డాయని, అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పడమే తన ఉద్దేశమని విజయలక్ష్మి పేర్కొన్నారు.

'ఉప్పెన' నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో తెలిస్తే...

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తెలంగాణలో ‘హస్త’మిస్తున్నా.. వీళ్లు మారరా?

కూర్చొన్న చోటు నుంచి కదలొద్దు.. కానీ విజయం కావాలంటూ కబుర్లు.. చేతుల నుంచి నియోజకవర్గాలకు నియోజకవర్గాలు జారి పోతున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటూ కూర్చోవాలి.

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ రెండు బ్యాంకులు గోవిందా?

దేశంలో అన్ని రకాల సంస్థల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా బ్యాంకుల వంతు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై వడివడిగా అడుగులు వేస్తోంది.

విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? తప్పించారా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి గత ఏడాది బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. కానీ విజయ్ సేతుపతి ఆ అవకాశాన్ని వదులుకున్నాడు.