మహేశ్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ...!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ తాజా చిత్రం సర్కారువారిపాట. మహేశ్ 27వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పరశురాం తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా దుబాయ్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ను చిత్రీకరించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4లో కంటెస్ట్ చేసిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ మహేశ్ మూవీ సర్కారువారి పాటలోని ఐటెమ్ సాంగ్‌లో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విలన్‌ను ఇండియాకు రప్పించడానికి హీరో ఏం చేశాడనేదే స్టోరి అని టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు రీసెంట్‌గా ప్రకటన కూడా వెలువడింది. గత ఏడాది కూడా సంక్రాంతికి మహేశ్ సరిలేరునీకెవ్వరుతో సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments