బిగ్‌బాస్ అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ కార్యక్రమానికి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో మొదటి బిగ్‌బాస్ షో జరిగిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఎన్టీఆర్ అందరి మన్ననలు పొందారు. అయితే ఆ తర్వాత బిగ్‌బాస్ 2కి హీరో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. కానీ, ఆ ప్రోగ్రామ్ ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. పైగా హీరో నాని కొన్ని వివుర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిగ్‌బాస్ 3 కోసం మళ్ళీ ఎన్టీఆర్‌ని తీసుకురావాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంతో ప్రయత్నించారు.
కానీ, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బిజీగా ఉండడంతో తనవల్ల కాదని చెప్పేశారు. అయితే ఈసారి హీరోయిన్ని హోస్ట్‌గా తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన బిగ్‌బాస్ నిర్వాహకులకు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా హీరోయిన్ అనుష్కను సంప్రదించి ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అదే నిజైమెతే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా అనుష్క ఏ విధంగా రాణిస్తుందీ, ఆ కార్యక్రమానికి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments