సినిమా ఛాన్స్ కొట్టేసిన అఖిల్ సార్థక్!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికి నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే గత మూడు సీజన్ల విషయానికి వస్తే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ కారణంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆల్రెడీ నేమ్, ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లే కావడంతో ఎవరికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. సీజన్ 4 మాత్రం డిఫరెంట్.. ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలన వాళ్లంతా పెద్దగా తెలియని వారే కావడం గమనార్హం. దీంతో షో తొలి రెండు వారాలు అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. అద్భతమైన టాక్‌తో.. మంచి రేటింగ్‌తో దూసుకుపోయింది. దీంతో కంటెస్టెంట్లకు మంచి నేమ్ వచ్చింది. దీంతో వారు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరీర్ పూర్తిగా మారిపోయింది.
బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ను సినీ రంగంతో పాటు టీవీ రంగంలో వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే అభిజీత్, సోహైల్, మోనాల్ గజ్జర్, మెహబూబ్, దివి, అరియానా, అవినాష్ మంచి అవకాశాలను అందుకున్నారు. అయితే బిగ్‌బాస్ రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్ధక్ మాత్రం నిన్న మొన్నటి వరకూ ఏ అవకాశమూ రాలేదు. దీంతో ఆయన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా అఖిల్‌కు కూడా మంచి అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఓ సినిమాలో ఈ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అవకాశాన్ని దక్కించుకున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
గోపీచంద్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తోన్న 'సీటీమార్' సినిమాలో అఖిల్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడని సమాచారం. ఇటీవలి కాలంలో పెద్దగా హిట్స్ లేకపోవడంతో గోపిచంద్.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా తనకు మంచి హిట్‌ను అందిస్తుందని గోపీచంద్ ఫీలవుతున్నాడు. ఈ సినిమా అఖిల్‌కు కూడా మంచి ప్లస్ అవుతుందని టాక్ నడుస్తోంది. గతంలో అఖిల్ ‘బావ మరదలు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా పెద్దగా అఖిల్‌కు కలిసి రాలేదు. దీంతో టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. ‘సీటీమార్’ మాత్రం గోపిచంద్‌తో పాటు అఖిల్‌కు కూడా కలిసి వస్తుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments