ఏడో సీజన్ తో బిగ్ బాస్ వస్తున్నాడు !!

  • IndiaGlitz, [Sunday,September 03 2023]

అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికిస్టార్ మాసెప్టెంబర్ 3 తెరతీయబోతోంది. అది బిగ్ బాస్.

ఆరు విజయవంతమైన సీజన్స్ ముగించుకుని ఏడో సీజన్ రోజున రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ అవుతోంది. ప్రేక్షకులు అందరికీ ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసేందుకు సర్వాంగ సుందరంగా.. అంగరంగ వైభవంగా రాబోతున్న గ్రాండియర్ ఈవెంట్ - అద్భుతం ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించబోతోంది.

స్టార్ మా లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9. 30 గంటలకు ప్రతి తెలుగింట్లో ప్రేక్షకుల్ని కట్టిపడెయ్యబోతోంది. శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు చూడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రం 24 X 7 స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. అంచనాలకు అందని కొత్త ఫార్మాట్ ని మరింత విన్నూతంగా విలక్షణంగా నడిపించడానికి కింగ్ నాగార్జున సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు.

షో హోస్ట్ గా నాగార్జున తనదైన స్టయిల్ లో హౌస్ ని డీల్ చేయబోతున్నారు. ఉల్టా పుల్టా అంటే ఏంటో? అసలు హౌస్ లో ఏం జరుగుతుందో? అసలు ఎలాంటి క్లూ అందడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలు స్టార్ లో ప్రసారమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఇదే చర్చ జరుగుతోంది.

ప్రతి సీజన్ మొదలవుతున్నప్పుడు - హౌస్ లోకి ఎవరు రాబోతున్నారని ప్రేక్షకుల్లో వుండే అంచనాలు, ఊహాగానాలు ఎలా వున్నా, వాటిలో నిజానిజాలు తేలిపోనున్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి భిన్నంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

Content Produced by: Indian Clicks, LLC

More News

ISRO Aditya L1:అగ్రరాజ్యాలకు మరో సవాల్ విసిరిన ఇస్రో.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1

చంద్రయాన్ 3 సక్సెస్‌తో ప్రస్తుతం ఇస్రో మంచి ఊపులో వుంది. దీనిలో భాగంగా సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైంది.

AP Govt:ఏపీలో ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం .. 20 నిమిషాల్లోనే పూర్తి, ఏంటీ కార్డ్ 2.0

తన హయాంలో ఎన్నో పాలనా సంస్కరణలను తెచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వార్డు, గ్రామ వాలంటీర్ల విధానంతో పాలనను ఇంటింటికి చేరువ చేశారు.

Chandrababu Naidu:చంద్రబాబుపై ఐటీ 'ఐ' : అమరావతిలో నిర్మాణాలు, షెల్ కంపెనీలతో కోట్లు జేబులోకి.. రట్టు చేసిన సీబీఐ

దొంగ దొరికే వరకు దొరేనంటారు. అలాగే ఏ వ్యక్తి  చేసిన నేరానికైనా శిక్ష పడాలంటే పాపం పండాలంటారు.

Aditya L1:మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపు ఆదిత్య ఎల్ 1 లాంచింగ్, మొదలైన కౌంటింగ్

చంద్రయాన్ 3 ప్రయోగంతో మంచి ఊపు మీదుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా

CBI Court :జగన్ , విజయసాయిరెడ్డిలకు ఊరట.. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ గ్రీన్ సిగ్నల్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు కోర్టులో ఊరట లభించింది.