నేరం గీతూది.. శిక్ష శ్రీహాన్‌కి, వీడియోలు చూపించి ఆడుకున్న నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మిషన్ పాజిబుల్ టాస్క్ ముగిసి శ్రీసత్య ఇంటికి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. ఇక అంతా ఆమెకు సాయం చేసి తనను కెప్టెన్ కాకుండా అడ్డుకున్నారంటూ ఇనయా కుళ్లి కుళ్లి ఏడ్చింది. ఇక వీకెండ్ కావడంతో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం బ్లూటీమ్ సభ్యులపై రెడ్ టీమ్ సభ్యులు చేసిన దౌర్జన్యంపై కడిగిపారేశారు నాగ్. ఒకరిని టార్గెట్ చేయకుండా నలుగురికి క్లాస్ పీకారు. సిగరెట్ల కోసం గీతూని నానా మాటలు అనడం సరికాదని నాగ్ సున్నితంగా మందలించారు. తప్పుని ఒప్పుకున్న బాలాదిత్య.. ఇకపై తాను సిగరెట్ తాగనని, మానేస్తానని అందరి ముందు మాటిచ్చాడు.
శ్రీహాన్ కెప్టెన్సీ సరిగా లేదని నాగ్ మండిపడ్డారు. నరికేస్తా, పీకేస్తా అన్నావు కదా ఏం చేశావ్ అంటూ ఓ వీడియో చూపించారు. అందులో గీతూ పడుకుంటే ఆదిరెడ్డి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాడు. నిజానికి ఆ పని గీతూ చేయ్యాల్సింది. గీతూ చేత పనిచేయించనందుకు, కెప్టెన్‌గా విఫలమైనందుకు శ్రీహాన్ వచ్చే వారం కెప్టెన్సీ పోటీదారులలో లేకుండా శిక్ష విధించారు నాగ్. తర్వాత రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున. దూకుడు తగ్గించుకోవాలని, మాటలు కూడా అసభ్యంగా వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా టాస్క్ సందర్భంగా ఇనయాతో వ్యవహరించిన తీరు సరికాదని చెబుతూ రేవంత్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చాడు నాగ్. మళ్లీ అలా రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇచ్చాడు.
మరోవైపు.. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్ పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాల్సిందిగా గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్. దీనికి రాజ్‌కి ఫస్ట్, ఇనయా సెకండ్ అని చెప్పిన ఆదిరెడ్డి.. మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు తర్వాతి ర్యాంకులిచ్చాడు. గీతూ విషయానికి వస్తే... తన టీమ్‌లోని శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్ ర్యాంకులిచ్చి.. శ్రీసత్య, రేవంత్, గీతూ, కీర్తిలకు తర్వాత ర్యాంకులిచ్చింది. అనంతరం ఈ వారం నామినేషన్స్‌లో వున్న ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్‌లు సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఇకపోతే.. బిగ్‌బాస్ 6లో మరో షాకింగ్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గత వారం ఎవ్వరూ ఊహించని విధంగా సూర్యను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. ఈసారి మన గలాటా గీతూని ఇంటికి పంపనున్నారని లీకులు వస్తున్నాయి. నిజానికి బిగ్‌బాస్ మొదలైన తొలి నాళ్లలో చాలా మెచ్యూర్డ్‌గా, బ్యాలెన్స్‌గా గేమ్ ఆడింది గీతూ. కానీ తర్వాత ఏమైందో కానీ గేమ్ ప్లాన్ మార్చేసింది. బిగ్‌బాస్ రూల్స్ కాకుండా తనకు తాను రూల్స్ రాసుకుని.. వీక్‌నెస్‌లని టార్గెట్ చేసుకుని గేమ్ ఆడింది. సంచాలక్‌గా ఆటను పర్యవేక్షించాల్సింది పోయి కంటెస్టెంట్‌లాగా పార్టిసిపేట్ చేసింది. అలా బోల్డెంత నెగిటివిటీని సంపాదించుకోవడంతో ఆమెకు ఓటింగ్ శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గీతూ ఎలిమినేట్ కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతోందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments