సూర్య- శ్రీహాన్‌లు నాకు అంతే.. రిలేషన్‌పై కుండబద్ధలు కొట్టిన ఇనయా, మెరీనా విశ్వరూపం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. కంటెస్టెంట్స్‌కి బదులు బిగ్‌బాసే గేమ్ ఆడుతూ వుండటంతో ఆడియన్స్‌కి ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్ వస్తోంది. దీనికి తోడు దీపావళి వేడుకలు అంబరాన్ని తాకడంతో మంచి టీఆర్పీలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే.. సోమవారం నామినేషన్స్ వుండటంతో ప్రేక్షకులు దాని కోసం తీవ్రంగా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే. అసలే బిగ్‌బాస్ తమపైన కోపంగా వుండటంతో ఇంటి సభ్యులు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. నామినేట్ చేయాలనుకుంటున్న సభ్యుడి ఫోటోను మంటల్లో వేసి తగిన కారణం చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించారు. అయితే వాసంతి, రోహిత్‌లు ఇప్పటికే నామినేషన్‌లో వున్నందున వీరిద్దరిని ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పాడు.
అలా..
శ్రీసత్య ... ఆర్జే సూర్య, మెరీనా
ఆదిరెడ్డి.. ఇనయా, మెరీనా
మెరీనా .. ఫైమా,రాజ్
గీతూ... ఇనయా, మెరీనా
బాలాదిత్య.. శ్రీసత్య, గీతూ
కీర్తి.. రేవంత్ , శ్రీసత్య
సూర్య.. ఇనయా, శ్రీసత్య
రోహిత్... గీతూ, శ్రీసత్య
ఇనయా.. శ్రీహాన్, సూర్య
ఫైమా.... శ్రీసత్య, మెరీనా
రాజ్.. ఇనయా,రేవంత్
రేవంత్.. కీర్తి, గీతూ
వాసంతి.. ఆదిరెడ్డి, ఆర్జే సూర్య
శ్రీహాన్.. మెరీనా, బాలాదిత్య
మొత్తం మీద ఈ వారం... రోహిత్, వాసంతి, మెరీనా, శ్రీసత్య, ఇనయా, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, ఆర్జే సూర్య, బాలాదిత్య, కీర్తి, రాజ్, ఫైమా, శ్రీహాన్‌లను నామినేట్ అయినట్లుగా బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.
ఇక నామినేషన్స్‌లో ఈ వారం గొడవలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేవంత్- గీతూ, మెరీనా- ఫైమాల గొడవే. కిచెన్‌లో ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే ఇబ్బందిగా వుంటుందంటూ రేవంత్‌పై కీర్తి మండిపడింది. దీంతో రేవంత్ మండిపడ్డాడు. నువ్వంటే ఇరిటేషన్, అసహ్యం వస్తుందని నేను ఎప్పుడైనా అన్నానంటూ ఇచ్చిపడేశాడు. మధ్యలో మన గలాటా పాప తలదూర్చింది. రేవంత్ చాలా సార్లు దొంగతనం చేసి ఫుడ్డు తినేశాడని ఆరోపించింది. నువ్వు నా ముందు నథింగ్ అంటూ గీతూపై మండిపడ్డాడు రేవంత్. నువ్వు నన్నేం పీకలేవని రేవంత్ అంటే.. రా పీకి చూపిస్తా గీతూ వార్నింగ్ ఇచ్చింది.
తర్వాత చెప్పుకోవాల్సింది మెరీనా - ఫైమా గొడవ. తన పని తాను చేసుకుంటూ, కిచెన్‌లో గడిపేది మెరీనా. ఒక పాయింట్ పట్టుకుని దానిపై స్ట్రాంగ్‌గా కూడా వుండేది కాదు... ఎప్పుడూ భర్త వెంటే వుంటుంది. అందుకే మెరీనా అంటే అందరికీ ఓ సాఫ్ట్ కార్నరే. తనకు డిజాస్టర్ ట్యాగ్ ఇవ్వడంపై ఫైమాని ప్రశ్నించింది మెరీనా. వయసుకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఫైమా కూడా అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చింది.
అర్జున్ కల్యాణ్ వెళ్లిపోవడంతో ఇంటిలో లవ్ ట్రాక్ నడిపేది ఎవరా అన్న సందేహాలు మీకు కలగొచ్చు. తొలుత సూర్యతో రాసుకుపూసుకుని తిరగడంతో పాటు ఒకే బెడ్‌పై పడుకుని, లాలీ పాప్‌లు తినిపించిన ఇనయా.. ఎందుకో తెలియదు కానీ తన బద్ధ శత్రువు శ్రీహాన్‌కు క్లోజ్ అయ్యింది. అయితే అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ.. ఫ్రెండ్‌లాగే నీకు బర్త్ డే కేక్ రెడీ చేశాను కానీ మరో విధంగా అనుకోవద్దు. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నానని శ్రీహాన్‌తో చెప్పింది ఇనయా. సూర్యకు కూడా బుజ్జిమాతో రిలేషన్ గురించి చెబుతూ అతనిని నామినేట్ చేసింది. నిన్ను కేవలం కంటెస్టెంట్‌గా మాత్రమే చూస్తానని ఇనయా తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments