‘అరె షన్నూ ఏంట్రా ఇది’ .. ఆడమంటే హగ్గులిచ్చావు, సన్నీ నీకు స్ట్రోక్ ఇచ్చాడు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ముగిసింది. తొలి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తగట్టుగానే వీజే సన్నీ విజయం సాధించాడు. అయితే వెబ్ సిరీస్‌లు, టిక్‌టాక్, యూట్యూబ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న షన్నూ ఓటమి రన్నరప్‌గా నిలవడం ఏంటీ.. షణ్ముఖ్ జస్వంత్ ఎక్కడ విఫలమయ్యాడంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ‘‘సిరి’’ కారణంగానే ఆయన ఓడిపోవాల్సి వచ్చిందని మెజార్టీ అభిప్రాయపడుతున్నారు.
సన్నీతో పోల్చుకుంటే షణ్ముఖ్ బాగా నోటెడ్ పర్సన్. దీంతో బిగ్‌బాస్ షో మొదలైనప్పటి నుంచే శ్రీరామచంద్ర, షన్నూలలో ఒకరు విజేత అవుతారని జనాలు ఫిక్సయ్యారు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన షన్ను తొలి వారాల్లో బెస్ట్ ఇచ్చాడు. కానీ రోజులు గడిచేకొద్ది సిరికి దగ్గరై తనలోని ఒక్కో షేడ్‌ను బయటకు తీశాడు. ఈ యాటిడ్యూడ్ హౌస్ మేట్స్‌నే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిర్రెత్తుకొచ్చేలా చేసింది. చివరికి ప్రియురాలు దీప్తి సునయన కూడా షన్నును సపోర్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. ‘అతడిని అతడిలా ఆడనివ్వండి’ అంటూ ఇన్‌స్టాలో ఓ చిన్న పోస్ట్ పెట్టి ఊరుకుంది.
సిరి- షన్నూల అతిపై మొన్నామధ్య సిరి తల్లి స్వయంగా మొట్టికాయలు వేసింది. అక్కడా మారకుండా డోసు మరింత పెంచారు. ఇది షన్నుపై ప్రేక్షకులకు నెగిటివ్ ఇంప్రెషన్‌ను పెంచింది. అంతేకాదు ప్రతి సందర్భంలోనూ ‘‘మీ మమ్మీ’’ అలా అంటుందా అంటూ పదే పదే దానిని హైలైట్ చేశాడు. షో .. చివరి వారాల్లో హగ్గుల వ్యవహారం శృతిమించడంతో పాటు మాజీ కంటెస్టెంట్స్ సైతం సిరి- షన్నూలపై సెటైర్లు వేశారంటూ పరిస్ధితి ఎక్కడిదాకా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అన్నింటికి మించి కామెడీ చేస్తే అందరూ నవ్వుతారు... ఇతను మాత్రం రివర్స్‌లో మూతి ముడుచుకుంటాడు. ఇన్ని లోపాలు పెట్టుకుని రన్నరప్ దాకా వచ్చాడంటే షన్నూ స్టామినాను అర్ధం చేసుకోవచ్చు. అదే సిరికి దూరంగా వుండి.. ఆటపై మనసు పెట్టి, కాస్త జనాన్ని నవ్వించి వుంటే బిగ్‌బాస్ 5 విజేత ఖచ్చితంగా ‘‘షణ్ముఖ్’’ అయ్యుండేవాడేమో. అయినా ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం ప్రయోజనం.. గతం గత:
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com