బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి-కాజల్‌పై యానీ మాస్టర్ ఫైర్.. ఒకరిపై ఒకరుపడ్డ జెస్సీ-శ్వేత
- IndiaGlitz, [Wednesday,October 13 2021]
బిగ్‌బాస్ 5 తెలుగు ఆరో వారంలోకి ప్రవేశించడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. నామినేషన్ల ప్రక్రియలో ఎప్పటిలాగే ఇంటిసభ్యులు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్నంత సేపు బాగానే ఉంటున్నారు. నామినేషన్ల అంశం వచ్చేటప్పటికీ మర్చిపోయిన విషయాలను కూడా తవ్వుకుంటూ గొడవకు సిద్ధమవుతున్నారు. సోమవారమే హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొనగా.. అది మంగళవారం కూడా కంటిన్యూ అయ్యింది. ముఖ్యంగా యానీ మాస్టర్, సిరి, కాజల్‌ల మధ్య గొడవ పీక్స్‌కి వెళ్లింది. మరి ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులంతా డిస్కస్ చేశారు. యాక్టర్స్ అంటూ శ్రీరామ్ అన్న మాటలకు సిరి, షణ్ముఖ్, జెస్సీలకు పట్టరాని కోపం వచ్చింది. ఇక షణ్నూని గత వారం నామినేషన్ ప్రక్రియను ఇంకా వెంటాడుతూనే వుంది. సీక్రెట్ నామినేషన్స్ అంటే 8 మంది నామినేట్ చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్ అంటే ఇద్దరే నామినేట్ చేశారు అని ఇంటి సభ్యులందరిపై మండిపడ్డాడు. ఇక తనను ప్రతివారం నామినేట్ చేస్తానన్న సన్నీ వ్యాఖ్యలపైనా ప్రియ స్పందించింది. దీనిపై ప్రియాంక దగ్గర మాట్లాడుతూ.. ఆయన నన్ను బెదిరిస్తున్నాడా? మానస్‌ని హెల్ప్ చేయమని తనే పంపానని చెప్పాడు.. సన్నీ చెబితేనే మాసన్ వింటాడా? ఆయనకు ఏం చేయాలిపిస్తే అదే చేస్తాడుగా’అంటూ సన్నీకి కౌంటర్ ఇచ్చింది. మరోవైపు యానీ మాస్టర్ని ఎందుకు నామినేట్ చేశావని విశ్వని శ్రీరామ్ ప్రశ్నించారు. ఆమె ప్రతిసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని నామినేట్ చేస్తాననడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేశానని విశ్వ రీజన్ చెప్పుకొచ్చాడు.
తెల్లవారుజామున శ్వేతా ఉగ్రరూపం ఎత్తింది. కాజల్, షణ్ముఖ్‌లను దూషిస్తూ.. రవి, యానీ మాస్టర్, ప్రియాల ముందు మాట్లాడింది. శ్వేతా కేకలు వేయడంతో హౌస్మేట్స్ ఆమెని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత 'బ్రేకప్ బ్రో.. బ్రదర్, సిస్టర్ల బ్రేకప్ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా' అంటూ కాజల్ .. శ్రీరామ్ తో చెప్పింది. 'ఐన్‌స్టీన్ లాజిక్ అర్ధం చేసుకోవడానికైనా ప్రయత్నం చేయొచ్చు కానీ వీళ్ల నామినేషన్లని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయలేం. అవి అర్ధం కావు' అంటూ షణ్ముఖ్.. జెస్సీతో అన్నాడు. ఇంత హాట్ హాట్‌గా వున్న వేళ సన్నీ బాగా ఎంటర్టైన్ చేశాడు. హామీదాను అనుకరిస్తూ ఫన్ చేశాడు. అటు డైనింగ్ టేబుల్ దగ్గర యానీ మాస్టర్ మాటలకు అందరూ పడిపడి నవ్వారు.
అనంతరం బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్‌ని నాలుగు టీమ్‌లుగా విభజించారు.
బ్లూ టీమ్‌లో మానస్, సన్నీ, యానీ మాస్టర్... ఎల్లో టీమ్‌లో షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ... రెడ్ టీమ్‌లో విశ్వ, శ్రీరామ్, ప్రియ.. గ్రీన్ టీమ్‌లో రవి, లోబో, శ్వేత వున్నారు.
రెండు గ్రూపులకు మేనేజర్‌గా కాజల్‌ను, మరో రెండు గ్రూపులకు మేనేజర్‌గా సిరిని నియమించారు. అలానే కాజల్, సిరి సంచాలకులుగా వ్యహరిస్తారని చెప్పారు. ఈ గేమ్‌లో ఎవరిదగ్గరైతే ఎక్కువ యాక్సెప్ట్ చేసిన బొమ్మలుంటాయో ఆ గ్రూపుల నుంచి కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకుంటారు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. అయితే బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడంతో.. ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస్ కామెంట్ చేశాడు. అనంతరం బొమ్మల కోసం హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు గొడవ పడడం, బొమ్మలు చింపేయడం వంటివి చేశారు. జెస్సీ-శ్వేతా గొడవ పీక్స్‌కి వెళ్లి ఒకరిపై మరొకరు పడి మరీ జుట్టుపట్టుకున్నారు. ఆ తరువాత శ్వేతా.. ఈరోజు బరాబర్ గుంజుతా అంటూ లోబో, రవిలతో తేల్చి చెప్పింది. అయితే టాస్క్ ఫిజికల్‌గా వెళ్తే మాత్రం నేను ఎక్స్ట్రీమ్ అయిపోతా అంటూ రవితో అన్నాడు షణ్ముఖ్.
మరోవైపు బొమ్మలు యాక్సెప్ట్ చేసే విషయంలో సిరి-యానీ మాస్టర్ కి మధ్య గొడవ జరిగింది. ముందుగా యానీ మాస్టర్ 'నేను యాక్సెప్ట్ చేయను.. నేను గొడవ చేస్తా' అంటూ కాజల్-సిరిలతో చెప్పగా.. 'మీకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలక్ గా మేం చూసుకుంటాం' అంటూ సిరి కేకలు వేసింది. దీంతో యానీ మాస్టర్ బరస్ట్ అయింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ సెటైర్ వేసింది. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను' అంటూ సిరి.. 'నాకు ముందొకటి వెనకొకటి మాట్లాడడం రాదు' అంటూ యానీ మాస్టర్ల మధ్య వాగ్వాదం నడిచింది.
అంతేకాదు కాజల్‌ని కూడా వదల్లేదు. కాజల్ తనతో ఎన్నో విషయాలు చెప్పారని అవి చెబుతే ఆమె ఆట తీరు పట్ల, కాజల్ కూతురు ఏమనుకుంటుందో అని వేచి చూస్తున్నానని, లేదంటే కాజల్ బండారం మొత్తం బయపెట్టస్తానని తెలిపింది. పరోక్షంగా కాజల్‌కి వార్నింగ్ ఇచ్చింది యానీ మాస్టర్. ఎంత జెన్యూన్ గా ఆడినా ఏదొకటి అంటారని నాకు తెలుసంటూ సిరి.. కాజల్ తో చెప్పుకుంది. ఆ తరువాత షణ్ముఖ్ వచ్చి సిరి-కాజల్ లతో మాట్లాడు. ఎవరెన్ని మాటలన్నా.. సైలెంట్‌గా వుండాలని సజేషన్ ఇచ్చాడు.
ఆ తరువాత సన్నీ-మానస్‌లతో డిస్కషన్ పెట్టింది యానీ మాస్టర్. 'ఈరోజు తరువాత నుంచి నేను కాజల్ మొహం కూడా చూడను' అంటూ యానీ చెప్పగా.. 'పొరపాటున కనిపిస్తే' అంటూ పంచ్ వేశాడు సన్నీ. ఇక బొమ్మల టాస్క్‌లో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ పవర్ వచ్చింది. వీరికి ప్రత్యేకమైన బొమ్మ రావడంతో దాని ద్వారా మరో టీం దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్.