బిగ్‌బాస్ 5 తెలుగు: షణ్ణూతో గొడవ.. యానీ మాస్టర్ ఓటు పవర్, జైల్లో పడ్డ సన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు ఎపిసోడ్‌లో ఈ రోజు ఇంటి సభ్యులు పంతాలు, పట్టింపులకు పోయారు. ముఖ్యంగా కెప్టెన్నీ టాస్క్‌లో జరిగిన గొడవ నుంచి కెప్టెన్ సన్నీ తేరుకోలేకపోయాడు. పదే పదే అదే తలచుకుని ఫీలయ్యాడు. ఇక వరస్ట్ పర్ఫార్మర్ ఎన్నిక సమయంలో జెస్సీ- సన్నీలకి మళ్లీ గొడవ అయ్యింది. ఆ కాసేపటికే సన్నీ- షణ్ముఖ్‌లకి వివాదం నడిచింది. ఇవన్నీ కలగలిసి చివరికి సన్నీనే ముంచేశాయి. మరి ఈ రోజు హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన గొడవ గురించి సన్నీ ఇంటి సభ్యులతో డిస్కషన్ పెట్టాడు. సంచాలక్‌గా జెస్సీ సరిగ్గా పని చేయలేదని.. రూల్స్‌కి వ్యతిరేకంగా, తన సొంత రూల్స్ పెట్టుకొని గేమ్ ఆడాడని.. ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్స్‌ని ఎలా గేమ్ నుంచి అవుట్ చేస్తారని ప్రశ్నించాడు సన్నీ. మధ్యలో కలగజేసుకున్న శ్రీరామ్.. సన్నీ సొంతంగా గేమ్ ఆడడం లేదని.. మానస్ కోసం గేమ్ ఆడాడని, ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే నాకు మండుద్ది అంటూ శ్రీరామ్.. యానీ మాస్టర్ తో చెప్పాడు. సన్నీ హౌస్ మేట్స్ అందరితో అలా దీని గురించే ముచ్చట్లు పెట్టడం కరెక్ట్ కాదని.. ఏదైనా ఉంటే నేరుగా జెస్సీతో మాట్లాడమని సలహా ఇచ్చాడు కెప్టెన్ షణ్ముఖ్. లేదంటే వీకెండ్ వరకు ఎదురుచూడమని సలహా ఇచ్చాడు. శ్రీరామచంద్ర మాస్క్ వేసుకొని ఉంటున్నాడని.. తన ట్రూ సెల్ఫ్ ఇంకా బయటకు రాలేదని కాజల్.. సన్నీ, మానస్‌లతో చెప్పింది. దానికి మానస్ కూడా అవునని.. అతనొక డిఫరెంట్ పర్సన్ అని అన్నాడు.
ఉదయాన్నే సన్నీ-కాజల్ కూర్చొని మాట్లాడుకున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు అందరూ నాగ్ సర్ ముందు అపరిచితుడులో రామానుజంలాగా నటిస్తుంటారని సెటైర్ వేశాడు సన్నీ. దానికి కాజల్ స్పందిస్తూ మనసులో ఏం పెట్టుకోవద్దని చెప్పింది. ఆ తరువాత మానస్ వచ్చి యానీ మాస్టర్ ప్రతీదానికి తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని అంటుందని.. కానీ చాలా టాస్క్‌లలో ఆమెకి హెల్ప్ చేశామని.. అయినప్పటికీ అవేవీ ఆమెకి గుర్తురావని ఫైర్ అయ్యాడు.
ఆ తర్వాత హౌస్‌లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. షణ్ముఖ్ - కాజల్ పేరు చెప్తూ.. అండర్ పెర్ఫార్మర్ అని చెప్పాడు. సన్నీ - సంచాలక్‌గా జెస్సీ బిహేవియర్ నచ్చలేదని రీజన్ చెప్పాడు. లోబో - యానీని, మానస్ - జెస్సీని, రవి - సన్నీని, కాజల్ - శ్రీరామ్‌ని, సిరి - సన్నీని, ప్రియాంక - యానీ మాస్టర్‌ని, జెస్సీ - సన్నీని, శ్రీరామ్ - కాజల్‌ని, విశ్వ - కాజల్‌ని, యానీ మాస్టర్ - ప్రియాంకలను వరెస్ట్ పర్ఫామర్స్‌గా చెప్పారు.
మొత్తంగా ఈ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షణ్ను రంగంలోకి దిగాడు. సన్నీ బస్తాను తన్నడం నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో త్రిమూర్తులకు, సన్నీకి మధ్య పెద్ద గొడవ జరిగింది. మరి సిరి కత్తి పట్టుకోవడం తప్పు కాదా? అని ప్రశ్నించాడు. జెస్సీని కావాలని తన్నాను అని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతానన్నాడు. అతడికి మద్దతుగా వాదనకు దిగారు మానస్, కాజల్. సరిగ్గా ఇదే సమయంలో యానీ ట్విస్ట్ ఇచ్చింది. తన ఓటును సన్నీకి వేయడంతో ఇంట్లో అందరికన్నా ఎక్కువగా 4 ఓట్లు రావడంతో అతడిని జైల్లో వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments