బిగ్‌బాస్ 5 తెలుగు: హైలైట్ జర్నీ అతడిడే, సన్నీ కంటతడి... మచ్చా లవ్యూ అంటూ ఎమోషనల్

  • IndiaGlitz, [Wednesday,December 15 2021]

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. హౌస్‌మేట్స్ జర్నీని చూపిస్తూ వస్తున్న బిగ్‌బాస్ .. ఇప్పటికే శ్రీరామ్, మానస్‌లకు ఆ సర్‌ప్రైజ్ ఇచ్చేశాడు. ఈ రోజు షణ్ముఖ్, సన్నీల జర్నీని చూపించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ షోకి రావాలనేది నా డ్రీమ్.. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ మచ్చా లవ్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి సన్నీ, షన్నూలు ఏం చెప్పారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

ఈ రోజు ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు బిగ్‌బాస్. ఈ జనరేషన్‌లో ముఖ్యంగా సోషల్ మీడియాలో వుండే యువతకి షణ్ముఖ్ జస్వంత్ అనే పేరు ఎంతో సుపరిచితం. మీరు ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి ప్రతిఒక్కరికీ మీరొక పోటీలా నిలిచారు. ఇది వేరే ప్రపంచం. ఇక్కడ నిజమైన మనుషులు.. వారి విభిన్న వ్యక్తిత్వాలు.. కోపాలు.. గొడవలు.. ప్రేమ.. ప్రతీఒక్కటీ నిక్కచ్చిగా ఉంటాయి. మీలోని కోణాన్ని ఒక్కొక్కటిగా అందంగా ఈ ప్రయాణం బయటకు తీసుకొచ్చింది. అర్ధం చేసుకునే మనుషులు ఉండడం.. మనసుని తేలిక పరచడమే కాక.. ఆటలో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి అర్ధం చేసుకునే స్నేహితులు మీకు ఈ ఇంట్లో దొరికారు. మీ కోపాన్ని, అసహనాన్ని దూదిలాగా పీల్చుకుంటూనే మీలోని నిప్పుని నిరంతరం వెలిగిస్తూ ముందుకు తీసుకొచ్చారు.

మీ మనసుకు దగ్గరైన వారితో అభిప్రాయబేధాలు వచ్చిన ప్రతీసారి మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారు. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు మీకు ఎంత ముఖ్యమో.. మీరు వారికోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది. వారికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్ని గొడవలైనా.. చివరిదాకా ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే.. మీ మనసులోని భారం తగ్గిందో.. అప్పటినుంచి టాస్క్ లలో పట్టుదల చూపి, బుద్ధిబలం ఉపయోగించి ఇంటి కెప్టెన్ అవ్వడమే కాకుండా.. అందరితో బ్రహ్మ అనిపించుకున్నారు. షణ్ముఖ్ ఈ ఇంట్లో మీకిష్టమైన చోటు మోజ్ రూమ్ అని బిగ్ బాస్ కి తెలుసు. అక్కడ మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు.. మీలోని కోపం, బాధ మరియు ప్రేమ అన్నింటినీ ఆ గది చూసింది. ఒక్కో వారం మీ చుట్టూ ఉన్న మనుషులను, వారి ఆటను అంచనా వేస్తూ.. మీదైన శైలిలో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఆటను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. మీ తీరులో ఆటను ఒక్కో లెవెల్ దాటించి ఫినాలే వరకు తీసుకొచ్చారు. మీ ఎన్నో జ్ఞాపకాలు మోసిన ఈ ఇంట్లో ఇప్పటివరకు సాగిన మీ ప్రయాణం ఒకసారి చూద్దాం'' అంటూ బిగ్‌బాస్ అన్న మాటలకు షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు.

ఆ తరువాత సన్నీని గార్డెన్ ఏరియాకి పిలిచారు బిగ్ బాస్. సరదా మరియు సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ఈ షో చూస్తున్న అందరికి మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు.. మీమ్మల్ని కోరుకునే స్నేహితులు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఇలా మీరు పోగు చేసుకున్నవి ఎన్నో జ్ఞాపకాలు. ఇలా అన్ని కలిసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా, అందరి మొహంపై నవ్వు తీసుకువచ్చే ఎంటర్‌టైనర్‌గా ఆవిష్కృతం చేసుకొని అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు. మీలోకి కోపం మీకు ఇబ్బందులు తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని ఎంతో బరువుగా చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు.

ప్రతి టాస్క్‌లో గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల.. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా.. మీ ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాగించిన ప్రయాణమే మళ్లీ గుర్తు చేస్తుంది. మీరు వెతుకున్న స్వప్న సుందరి కూడా మీకు త్వరలోనే దొరకాలని బిగ్‌బాస్‌ ఆశిస్తున్నాడు. అప్నా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీ ఇప్పుడు మీ సమయం వచ్చేసింది’ అంటూ ఆయన జర్నీని చూపించారు .

అంతే సన్నీ ఎమోషనల్ అయ్యాడు. బిగ్‌బాస్ షోకి రావాలనేది తన కల అని.. తనను అభిమానించే ప్రతి ఒక్కరికీ మచ్చా లవ్యూ అంటూ కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ ఆదేశం మేరకు .... తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని పట్టుకెళ్లాడు. ఇక హౌస్‌లో సిరి జర్నీ బ్యాలెన్స్ వుంది. రేపటి ఎపిసోడ్‌లో దానిని చూపించనున్నాడు బిగ్‌బాస్.

More News

తెలంగాణలోకి ఎంటరైన ఒమిక్రాన్.. హైదరాబాద్‌లో రెండు కేసులు గుర్తింపు, సర్కార్ అలర్ట్

దక్షిణాఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణ లోకి ప్రవేశించింది.

మేం తగ్గలేదు.. ‘‘అఖండ’’తో డెర్ స్టెప్ వేశాం, మల్టీస్టారర్‌కు రెడీ : బెజవాడలో బాలయ్య వ్యాఖ్యలు

నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘అఖండ’’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

"తప్పు అనిపిస్తే ఆ దేవుడినైనా ఎదురించేయ్’’... రెండు పాత్రల్లో నాని అదుర్స్

సినిమాల విషయంలో నేచురల్ స్టార్ నాని దూకుడు  పెంచారు. ఇప్పటికే టక్ జగదీశ్‌తో పర్వాలేదనిపించుకున్న ఆయన తాజాగా నటించిన చిత్రం ‘‘శ్యామ్ సింగరాయ్’’.

బైక్‌పై జారిపడినా మళ్లీ అందుకుని.. అజిత్ ‘‘వాలిమై’’ స్టంట్స్ వీడియో వైరల్

ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టి చేయడం అజిత్ స్టైల్. తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వున్నా...

జీవితంలో ఒక్కసారే ఇలాంటి ఛాన్స్ .. చిరు సార్ నమ్మకం నిలబెడతా: వెంకీ కుడుముల

మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైన సినిమా తీయాలని దర్శకులు, నిర్మాతలు .. ఆయనతో కలిసి పనిచేయాలని హీరోయిన్లు, ఇతర టెక్నషీయన్ల కల.