బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ-సిరిల మధ్య రగడ, షన్నూ తప్పించి.. హౌస్మేట్స్ మొత్తం నామినేషన్స్‌లోకి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో సోమవారం ఎపిసోడ్ హాట్‌హాట్‌గా సాగింది. నామినేషన్స్ డే కావడంతో కంటెస్టెంట్స్ మధ్య వాదనలు, విమర్శలు, గొడవలు జరిగాయి. ముఖ్యంగా సన్నీ - మానస్లు గత టాస్క్‌లను తవ్వి తీశారు. సిరీ సన్నీని నామినేట్ చేస్తూ .. టాస్క్‌లలో ఆయన ప్రవర్తన నచ్చలేదని చెప్పడంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్ధాయికి చేరింది. హైలైట్ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్ గుసగుసలు పెట్టడంతో వినేసిన సిరి... నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి హౌస్‌లో జరిగిన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
జెస్సీకి ఆరోగ్యం బాగోకపోవడంతో అతనిని ఎవరూ పట్టించుకోలేదంటూ సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో జెస్సీ బెడ్‌పై కూర్చుని ఇబ్బందిపడుతున్నప్పటికీ.. షణ్ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. అనంతరం 9వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యులందరూ.. ఎటువంటి ముసుగు లేకుండా నామినేట్ చేసే రోజు ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ చెప్పారు. హౌస్ మేట్స్ నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్స్ ముఖంపై ఫోమ్ పూసి అందుకు గల కారణాలను చెప్పాలని ఆదేశించారు.
మానస్ - శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. తనతో బాండింగ్ కుదరడం లేదని, నువ్ వెళ్లిపోతే నాకు ఫరక్ పడదని రీజన్ చెప్పాడు. దానికి శ్రీరామ్.. 'నువ్ ఉన్నా కూడా నాకు ఫరక్ పడదు' అని కౌంటర్ వేశాడు. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్తూ.. సంచాలక్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందని' రీజన్ చెప్పాడు. సిరి - ముందుగా సన్నీని నామినేట్ చేస్తూ.. టాస్క్ లలో ఆయన ప్రవర్తన నచ్చలేదని రీజన్ చెప్పింది. ఆ తరువాత యానీ మాస్టర్ ను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ అని అన్నారని.. నా గేమ్ నేను ఆడుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.
శ్రీరామ్ - సన్నీకి నాకు హెల్తీ ఈక్వేషన్ ఉంది కానీ గేమ్ తరువాత కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటున్నాడని.. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడని చెప్పాడు. కాలేజ్ చైన్ బ్యాచ్ గొడవల్లా ఉంటుందని కామెంట్ చేసి అతడిని నామినేట్ చేశాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేస్తూ.. 'నీతో మాట్లాడినా ప్రాబ్లమే.. మాట్లాడకపోయినా ప్రాబ్లమే.. నిన్ను చిన్న తమ్ముడిలా భావించాను. కానీ నువ్వేమో నాలుగైదు మాస్క్‌లు వేసుకొని ఉన్నావ్. నువ్వు ఏమైనా ఉంటే నాతో మాట్లాడడానికి ట్రై చెయ్' అని చెప్పాడు. దీనిపై మానస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగింది. రవి - అన్నీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయ్ కానీ ఎక్కడో ధైర్యం లేదని మానస్‌ని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పారు. అయితే రవి చెప్పిన రీజన్స్ తనకు నచ్చలేదని మానస్ సీరియస్ అయ్యాడు. అనంతరం కాజల్ ని నామినేట్ చేశాడు.
జెస్సీ - కాలితో తన్నడం నచ్చలేదని సన్నీని నామినేట్ చేశాడు. ఆ తరువాత మానస్‌ని నామినేట్ చేస్తూ.. సంచాలక్‌గా నేను ఫెయిర్ డెసిషన్ తీసుకోలేదని చెప్పడం కరెక్ట్ కాదని.. నాగ్ సార్ కూడా తన తప్పు లేదని చెప్పారని జెస్సీ గుర్తుచేశాడు. ప్రియాంక - స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని విశ్వని నామినేట్ చేసింది. 'ఆలోచించే విధానానికొస్తే రవి అన్నయ్య కంటే ఎవరూ బాగా ఆలోచించలేరు' అంటూ రీజన్ చెప్పింది. 'నేను బాగా ఆలోచిస్తానని.. ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నావ్.. దీనంత వరస్ట్ ఇంకొకటి ఉండదు' అంటూ పింకీపై ఫైర్ అయ్యాడు రవి. 'ఫైనల్ లో నువ్వు నేను ఉన్నప్పుడు నువ్వు కచ్చితంగా గెలవలేవని నీకు తెలుసు..?' అని రవి అనగా.. 'అది నాకు తెలుసు కాబట్టే నేను నామినేట్ చేస్తున్నా' అంటూ కౌంటరిచ్చింది ప్రియాంక.
సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు. ఫ్రెండ్ కోసం నువ్వు స్టాండ్ తీసుకోగా, నేను తీసుకుంటే తప్పేంటని కెప్టెన్సీ టాస్క్ విషయంలో సిరిని, సంచాలక్‌గా తాను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని జెస్సీని నామినేట్ చేశాడు. విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్ చేశాడు. కండబలం, బుద్దిబలం ఉన్నాయని ప్రియాంక నామినేట్ చేయడం నచ్చలేదని విశ్వ రీజన్ చెప్పాడు. మానస్ మూడో వారంలో చేసిన ఓ పనిని గుర్తు చేశాడు. కాజల్.. రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేసింది. తనని స్నేక్ అంటూ, తాను ఎదుగుదలను అడ్డుకున్నానో చెప్పాలంటూ రవిని నామినేట్ చేసింది. యానీ మాస్టర్.. సిరి, కాజల్‌లను నామినేట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో తనపై ఎటాక్ చేశారని తెలిపింది. తనకు కాజల్ బిహేవియర్ నచ్చడం లేదని నామినేట్ చేసింది.
షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. సన్నీ కోపంగా ఉంటాడని, కానీ మానస్‌తో తనకు మంచి ర్యాపో ఉందని, తనని అర్థం చేసుకోవడం లేదని రీజన్ చెప్పాడు. ప్రియాంకని నామినేట్ చేస్తూ తన గేమ్ తనే ఆడాలని సూచించాడు. ఫోమ్ అంటించేందుకు షణ్ముఖ్ రాగా, ప్రియాంక ముఖానికి గట్టిగా కొట్టుకుంది. అయితే ఇలా నామినేట్ చేస్తూ ఇంటి నుంచి పంపిస్తే తన గేమ్ తాను ఎలా ఆడాలని క్వశ్చన్ చేసింది. మొత్తం మీద ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్ సేవ్ అవ్వగా... మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com