బిగ్‌బాస్ 5 తెలుగు: స్విమ్మింగ్‌పూల్‌లో దిగనన్న సిరి.. తనకు తాను షూట్ చేసుకున్న సన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు పదకొండో వారంలో తొలి రెండు రోజులు ఎమోషనల్‌గా, పెద్దగా గొడవలు లేకుండా సాగిన ఎపిసోడ్లు ఈరోజు మళ్లీ రచ్చ లేపాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా సన్నీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టీషర్ట్స్ వ్యవహారం ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాయి. ఇక సిరి పోటీమధ్యలో నుంచి తప్పుకుని ఆమెకు బదులుగా సన్నీని రంగంలోకి దింపింది. అలా ఎందుకు జరిగింది.. సిరి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది.. టీషర్ట్స్ వ్యవహారానికి ఎలా ఎండ్ కార్డ్ పడిందో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సేంది.
ముందు రోజు ఎపిసోడ్‌లో సన్నీకి స్పెషల్ పవర్ లభించిన సంగతి తెలిసిందే. దీంతో అతనిని బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఈ పవర్ తో ఒక హౌస్ మేట్ దగ్గర ఉన్న సగం గోల్డ్ తీసుకొని వేరొక హౌస్ మేట్ కి ఇవ్వాలి. సిరిని సెలెక్ట్ చేసుకొని ఆమె దగ్గర సగం గోల్డ్ ని షణ్ముఖ్ కి ఇచ్చాడు సన్నీ. అటు ‘‘ నీ ఇల్లు బంగారం కాను ’’ టాస్క్ కంటిన్యూ అయ్యింది. మొదటి రౌండ్‌లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. పంప్ సహాయంతో బెలూన్స్ లో గాలిని నింపుతూ పగలగొట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ని పగలగొడతారో వాళ్లే మొదటి కెప్టెన్సీ పోటీదారులవుతారు. ఈ టాస్క్ లో ప్రియాంక ఎక్కువ బెలూన్స్ పగలగొట్టడంతో ఆమె మొదటి కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికైంది.
మధ్యలో సిరి అంతగా ఏడవడానికి కారణం ఏంటని తెలుసుకోవడానికి కెప్టెన్ రవి ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు. షణ్ముఖ్ అంతగా ఏమన్నాడని ప్రశ్నించగా.. నాదే తప్పని బదులిచ్చింది సిరి. మేటర్‌ను ఇద్దరూ ఒకరినొకరు సీరియస్‌గా తీసుకుంటున్నారని తనకు అనిపిస్తుందని రవి అన్నాడు. మీరే ఆలోచించుకోండి అంటూ రవి సలహా ఇచ్చాడు.
అనంతరం శ్రీరామచంద్రకి పవర్ రూమ్ యాక్సెస్ రావడంతో కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన అతడికి 30 గోల్డ్ ఇచ్చి పవర్ టూల్ తీసుకోమని ఆదేశించారు బిగ్‌బాస్. ఆ టూల్‌ను తనే తీసుకుంటానని చెప్పాడు శ్రీరామ్. అయితే కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకొచ్చి ఇంటి సభ్యులతో బేరం పెట్టాడు. పవర్ గురించి చదివే ముందు హౌస్ మేట్స్ కి ఆఫర్ ఇస్తున్నానని చెప్పిన శ్రీరామ్.. పవర్ టూల్ కావాలంటే 50 గోల్డ్ తనకు ఇవ్వాలని తెగేసి చెప్పాడు. ఇంటి సభ్యులు ఆలోచించే లోపే శ్రీరామ్ కి గోల్డ్ ఇచ్చి పవర్ టూల్ తీసుకున్నాడు రవి. ఇంతకీ పవర్ ఏంటంటే.. 'మీ దగ్గర ఉన్న సగం బంగారాన్ని తిరిగి బిగ్ బాస్‌కి ఇవ్వండి. మీరు ఇస్తున్న సగం బంగారాన్ని తిరిగి స్టోర్ రూమ్ లో పెట్టండి' అని చెప్పారు బిగ్ బాస్. రవి దగ్గర గోల్డ్ లేకపోవడంతో గమ్మునుండిపోయాడు. శ్రీరామ్.. రవికి బాగా చెక్ పెట్టాడని హౌస్ మేట్స్ అంతా చర్చించుకున్నారు.
సెకండ్ రౌండ్‌లో సన్నీ-సిరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండడంతో వీరిద్దరూ తలపడాల్సి ఉంటుంది. టాస్క్ ఏంటంటే.. పోటీదారులిద్దరూ స్విమ్మింగ్ పూల్ ప్రారంభంలోనే ఉన్న టీషర్ట్‌ను ఒక్కొక్కటిగా ధరించి పూల్‌లోకి దూకి.. పూల్ ఇంకోవైపు ఉన్న టీషర్ట్స్‌లో మళ్లీ ఇంకొకటి ధరించి పూల్‌లోకి దూకి స్టార్ట్ పాయింట్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగేప్పటికీ ఎవరైతే ఎక్కువ టీషర్ట్స్ ధరిస్తారో వాళ్లు గెలిచినట్లే లెక్క.
బిగ్‌బాస్ ఇచ్చేది నీళ్ల టాస్క్ కావడంతో సిరి తన వ్యక్తిగత, ఆరోగ్య కారణాల వల్ల ఆడలేనని చెప్పింది. తన స్థానంలో మరొకరు టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉందా? అని కెప్టెన్ రవి కోరడంతో అందుకు బిగ్‌బాస్ యాక్సెప్ట్ చేశారు. తన తరఫున టాస్క్‌లో పాల్గొన్న వారు గెలిస్తే సిరి గెలిచినట్టే లెక్క. షణ్ముఖ్ సూచన మేరకు సిరి.. మానస్‌ను తనకు బదులుగా రంగంలోకి దింపింది. ఇందులో సన్నీ వేగంగా ఎక్కువ టీషర్ట్స్ ధరించాడు. కాకపోతే అతను టీషర్ట్స్ సరిగ్గా ధరించకపోవడంతో ఐదు ఫెయిల్ అయ్యాయి. దీంతో 22 టీషర్ట్‌లను సరిగ్గా ధరించిన మానస్ విజేతగా నిలిచి సిరిని గెలిపించాడు.
అయితే టాస్క్ రూల్స్ తనకు సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద చిందులు తొక్కాడు సన్నీ. అలాగే తన స్నేహితులు మానస్, కాజల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన టెన్షన్ తగ్గించుకునేందుకు చివరికి తనని తాను షూట్ చేసుకున్నట్టు చేతితో గన్‌పేల్చుకుని స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు సన్నీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout