బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్‌లో స్వీట్ మెమొరీస్.. ఆ సర్‌ప్రైజ్‌కి శ్రీరామ్, మానస్ ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు 100వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఇన్ని రోజుల పాటు తమ జర్నీని గుర్తు చేసుకుని మానస్, సన్నీ ఎమోషనల్ అవుతూ వుంటారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు వున్నామని.. ఎలాగైనా గెలిచి ఇంటికి వెళ్లాలని ఇద్దరూ అనుకుంటూ వుంటారు. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా తమ జర్నీని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి గురవుతూ వుంటారు. మరి ఆ వివరాలేంటో తెలియాంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
మానస్, సన్నీలు స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ వుంటారు. ఫస్ట్ వీక్ నుంచి 15వ వారం వరకు హౌస్‌లో ఉండటమంటే మాటలు కాదంటూ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మానస్.. సన్నీతో మాట్లాడుతూ.. ‘‘మొదటి వారమే ఇంటికి వెళ్లిపోతాం అనుకున్నాం మనమిద్దరం’’ అన్నాడు. దీనికి సన్నీ స్పందిస్తూ.. ‘‘టెన్షన్‌గా ఉంది మచ్చా.. ఆటకు దగ్గర్లో ఉన్నాం... ఇంకో వారం మచా.. ఎట్లాగైనా గెలవాలి. ఇది నా డ్రీమ్. మా అమ్మకు కప్పిస్తా... బరాబర్ 100 పర్శంట్ ఇస్తా’’ అని చెప్పాడు.
అటు సిరి, షన్నూలు కూడా ఫైనల్ గురించే మాట్లాడుకుంటూ వుంటారు. నీకు దెబ్బ తగిలిన తర్వాత ఒకరి కోసం ఒకరం ఉన్నాం. మిగతా హౌస్‌మేట్స్ ఎవరినీ పట్టించుకోకుండా నిన్నే చూసుకుంటున్నా.. అదెలా కంటిన్యూ అయిపోతాం కదా. బ్యాక్ టూ గేమ్‌లోకి వచ్చేయాలనే ఆలోచనలో ఉండం కదా అన్నాడు షన్ను. దీనికి సిరి బదులిస్తూ... ‘‘జెస్సీగాడు మాకు రాడ్ వేసేశాడు.. కొట్టడం ఒక్కటే లేటు.. వాడు మాకు హింట్ ఇచ్చాడు అని అంది. శ్రీరామ్ కలగజేసుకుని 14వ వారాల తర్వాత హింట్ ఏమిటీ బ్రో.. 2వ వారం నుంచే హింటు ఇస్తూనే ఉన్నారు అని అన్నాడు.
అనంతరం బిగ్‌బాస్ ఫైనలిస్టులైన శ్రీరామ్, సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్‌ల జర్నీని ప్రేక్షకులకు, వారికి చూపించేందుకు సిద్ధమయ్యాడు బిగ్‌బాస్. తొలుత ఫస్ట్ ఫైనలిస్టు శ్రీరామ్‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూపించాడు. ‘‘మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని అలరించారు. మీ పోరాటం, ఫ్రెండ్స్ కోసం నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి అని బిగ్‌బాస్ ప్రశంసించారు. ఇది విని శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్ అవకాశమివ్వగా శ్రీరామ్ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు.
తర్వాత మానస్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుగ్గా హౌస్‌లోకి వచ్చిన మీరు.. ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. తెలివి, మనసుని కలిపి ఉపయోగించడం మీకు సాధ్యమైందన్నారు. అదే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని, ఫైనలిస్ట్ గా చేసిందని చెప్పారు. తర్వాత ఒక ఫొటోగ్రాప్ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసి రెండు ఫొటోలు తీసుకున్నాడు. అందులో అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్ సన్నీతో ఉన్న ఫోటోను తీసుకెళ్లాడు. ఈ ఎపిసోడ్‌లో మానస్, శ్రీరామ్‌ల జర్నీ మాత్రమే బిగ్ బాస్ చూపించాడు. సోమవారం నాటి ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీల జర్నీని చూపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments