బిగ్‌బాస్ 5 తెలుగు: త్యాగాలు.. కన్నీళ్లు, ఉద్వేగంగా మారిన ఇల్లు.. ఈ వారం నామినేషన్స్‌లో వున్నది వీరే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ప్రియా వెళ్లిపోయిన షాక్ నుంచి హౌస్ మేట్స్ ఇంకా తేరుకోలేదు. ఇక లోబో.. రవికి వ్యతిరేకంగా మాట్లాడటంపై ఇంట్లో గుసగుసలు వినిపిస్తూ వుంటాయి. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఉత్తరాలకు సంబంధించి హౌస్‌లో ఏమోషన్స్ నడిచాయి. పింకీ కోసం లోబో త్యాగం చేస్తాడు. బాధపడుతున్న శ్రీరామ్‌ను ఓదార్చేందుకు ప్రియాంక ముద్దులు పెట్టడం హైలెట్‌గా నిలిచింది. తొలిసారిగా కాజల్ ఇంటిలో ఏడవటంతో హౌస్‌మేట్స్ షాకయ్యారు. మరి ఆ ఉత్తరాలలో ఏముందో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
ముందుగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 షో ప్రారంభించి యాభై రోజులు గడిచినందుకు గాను అందరికీ అభినందనలు తెలియజేస్తారు బిగ్‌బాస్. ఆ వెంటనే నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. కంటెస్టెంట్స్‌కి బాగా ఇష్టమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని చెప్పాడు. నామినేషన్స్‌లో భాగంగా పోస్ట్‌మేన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. పోస్ట్ బ్యాగ్ లోపల ఇద్దరు హౌస్‌మేట్స్‌కు వారి ప్రియమైన వాళ్లు.. వారి కోసం పంపిన లేఖలు ఉంటాయని చెప్పారు. పవర్ రూమ్ కి వచ్చిన సభ్యులు.. ఏ ఇద్దరి ఇంటి సభ్యులు లేఖలైతే వారి దగ్గరున్నాయో వారిద్దరి నుంచి ఎవరికి లేఖను ఇస్తారో.. ఎవరి లెటర్ ను చించేస్తారో నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరికైతే పవర్ రూమ్ లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్ అవుతారు.
ముందుగా శ్రీరామ్, మానస్‌లను పవర్ రూమ్ లోకి పిలవగా.. వారికి ప్రియాంక-లోబో లేఖలు వచ్చాయి. ప్రియాంకకు తన తల్లిదండ్రుల నుంచి లేఖ రావడంతో అదే విషయాన్ని లోబోకి చెప్పి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. 'చాలా ఏళ్ల నుంచి తాను మా నాన్నగారితో మాట్లాడలేదు' అంటూ పింకి చెప్పింది. తన భార్య గర్భవతి అని ఎలా ఉందో తెలియదని.. ఈ లెటర్ తనకు కూడా ఇంపార్టెంట్ అని లోబో అన్నాడు. కానీ ప్రియాంక కోసం లేఖ ఇవ్వమని చెప్పాడు. శ్రీరామ్-మానస్‌లు కూడా ప్రియాంకకు లెటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రియాంకకు లెటర్ ఇచ్చి.. లోబో లెటర్ చించేయడంతో అతడు ఏడ్చేశాడు. షణ్ముఖ్-రవిలను పవర్ రూమ్ లోకి పిలవగా.. వారిని సిరి-విశ్వల లేఖలు వచ్చాయి. విశ్వ ఏడుస్తూ.. సిరిని రిక్వెస్ట్ చేయడంతో 'తీస్కో' అంటూ ఆమె సైతం ఎమోషనల్‌గానే ఆన్సర్ ఇచ్చింది.
తర్వాత పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ చిరిగిపోతున్నందుకు ఎంతగానో ఫీలైంది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే శ్రీరామ్.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలని చెప్పి రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను పైకి చదివి వినిపించాడు. తర్వాత శ్రీరామ్‌కు ఇల్లు గుర్తు రావడంతో బాగా ఎమోషనల్ అయ్యాడు. దీనిని గమనించిన పింకీ అతడికి హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టి ఓదార్చే ప్రయత్నం చేసింది.
యానీ మాస్టర్-సిరిలకు షణ్ముఖ్-కాజల్‌ల లెటర్స్ వచ్చాయి. దీంతో షణ్ముఖ్.. కాజల్‌ని లెటర్ తీసుకోమని చెప్పగా.. సిరి మాత్రం ఇవ్వనని చెప్పింది. కొంతసేపు ఇద్దరూ ఎమోషనల్ అయిన తరువాత కాజల్ ని లెటర్ తీసుకోమని చెప్పాడు షణ్ముఖ్. 'అమ్మా.. క్యాన్సర్ వచ్చినప్పుడు సర్వైవ్ అయ్యావ్.. అమ్మమ్మ చనిపోయినప్పుడు సర్వైవ్ అయ్యావ్.. నువ్వే నా ఇన్స్పిరేషన్.. ఐ విల్ సర్వైవ్ దిస్' అంటూ ఏడ్చేశాడు షణ్ముఖ్. అనంతరం అక్కడ వుండలేక బెడ్రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేశాడు .
ఆ తర్వాత సన్నీని పవర్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్.. కెప్టెన్‌గా అతడికొక స్పెషల్ పవర్ ఉంటుందని చెప్పారు. జెస్సీకి మాత్రమే లెటర్ రాలేదని.. ఆ లెటర్ నీ చేతుల్లో ఉందని తెలిపారు. జెస్సీని నామినేట్ చేయాలనుకుంటే దానిని చించేసి.. నామినేట్ చేయమని.. సేవ్ చేయాలనుకుంటే ఇప్పటివరకు సేవ్ అయిన వాళ్లలో ఎవరైనా ఒకరి దగ్గర నుంచి లెటర్ తీసుకొని చించేసి.. అప్పుడు జెస్సీని సేవ్ చేయమని ఆదేశించారు. దీంతో శ్రీరామ్ జెస్సీ కోసం త్యాగం చేయాలని డిసైడ్ అయి తన లెటర్‌ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీనికి తొలుత జెస్సీ నో చెప్పినా.. ఫైనల్‌గా లెటర్ తీసుకున్నాడు. దీంతో శ్రీరామ్ జెస్సీ కోసం నామినేషన్‌లోకి వెళ్లాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com