బిగ్‌బాస్ 5 తెలుగు: కెప్టెన్సీ కోసం పాడరాని పాట్లు.. పేడలో షణ్ముఖ్, చెమట చిందించిన శ్రీరామ్

  • IndiaGlitz, [Wednesday,October 27 2021]

బిగ్‌బాస్ 5 తెలుగులో 51వ రోజు ఎపిసోడ్స్ కాస్త ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ల మేళవింపుగా సాగింది. సోమవారం రవి, లోబో, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్, సిరి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అమ్మ రాసిన లెటర్ ‌చదువుతూ కెప్టెన్ సన్నీ ఎమోషనల్ అయ్యాడు. షణ్ముఖ్, సిరి తమ మధ్య వున్న గ్యాప్‌ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. మానస్, సన్నీలు... గత వారం ప్రియా, ప్రియాంకలతో నామినేషన్ సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశాల్ని అనుకరించి కడుపుబ్బా నవ్వించారు. ఇక కెప్టెన్సీ టాస్క్‌‌లో కంటెస్టెంట్స్ చెమటలు కక్కారు. మరి ఈ రోజు బిగ్‌బాస్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.

మంగళవారం నాటి ఎపిసోడ్ లో సన్నీ తన తల్లి లెటర్ చూడగానే ఏడుపొచ్చిందంటూ ఒక్కడే కూర్చొని ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత షణ్ముఖ్.. సిరి ముచ్చట్లు పెట్టాడు. ఈ సందర్భంగా విశ్వ చాలా సెల్ఫిష్ అని, లెటర్ టాస్క్ విషయంలో ఆయన ప్రవర్తన నచ్చలేదని కామెంట్ చేశాడు. నామినేషన్స్ అంటే చాలు భయపడతాడని అన్నాడు.

ఇక ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌‌లో ఉన్నారా అని మానస్-ప్రియాంక-సిరి మాట్లాడుకుంటున్న సమయంలో 'నేను మానస్ టాప్ 5 లో ఉంటామని' ప్రియాంక.. సిరితో బల్లగుద్ది చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఆ తరువాత మానస్ 'అంకుల్స్ అందరూ బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లందరూ లోపల ఉండాలి' అని కామెంట్ చేశాడు. వెంటనే రియాక్ట్ అయిన సిరి 'ఆంటీలంటే పింకీ వెళ్లిపోవాలి మరి' అని నవ్వుతూ కౌంటర్ వేయగా.. 'మొహం పగిలిపోద్ది' అంటూ నవ్వేసింది ప్రియాంక.

ఆ తరువాత రవి-షణ్ముఖ్ ముచ్చట్లు పెట్టారు. ముందుగా రవి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ చెప్పాడు. అనంతరం సన్నీ-కాజల్ కూర్చొని లెటర్స్ క్రష్ చేయడంపై చర్చించుకున్నారు. షణ్ముఖ్‌కి వాళ్ల మమ్మీ, మానస్‌కి వాళ్ల నాన్న లెటర్స్ రాశారని.. అందరూ ఫస్ట్ టైం లెటర్ రాసి ఉంటారని.. అలాంటి లెటర్స్‌ని చించివేస్తుంటే ఎంతో బాధగా అనిపించిందని ఎమోషనల్ అయింది కాజల్.

ఇక ఈవారం కెప్టెన్ ఎవరన్న దానిపై హౌస్‌మేట్స్ కి 'అభయహస్తం' అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా ఇల్లు మొత్తం లాక్ డౌన్‌లో ఉంటుందన్న బిగ్ బాస్... చాలెంజ్ గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశంతో పాటూ ఇంట్లోకి ప్రవేశిస్తారని చెప్పారు. ఐదు ఛాలెంజ్ లను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ లలో ఎవరెవరైతే పోటీ పడతారో.. హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని ఆడాలని చెప్పారు. ఒక ఛాలెంజ్ లో ఓడిపోయిన సభ్యులు.. హౌస్ మేట్స్ ని ఒప్పించి మరొక ఛాలెంజ్ లో పాల్గొనొచ్చని బిగ్ బాస్ చెప్పారు.

ఫస్ట్ ఛాలెంజ్ మట్టిలో ముత్యాలు:

ఈ టాస్క్ ప్రకారం.. పేడతో నిండివున్న బాత్ టబ్ లో దిగి ముత్యాలను ఏరాల్సి ఉంటుంది. అలా ఏరిన ముత్యాలను నీళ్లలో కడిగి వేరే బౌల్ లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ టాస్క్‌లో లోబో-షణ్ముఖ్ పాల్గొనగా.. షణ్ముఖ్ ఎక్కువ ముత్యాలను సంపాదించాడు. అయితే అతడి ముత్యాల్లో పేడ ఎక్కువ ఉందని విశ్వ, శ్రీరామ్.. సన్నీకి చెప్పగా.. 'వందమంది వందవాగుతారు పట్టించుకోవద్దని.. సంచాలక్ గా నీ నిర్ణయం తీస్కో..' అని షణ్ముక్.. సన్నీకి సూచించాడు.

దానికి విశ్వాకి కోపం వచ్చింది. ఆ వందమందిలో నువ్వున్నావా అనేసరికి ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. మరోవైపు కాజల్‌పై లోబో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు అక్కడికి పోయి మాట్లాడుకో అని చెప్పడంతో నీకు వినే ఉద్దేశం లేకపోతే చెవులు మూసుకో అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది కాజల్. ఎక్కడికో వెళ్లి మాట్లాడాల్సిన అవసరం తనకేం లేదని ఇక్కడే ఉంటా.. బరాబర్ మాట్లాడతా అని కాజల్ తేల్చిచెప్పింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో షణ్ముఖ్ విజేతగా నిలిచినట్లు చెప్పాడు సన్నీ. దీంతో షణ్ముఖ్ మొదటి కెప్టెన్సీ కంటెండర్‌గా సెలక్ట్ అయ్యాడు.

సెకండ్ ఛాలెంజ్ ... గాలం మార్చే మీ కాలం:

రెండో ఛాలెంజ్‌గా ‘గాలం మార్చే మీ కాలం’ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్‌ ఫూల్‌ అడుగున ఉన్న బాటిల్స్‌ని ఫిషింగ్‌ రాడ్‌తో బయటకు తీయాలి. ఎండ్‌ బజర్‌ మోగేలోపు ఎవరు ఎక్కువ బాటిల్స్‌ని బయటకు తీస్తారో వారే విజయం సాధించినట్లు. ఇందుకోసం రవి, సిరి హోరా హోరిగా తలపడ్డారు. చివరకు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి (12)పై గెలిచింది.

థర్డ్ ఛాలెంజ్... తాడులు తకదిమి

మూడో చాలెంజ్‌గా తాడుల తకదిమి టాస్క్‌ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో ఎవరైతే రోప్‌లను ఎక్కువగా వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలిచినట్లు లెక్క. దీని కోసం శ్రీరామచంద్ర, మానస్‌ పోటీ పడ్డారు. మానస్‌ తాడులను వదిలేయడంతో శ్రీరామ్‌ విజయం సాధించాడు. మొత్తం మీద కెప్టెన్సీ పోటీదారులుగా షణ్ముఖ్‌, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించగా.. మిగిలిన సభ్యులంతా బయటే ఉన్నారు.

More News

‘వరుడు కావలెను‘ లో భూమి పాత్ర చాలా ఛాలెంజింగ్ అనిపించింది - రీతువర్మ

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వరుడు కావలెను' సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది.

యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా చూసే సినిమా రొమాంటిక్ - హీరో ఆకాష్ పూరి

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: త్యాగాలు.. కన్నీళ్లు, ఉద్వేగంగా మారిన ఇల్లు.. ఈ వారం నామినేషన్స్‌లో వున్నది వీరే..!!

బిగ్‌బాస్  5 తెలుగు విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ప్రియా వెళ్లిపోయిన షాక్ నుంచి హౌస్ మేట్స్ ఇంకా తేరుకోలేదు.

బాల్యం నుంచి హీరోల వరకు... ఒక్కసారి గతంలోకి వెళ్లిన దేవరకొండ బ్రదర్స్, ఆసక్తికర అంశాలు.. ఇవిగో!

టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.

రొమాంటిక్ సినిమాకు చాలా ఇష్టంగా ప‌నిచేశాం -  సంగీత ద‌ర్శ‌కుడు సునిల్ క‌శ్య‌ప్‌

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.