బిగ్‌బాస్ 5 తెలుగు: షన్నుకు ముద్దుపెట్టి.. యానీపైకి కత్తి తీసిన సిరి, టాస్క్‌లో సన్నీ- శ్రీరామ్‌ వార్

  • IndiaGlitz, [Friday,October 29 2021]

బిగ్‌బాస్ 5 తెలుగు 54వ ఎపిసోడ్ ఆద్యంతం మరింత రక్తి కట్టించింది. రవితో ఫ్రెండ్‌షిప్ చేయాలని ఎవరికీ లేదని మానస్ కామెంట్ చేశాడు. రవి అర్థరాత్రి షణ్నూ, సిరి కాళ్లకు మొక్కాడు. ఆ తర్వాత షణ్ణూకి సిరి ముద్దు పెట్టడంతో అతను షాకయ్యాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ఎలిమినేట్ అయిన ప్రియా పేరు తీసుకొచ్చి సన్నీని రెచ్చగొట్టాడు శ్రీరామ్. ఆపై యానీ మీదకు కత్తి తీసుకొచ్చింది సిరి. మరి అలా జరగడానికి దారి తీసిన కారణాలేంటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే.

షో ప్రారంభమవ్వగానే మానస్‌ ఏదో గుండ్రటి వస్తువు తెచ్చి, షణ్ముఖ్‌, సిరిలపై వేశాడు. దీంతో కాసేపు నవ్వులు పూశాయి. ఆ తర్వాత జెస్సీ ప్రస్తావన తీసుకొచ్చాడు కెప్టెన్‌ సన్సీ. యానీ మాస్టర్‌ కోసం డ్రాప్‌ అవుతున్నానని ముందు చెప్పాలని, ముందు ఒక మాట, తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారని జెస్సీపై అసహనం వ్యక్తం చేశాడు సన్నీ. అంతేకాదు గేమ్‌లు ఆడటం కాదు, ఓటింగ్‌నే ప్రధానంగా తీసుకుంటున్నారు. అందుకే గేమలను సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్ చేశాడు సన్నీ.

ఆ తర్వాత పింకీతో రవి గురించి మానస్ ముచ్చట్లు పెట్టాడు. అతనితో ఫ్రెండ్‌షిప్ చేయాలని ఎవరికీ లేదని షాకయ్యాడు. ఇదే సమయంలో అర్ధరాత్రి షణ్ణూ, సిరిల కాళ్లకు మొక్కాడు రవి. అప్పుడు వాళ్లిద్దరూ మెలుకువగా వున్నా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆపై ఉన్నట్లుండి షణ్ణూకి ముద్దు పెట్టింది సిరి. దీంతో షాకైన షణ్ముఖ్ తనలో తాను నవ్వుకున్నాడు. మళ్లీ వచ్చిన సిరి.. నీ వల్లే మెంటల్‌గా డిస్టర్బ్‌ అవుతున్నానని.. నేను నీతో ఉంటే ప్రాబ్లమా? అని షణ్నుని ప్రశ్నించింది. వీటికి షణ్ను బదులిస్తూ.. నా వల్ల చిరాకు అనిపిస్తే దూరం పెట్టొచ్చు అని కుండబద్ధలు కొట్టాడు . అంతేకాదు నీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను మాట్లాడనురా, అదే బెస్ట్‌ అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి మళ్లీ అలిగి వెళ్లిపోయింది.

అనంతరం 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. ఇందులో భాగంగా థర్మాకోల్‌ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్‌ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్‌ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్‌ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! టాస్క్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రత్యర్థుల సంచులను ఖాళీ చేయడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చని బిగ్‌బాస్‌ తెలిపాడు. ఈ గేమ్‌లో శ్రీరామ్‌, సన్నీ, షణ్ను, సిరి, యానీ, మానస్‌ పోటీపడ్డారు. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. సంచాలకుడిగా ఉన్న జెస్సీ మొదటి సారి ఆటని రద్దు చేసి మరోసారి చేయించాడు.

అయితే సన్నీ అవుట్‌ అయ్యాడని సంచాలకుడు జెస్సీ ప్రకటించాడు. కానీ అతడు వెళుతూ వెళుతూ తన ఫ్రెండ్‌ మానస్‌ను గెలిపించాడని కామెంట్ చేశాడు శ్రీరామ్‌. అంతేకాదు ప్రియగారు కరెక్ట్‌ ఆడారంటూ అతడిని మరింత రెచ్చగొట్టాడు. 'సన్నీ ఇండిపెండెంట్‌ ప్లేయర్‌ అనుకున్నా.. ఓడిపోయినవ్‌, అందుకే బయటున్నవ్‌..' అంటూ ఇంకా రెచ్చగొట్టాడు శ్రీరామ్‌. తర్వాతి రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ను కింద పడేయగా సంచాలకుడైన జెస్సీ వీళ్లిద్దరూ అవుట్‌ అని ప్రకటించాడు. అతడి నిర్ణయం సరైనది కాదన్న సన్నీ.. కోపంతో జెస్సీ ముందున్న బ్యాగును తంతూ రెచ్చిపోయాడు.

ఈ విషయంలో జెస్సీతో, శ్రీరామ్‌తో మరోసారి గొడవ అయ్యింది. సన్నీ సైతం బాగా రెచ్చిపోయాడు. ఎట్టకేలకు మానస్‌ తప్పుకున్నాడు. చివరగా అనీ మాస్టర్‌, షణ్ముఖ్‌, సిరి పోటీ పడ్డారు. ఇందులో సిరి, షణ్ముఖ్‌ కలిసి ఆడుతున్నారని, ఒకరికొరు సపోర్ట్ చేస్తున్నారని వాపోయింది అనీ మాస్టర్‌. ఒంటరిగా గేమ్‌ ఆడటం లేదని వాపోతూ ఆమె మధ్యలోనే క్విట్‌ అయ్యింది. అయితే ఆమె తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుకుంది. ఇది చూసి షాకైన ఇంటిసభ్యులు అది తప్పంటూ వారించడంతో ఆమె చాకు కిందపడేసింది. ఈ సందర్భంగా షణ్ముఖ్‌పై గట్టిగా ఫైర్‌ అయ్యింది యానీ. మగాడయితే గేమ్‌ ఆడాలని .. అంతేకాదు పందులు గుంపులుగా ఆడతాయని, సింహం ఒంటరిగానే ఆడుతుందని చెప్పింది. ఈ ఇంట్లో ఉన్నంతవరకు తాను కెప్టెన్‌ అవ్వను అంటూ ఏడ్చేసింది. దీంతో యానీ మాస్టర్‌ని సముదాయించే ప్రయత్నం చేశారు రవి, విశ్వ, ప్రియాంక. చివరి రౌండ్‌లో సిరిపై షణ్ముఖ్‌ విజయం సాధించి కెప్టెన్‌ అయ్యాడు.