బిగ్‌బాస్ 5 తెలుగు: రక్తంతో దిష్టి... దీప్తి కావాలన్న షణ్ముఖ్, బాత్‌రూమ్‌లో తలబాదుకున్న సిరి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ దిశగా సాగింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాల్సిన ఇంటి సభ్యులు సహచర కంటెస్టెంట్స్‌తో ఆడుకుంటున్నారనే ఫిలింగ్ కలిగింది. షణ్ముఖ్ - సిరిల వ్యవహారం చూస్తే అది నిజమే అన్నట్లుగా వుంటుంది. షన్నూ.. సిరిని నానా రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ‘‘అమ్మేస్తా’’ అనే పదంతో షణ్ముఖ్... ఆమెను తీవ్రంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మరి దీనికి దారితీసిన కారణాలేంటో.. హౌస్‌లో జరిగిన సంఘటనలేంటో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
సోమవారం నాటి నామినేషన్స్‌పై ఇంటి సభ్యులు డిస్కషన్ పెట్టుకున్నారు. దాని నుంచి అంత ఈజీగా బయటకు రాలేకపోయారు. కాజల్ అయితే.. సిరికి నేనంటే ఇష్టం లేదు, ఎఫెక్షన్ లేదంటూ కంటతడి పెట్టింది. దీనిపై యానీ మాట్లాడుతూ... అదంతా డ్రామా, స్ట్రాటజీ అని కామెంట్ చేసింది. ఆమె దొంగ ఏడుపులు నమ్మనని, తాను మాత్రం కాజల్ దగ్గరకు వెళ్లేదే లేదని తేల్చిచెప్పింది.
అటు సిరి నామినేషన్‌లో మానస్ పేరు తీసుకురావడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేస్తూ సన్నీ దగ్గర వాపోయింది. ''ఇష్టం, కష్టం బయటకు వేరే విధంగా పోట్రె అవుతాయ్ కదా.. మానస్ హీరో అవ్వాలనుకుంటున్నాడు. అలాంటిది ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి మానస్ ని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది అంటే సెట్ అవ్వదు కదా అంటూ చెప్పింది ప్రియాంక. మరోవైపు దిష్టి తగలడం వల్లే దిష్టితాడు తెగిపోయిందని అభిప్రాయపడింది సిరి. ఈసారి అలా జరగకుండా గట్టిగా ముడివేసి దానికి తన రక్తాన్ని బొట్టుగా పెట్టి మరీ షణ్ముఖ్ చేతికి కట్టింది. అయితే కావాలని గుచ్చుకున్నావా? లేదంటే అనుకోకుండా తగిలిందా? అని షణ్ను అడగ్గా అనుకోకుండానే కట్ అయి రక్తం వచ్చిందని సిరి బదులిచ్చింది.
తనకు దీప్తీ సునయన గుర్తోస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు షన్నూ. దీంతో చేసేది లేక బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడు. ఆ తర్వాత నీ ఫ్రెండ్ షిప్ నాకు అక్కర్లేదని చెప్పడంతో సిరి నొచ్చుకుంది. తను కూడా బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని తలను గొడకు కొట్టుకుంది. ఊహించని ఈ పరిణామంతో షాకైన షణ్ముఖ్.. పరిగెత్తుకుంటూ బాత్‌రూమ్‌కి వెళ్లి బయటకు రావాల్సిందిగా వేడుకున్నాడు. షన్నూ అరుపులతో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు. కెప్టెన్ రవి డోర్ కొట్టి గట్టిగా పిలవడంతో ఏడుస్తూనే గడియ తీయడంతో షన్నూ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు.
తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'మీ ఇల్లు బంగారం కాను' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగినప్పుడు ముందుగా మైనర్ హ్యాట్‌లను పట్టుకున్నవారికి గోల్డ్ మైన్‌లో నుంచి బంగారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆట ప్రారంభం కావడంతో ఇంటి సభ్యులంతా బంగారం వెతుకులాటలో పడిపోయారు.
మానస్‌కి పవర్ రూమ్ యాక్సెస్ రావడంతో బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు. పవర్ టూల్ ని సొంతం చేసుకోవాలంటే 25 గోల్డ్ కాయిన్స్ చెల్లించాలని.. అది మీరు చెల్లిస్తారా..? లేక ఎవరికైనా ఆఫర్ ఇస్తారా..? అని అడగ్గా.. మానస్.. సన్నీ పేరు చెప్పాడు. దీంతో సన్నీ పాతిక గోల్డ్ కాయిన్స్ చెల్లించి పవర్ టూల్ సొంతం చేసుకున్నాడు. దీని పవర్ ఏంటనేది బిగ్‌బాస్ సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాడని తెలిపాడు. ఇక సిరి ఒకరితో రిలేషన్, నేనొకరితో రిలేషన్‌లో ఉన్నాం.. కానీ హౌస్‌లో మేమిద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం.. అదే నాకు సమస్యగా మారింది. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నానని మనసులోని బాధను శ్రీరామ్‌తో పంచుకున్నాడు షణ్ముఖ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com