బిగ్‌బాస్ 5 తెలుగు: శ్రీహాన్ గిఫ్ట్.. సిరి కోసం షన్నూ త్యాగం, పింకీకి హౌస్‌లో ఉండే అర్హత లేదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో శనివారం ఎపిసోడ్ సంతోషాలు, ఎమోషనల్ మేళవింపుగా సాగింది. నాగార్జున ఇంటి సభ్యులకు కొన్ని పరీక్షలు పెట్టి వారితో కామెడీ చేయించారు. ఈ వారం చేసిన తప్పులు, గొడవలపై కంటెస్టెంట్స్‌ని కడిగిపారేశారు నాగ్. ఒకరిపై ఒకరు నాగార్జునకు ఫిర్యాదులు ఇవ్వడంతో వారికి క్లాస్ పీకారు నాగార్జున. కాజల్‌కు సన్నీ అందరి ముందే సారీ చెప్పాడు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటి వచ్చి రావడంతోనే ఇంటి సభ్యులకు ఫ్యాషన్ క్యాట్ వాక్ పెట్టారు. దీనికి శ్రీరామ్, సిరిలు జడ్జీలుగా వ్యవహరించారు. అనంతరం ఈ గేమ్‌లో కాజల్, షన్నూలు గెలిచినట్లు ప్రకటించారు. అనంతరం హౌస్‌లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు నాగ్. దీనిలో భాగంగా సన్నీ సిరి మీద .. సిరి, మానస్ షణ్ను మీద .. పింకీ సన్నీ మీదా ఫిర్యాదు చేశారు. కాజల్ మాట్లాడుతూ.. సన్నీ వల్ల తన మనసు ముక్కలయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సన్నీ అందరి ముందే ఆమెకు సారీ చెప్పాడు.
ఇక నాగార్జున.. పింకీ మీద ఫైరయ్యారు. ఐస్ బాకెట్ టాస్క్ ముగిసిన తర్వాత.. సొంత వైద్యం వద్దని బిగ్‌బాస్ మరీమరీ చెప్పినప్పటికీ కాళ్లకు బామ్ రాసి వేడినీళ్లు పోసి శ్రీరామ్‌ను నడవలేని దుస్థితికి తీసుకొచ్చావని మండిపడ్డారు. ఆ మాటలకు పింకీ ఏడ్చేసింది. ‘‘టికెట్ టు ఫినాలే’’ టాస్క్‌లో ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో సన్నీ, సిరి ఇద్దరూ తొండాట ఆడారని నాగ్ వీడియోలు బయటపెట్టారు. అలాగే ఫోకస్ టాస్క్‌లో ఇంటి సభ్యులను డిస్ట్రబ్ చేస్తూ ఆ కేకలు ఏంటంటూ కాజల్‌కు చురకలంటించాడు. అనంతరం.. హౌస్ మేట్స్ ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ పెట్టి.. 'నువ్ సేఫ్ అయితే ట్రోఫీ నీకు దక్కుతుంది ’’ అంటూ శ్రీరామ్‌ని ఉద్దేశిస్తూ నాగార్జున చెప్పారు. ఎట్టకేలకు శ్రీరామ్ సేఫ్ అవ్వడంతో అతడికి సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ బహూకరించారు.
అనంతరం హౌస్‌మేట్స్‌తో ‘‘బ్రేక్ ఫ్రీ టైం టాస్క్ ’’ ఆడించారు నాగార్జున. దీనిలో భాగంగా హౌస్ మేట్స్ తమతో తాము ఏకాంతంగా గడిపితే ఏం తెలుసుకుంటారో చెప్పాలన్నారు. ముందుగా కాజల్ మాట్లాడుతూ.. తన వాళ్లు లేకుండా ఉండలేననే విషయం తెలుసుకున్నానని చెప్పింది. 'నాకు చాలా ఓపిక ఉందని అర్ధమైందని షణ్ముఖ్ చెప్పాడు. 'నేనొక ఎమోషనల్ పెర్సన్ అని, డిపెండెంట్ అని తెలుసుకున్నానని' సిరి తెలిపింది. 'మనకి మనం పెర్ఫెక్ట్ అని కాన్ఫిడెన్స్ వచ్చేది అన్ని రకాలుగా చదువుకున్నప్పుడే అని నా ఫీలింగ్' అని సన్నీ చెప్పాడు. 'నీకేదైనా ప్రాబ్లెమ్ ఉంటే వెళ్లి ఎక్స్ ప్రెస్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నానని' మానస్ చెప్పాడు. 'గొడవ జరిగిన వెంటనే ప్యాచప్ చేసుకొని మంచి బాండ్ మెయింటైన్ చేయొచ్చని తెలుసుకున్నానని' శ్రీరామ్ అభిప్రాయపడ్డాడు. పింకీ చెబుతూ తాను అంతకు ముందు తనకి నచ్చినట్టుగా ఉండేదని, కానీ అలా ఉండకూడదని తెలుసుకున్నట్టు చెప్పింది.
అనంతరం మరో టాస్క్ ఇచ్చాడు నాగ్. ఈ గేమ్‌లో పంచ్, షటప్, కోపం ఎమోజీలతో ఉండే మూడు దిండ్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా శ్రీరామ్.. 'పంచ్' ఎమోజీని సన్నీకి, 'షటప్' ఎమోజీను కాజల్ కి, 'యాంగ్రీ' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చాడు . సన్నీ... షటప్' ఎమోజీను కాజల్ కి, 'యాంగ్రీ' ఎమోజీను సిరికి, 'పంచ్' ఎమోజీను షణ్ముఖ్ కి ఇచ్చాడు. షణ్ముఖ్... 'యాంగ్రీ' ఎమోజీ కాజల్ కి, 'పంచ్' ఎమోజీను సిరికి, 'షటప్' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చాడు . ప్రియాంక... 'పంచ్' ఎమోజీను సిరికి, 'యాంగ్రీ' ఎమోజీను సన్నీకి, 'షటప్' ఎమోజీను మానస్ కి ఇచ్చింది. మానస్... 'యాంగ్రీ' ఎమోజీను సిరికి, 'పంచ్' ఎమోజీను సన్నీకి, 'షటప్' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చాడు. కాజల్... 'పంచ్' ఎమోజీను శ్రీరామచంద్రకు, 'యాంగ్రీ' ఎమోజీను షణ్ముఖ్ కి, 'షటప్' ఎమోజీను సన్నీకు ఇచ్చింది. సిరి... 'షటప్' ఎమోజీను సన్నీకు, 'పంచ్' ఎమోజీ షణ్ముఖ్ కి, 'యాంగ్రీ' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చింది.
తర్వాత.. గతంలో ఫ్యామిలీ మెంబర్స్‌ను కలవడానికి ఇంటి సభ్యులు త్యాగం చేసిన వస్తువులను తిరిగిచ్చేశారు నాగార్జున. అయితే అందులో ప్రియాంక, సిరిలకు సంబంధించిన వస్తువులు లేవు. దీనికి నాగ్ బదులిస్తూ.. స్టేజ్ పైకి ఫ్యామిలీ మెంబర్స్ .... టాప్ 5లో ఎవరి ఫోటోలైతే ఎక్కువగా పెట్టారో వాళ్లకు మాత్రమే తిరిగి వస్తువులను పంపించామని క్లారిటీ ఇచ్చారు. ప్రియాంక, సిరి ఫొటోలను ఫ్యామిలీ మెంబర్స్ ఒకట్రెండు సార్లు మాత్రమే పెట్టారని చెప్పారు. వాళ్ల వస్తువులను తిరిగి పంపించాలంటే హౌస్ మేట్స్ త్యాగం చేయాల్సి ఉంటుందని నాగార్జున వెల్లడించారు.
హౌస్ మేట్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో.. వాళ్లకోసమే త్యాగం చేయాల్సి ఉంటుందని.. ఆ వస్తువులను తీసుకొచ్చి తులాభారంలో వేయాలని.. ఎవరి సైడ్ ఎక్కువ బరువు ఉంటుందో వాళ్లకు గిఫ్ట్ తిరిగొస్తుందని అనౌన్స్ చేశారు. దీంతో అందరూ కలిసి సిరి గిఫ్ట్ తీసుకురావాలని అనుకున్నారు. కానీ నాగార్జున ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు. 'సిరి, ప్రియాంకలలో హౌస్ లో ఉండే అర్హత ఎవరికి ఉందో వారి వస్తువులను త్యాగం చేయాలని' సూచించారు. దీంతో హౌస్‌మేట్స్ ఆలోచనలో పడ్డారు.
కొందరు సిరిని, మరికొందరు ప్రియాంకను సపోర్ట్ చేశారు. తులాభారం రెండు వైపులా సమానంగా ఉండటంతో హౌస్‌మేట్స్‌కి మరో ముప్పై సెకన్లు టైమ్ ఇచ్చారు. దీంతో షణ్ముఖ్ తనకు సంబంధించిన మరిన్ని వస్తువులు తులాభారంలో వేసి సిరిని గెలిపించాడు. దీంతో బిగ్‌బాస్.. ఆమె త్యాగం చేసిన గిఫ్ట్‌ను తిరిగి పంపించారు. ఈరోజు శ్రీరామ్ మినహా నామినేషన్స్‌లో వున్న మానస్, సిరి, కాజల్, ప్రియాంకలలో ఎవరినీ సేవ్ చేయలేదు నాగ్. అయితే పింకీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొద్ది గంటల్లోనే క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com