బిగ్‌బాస్ 5 తెలుగు: నీ గురించి ఫైట్ చేస్తుంటే.. మీ అమ్మకి ‘‘హగ్’’ ఒక్కటే గుర్తుంది, సిరిపై షణ్ముఖ్ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో తుది అంకానికి చేరుకుంది. ఇక ఒకే ఒక్క వారం షో మిగిలివుంది. నిన్న హౌస్‌లో జరిగిన టాప్ ఇన్సిడెంట్స్‌ని ఇంటి సభ్యులు చేసి చూపించారు. ఈ సందర్భంగా కాజల్, షణ్ముఖ్‌లు హార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు మాత్రం హౌస్‌లో కాస్త ఎమోషనల్ సీన్లు నడిచాయి. కొత్తగా సిరికి మానస్ లింక్ పెట్టేలా కాజల్ మాట్లాడుతుంది. ఈ పరిణామాలు కొత్తగా వుంటాయి. ఈ లోపే మరోసారి సన్నీ- షణ్ముఖ్ గొడవకు దిగుతారు. వీరి మధ్య వివాదం ఎందుకు జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
షో మొదలైన వెంటనే సిరి గురించి మాట్లాడుకున్నారు మానస్, కాజల్. షణ్ను కంటి చూపుతోనే సిరిని కంట్రోల్ చేస్తున్నాడని మానస్ కామెంట్ చేశాడు. ఇది తాను స్వయంగా గమనించానని... దీనివల్ల సిరి ఇండివిడ్యువాలిటీ కోల్పోతుందని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్ ‘‘రోల్ ప్లే’’ టాస్క్ కంటిన్యూ చేశాడు. నిన్న సిరి-సన్నీ అప్పడం టాస్క్ తో పాటు.. ప్రియాంక-మానస్ ల జర్నీ టాస్క్ ను ఇచ్చాడు. ఈ రోజు 'జెస్సీ పిండి ఫైట్' సంఘటనను రోల్ ప్లేగా ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో హౌస్ మేట్స్ ఆరోజు ఏం జరిగిందో గుర్తుచేసుకుంటూ డిస్కష్ చేసుకున్నారు. అదే సమయంలో సన్నీ.. షణ్ముఖ్ ని ఇమిటేట్ చేస్తూ ఎలా బిహేవ్ చేశాడో చెప్పాడు. దీంతో షణ్ముఖ్ మళ్లీ హర్ట్ అయ్యాడు. నాకు నచ్చదని చెప్పినా.. ఎక్కిరిస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు. దానికి సన్నీ.. 'ప్రతీది సీరియస్ గా తీసుకోకు .. ఇలా ఏదీ తీసుకోకపోతే ప్రపంచంలో చాలా ఇబ్బంది పడతావ్ ..' అని కామెంట్ చేశాడు. నేను 'ఎంత కనెక్ట్ అవుదామని చూస్తున్నా.. ఆయన మాత్రం క్యారీ చేస్తూనే ఉన్నాడు' అని సన్నీ తన ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాడు.
ఆతర్వాత షణ్ముఖ్‌ని కంట్రోల్ చేద్దామని ట్రై చేసింది సిరి. గేమ్ ఆడదామని షణ్ముఖ్‌ని పిలవగా.. 'నేను చేయను.. నాకు ఇమిటేషన్ నచ్చదు.. నన్ను దొబ్బకు.. అంటూ సిరిపై ఫైర్ అయ్యాడు. వెంటనే ఆమె 'ఆయనే(బిగ్ బాస్) చెప్తాడు ఫైనల్ గా అప్పుడు నువ్వే చేస్తావ్' అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మానస్.. షణ్ముఖ్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. 'సన్నీ చేసే ఇమిటేషన్ జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు.. కానీ నాకు నచ్చదు అంతే' అని చెప్పాడు.
అయినప్పటికీ శాంతించని షణ్ముఖ్.. సిరిని నానా మాటలు అన్నాడు. ‘‘నువ్ ఎవరికో ఎమోషనల్ కనెక్ట్ అయితే నేను ఆపాను. నిన్ను ఎవడో అప్పడం అంటే నేను నిన్ను డిఫెండ్ చేశాను. మీ మదర్ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడారు. నీ మంచి గురించి నేను చేస్తుంటే నేను నెగెటివ్ మాట్లాడుతున్నాను అంటున్నావ్. మిగతా హౌస్ మేట్స్ ఎలాగో నువ్ కూడా అంతే నాకు ఇప్పుడు. నీ కాలికి దెబ్బ తగిలితే నేను చూసుకున్నాను. అది నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్.
ఇందుకే జెస్సీ మీద నాకు రెస్పెక్ట్... నీకంటే వాడే ఎక్కువ. చాలా ఫ్రీడమ్ తీసుకున్నావ్ నా విషయంలో.. అవతలి వాళ్లను రెస్పెక్ట్ చేస్తావ్, నన్ను అరేయ్.. ఒరేయ్.. అని నీ ఇష్టమొచ్చినట్లు అంటావ్. మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వవు. అవతలి వాడికి తక్కువైపోతున్నా.. నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు. హగ్ ఒక్కటే గుర్తుంది అంటూ షన్నూ చాలా బరస్ట్ అయ్యాడు. అతని అరుపులు కేకలతో మానస్, సన్నీ, శ్రీరామ్, కాజల్‌లు షాకయ్యారు. ఆ వెంటనే సిరి బాగా ఎమోషనల్ అయ్యింది. హగ్గులు ఇవ్వమని నేను వెయిట్ చేశానా అని లోలోపల కుమిలిపోయింది. కాసేపటి తర్వాత శాంతించిన షణ్ముఖ్.. సిరి దగ్గరకు వచ్చి సారీ చెప్పడంతో హగ్ ఇచ్చింది.
ఇక పిండి గొడవ రోల్ ప్లేలో షణ్ముఖ్.. శ్రీరామ్ క్యారెక్టర్‌ని... సిరి.. జెస్సీ రోల్ ప్లే చేసింది. కాజల్.. సిరి క్యారెక్టర్, శ్రీరామ్.. షణ్ముఖ్ పాత్ర పోషించారు. సన్నీ మాత్రం లాంగ్ ఫ్రాక్ వేసుకొని హమీద పాత్రలో అలరించాడు. హమీద గెటప్ లో ఉన్న సన్నీ.. 'అరే ఎందుకు ఒకడిమీద ఇలా పడిపోతారు' అంటూ ఇమిటేట్ చేశాడు. ఫైనల్‌గా షణ్ముఖ్.. శ్రీరామ్ ని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం నవ్విస్తుంది. ఈ రోల్ ప్లే టాస్క్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్ గా షణ్ముఖ్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని గార్డెన్ ఏరియాలో ఉన్న ఓటింగ్ కార్నర్ లో వోట్ అప్పీల్ ను మొదలుపెట్టమని చెప్పారు బిగ్ బాస్. వెంటనే షణ్ముఖ్ బీబీ5 ఓట్ ఫర్ మీ అంటూ ప్రేక్షకులను కోరాడు. తనతో పాటు హౌస్ మేట్స్ కి కూడా ఓట్లు వేయమని విజ్ఞప్తి చేశాడు
ఆ తరువాత హౌస్ మేట్స్‌తో లాఫింగ్ గేమ్ ఆడించారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాకి పిలిచి అక్కడ ఉన్న హాట్ సీట్ పై ఒక్కో కంటెస్టెంట్ కూర్చోవాలని.. వాళ్లని మిగిలిన హౌస్ మేట్స్ నవ్వించాలని ఆదేశించారు. ఎవరు తక్కువ సార్లు నవ్వుతారో వాళ్లకు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వస్తుందని చెప్పాడు. ఇందులో షణ్ముఖ్ , కాజల్, సన్నీ, సిరిలు బాగా నవ్వుతారు. కానీ మానస్, శ్రీరామ్ మాత్రం తమ నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com