బిగ్‌బాస్ 5 తెలుగు : ముగ్గురు సేఫ్.. ఇంకా డేంజర్ జోన్‌లో ఐదుగురు, మరి ఎలిమినేషన్ ఎవరో..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు శనివారం సరదాగా సాగింది. ఎప్పటిలాగే వీకెండ్ కావడంతో నాగ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్ తప్పుల్ని ఎత్తిచూపుతూ వారికి క్లాస్ పీకారు. హీరోలు, విలన్లను బయకు రప్పించారు. అటు సిరిని ఓదార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో షన్నూకి మెంటలెక్కింది. అయితే కెప్టెన్‌గా బాగా చేస్తున్నావంటూ నాగార్జున .. షణ్ముఖ్‌ని మెచ్చుకున్నారు. అలాగే రవిని కాసేపు టెన్షన్‌లో పెట్టారు. దీనితో పాటు మానస్- పింకీల మధ్య గొడవల గురించి నాగ్ అడిగారు. మరి ఈ వారం హౌస్‌లో ఎవరు సేవ్ అయ్యారో.. ఎవరు డేంజర్ జోన్‌లో వున్నారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
సిరికి సారీ చెప్పి ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు షన్నూ. కానీ ఆమె ఏమాత్రం కరగలేదు. ఆ తరువాత ప్రియాంక బెడ్ పై పడుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆమెను మానస్ ఓదార్చేందుకు ట్రై చేస్తున్నా.. సిరి ఏడుస్తూనే ఉంది. అనంతరం తెల్లవారుజామున కాజల్-షణ్ముఖ్ కూర్చొని సిరి-జెస్సీల గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత షణ్ముఖ్ మళ్లీ సిరి దగ్గరకు వెళ్లి మాట కలిపేందుకు ప్రయత్నం చేశాడు. షణ్ముఖ్. ఆమెకి ఎన్నిసార్లు సారీ చెప్పినా వినిపించుకోలేదు. ఇంకోవైపు ప్రియాంక కన్నీళ్లు పెట్టుకోగా, మానస్ ఓదార్చాడు. అయితే సిరి బెట్టుదిగకపోవడంతో మహిళల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు షణ్ముఖ్. అంతేకాదు తన ప్రియురాలు దీప్తిని గుర్తు చేసుకున్నాడు. ఆమె అలిగితే వేరే లెవల్‌లో ఉంటుందన్నాడు. ఆమెనే భరిస్తే ఇవన్నీ మామూలుగానే ఉంటాయన్నాడు. ఈ లెక్కన దీప్తి అలిగితే ఎంతటి టార్చర్‌గా ఉంటుందో చెప్పాడు.
అనంతరం నాగార్జున స్టేజీపైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరావడంతోనే యానీ కెప్టెన్ అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో గివప్ అంటూ, గ్రూపులుగా ఆడుతున్నారని, తనని ఇంటరైపోయానని చెబుతూ తప్పించుకుంటున్న అనీ మాస్టర్ కసిగా ఆడితే, గివప్ కాకుండా ఆడితే ఏకంగా కెప్టెన్సీ వచ్చిందని, ఆమెలో ధైర్యాన్ని నూరి పోశాడు. షణ్ముఖ్ గురించి చెబుతూ, అతని కెప్టెన్సీని అభినందించాడు. అందరిని సమానంగా చూస్తున్నావని, ఫ్రెండ్స్ అని కూడా లెక్కచేయకుండా గేమ్స్ , టాస్క్ లు ఆడుతున్నావని, తప్పు చేసిన అందరికి ఒకేలాగా శిక్ష ఇచ్చావని అభినందించాడు. ఇదే సమయంలో సిరితో జరిగిన గొడవని కూడా నాగ్ క్లీయర్ చేశాడు. ఇద్దరి మధ్య గ్యాప్‌ని దూరం చేశాడు. దీంతో ఇద్దరు హగ్ చేసుకుని పాటలకు డాన్స్ కూడా చేశారు.
ఆ తరువాత ధోతీ వేసుకున్న రవిని ధోతీవాలా రవి అని పిలిచారు నాగ్. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో చిత్రహింసలు పెట్టిన టీమ్‌లో నుంచి ఒకరిపై ప్రతీకారం తీర్చుకోమని అవకాశం ఇచ్చాడు నాగ్. దీంతో రవి.. సోయా సాస్, చిల్లీ సాస్, గుడ్డు.. అన్నీ కలిపి దానికి షణ్స్ సిర్స్ జెస్స్ కాక్‌టెయిల్ అని పేరుపెట్టాడు. మరోదారి లేక షణ్ను దానిని అతి కష్టం మీద తాగేశాడు. యానీ మాస్టర్... కాజల్‌తో మిర్చి తినిపించి తర్వాతో నాగిన్ జ్యూస్ తాగమని ఇచ్చింది. అయితే కాజల్ ఎక్కడా తగ్గకుండా గ్లాసు దించకుండా తాగేసింది. ఆ తర్వాత ప్రియాంక ఇచ్చిన పచ్చిగుడ్డును మింగేశాడు రవి. శ్రీరామ్.. సన్నీతో మిర్చి తినిపించాడు. ఆ వెంటనే ఏవేవో కలిపిన జ్యూస్ తాగించాడు. అనంతరం మానస్ ని పిలిచిన నాగార్జున.. ప్రియాంకతో ఎందుకు గొడవలు జరుగుతున్నాయని ప్రశ్నించాడు. కొన్ని కొన్ని మాటలు విసిరేస్తుందని.. మానస్ చెప్పగా.. నీకు నచ్చని పనులు ఆమె చేయదు కదా అని అన్నారు నాగార్జున. సన్నీని టెంపర్ బాగా కంట్రోల్ చేసుకుంటున్నావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఇక తొమ్మిదో వారంలో నామినేషన్‌లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇందులో నామినేషన్లు చేసే సమయంలో వాడిన పోమ్‌ల ద్వారానే ఒకరిని సేవ్ చేయాల్సి వచ్చింది. ఆ ప్లేట్ లో సేఫా..? కాదా..? అనేది రాసి ఉంటుంది. ఈ టాస్క్ లో రవికి సేఫ్ అని వచ్చింది. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో నాగ్.. ఎవరు హీరో? ఎవరు విలన్? గేమ్ ఆడించాడు. ముందుగా సిరి - షణ్ముఖ్ కి హీరో ఇచ్చి.. ప్రియాంక గేమ్ లో తోసేసిందని ఆమెకి విలన్ ఇచ్చింది. ప్రియాంక స్పందిస్తూ - కావాలని తోయలేదని..అపార్ధం చేసుకుందని సిరికి విలన్ ఇచ్చింది. హౌస్ లో తనకు బాగా సపోర్ట్ చేస్తాడని మానస్ కి హీరో ఇచ్చింది. శ్రీరామ్ - టాస్క్‌లో తన బెస్ట్ ఇస్తాడని.. విశ్వకి హీరో ఇచ్చాడు. టాస్క్‌లో సిరితో ఆడడం టఫ్‌గా వుందని ఆమెకి విలన్ ఇచ్చాడు. కాజల్ - తనను విలన్ అనుకుంటున్నారని.. యానీ మాస్టర్‌కి విలన్ ఇచ్చి, మానస్ కి హీరో ఇచ్చింది.
అనంతరం నామినేషన్‌లో మిగిలిన ఏడుగురి చేతుల్లో బ్యాగ్స్ పెట్టారు. ఆ బ్యాగ్‌లో రెడ్ బాల్ ఉంటే అన్ సేఫ్.. గ్రీన్ బాల్ ఉంటే సేఫ్ అని చెప్పారు. సిరి బ్యాగ్ లో గ్రీన్ కలర్ బాల్ ఉండడంతో ఆమె సేవ్ అయింది. తర్వాత రవి - టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడని విశ్వకి హీరో ఇచ్చి, షణ్ముఖ్ కి విలన్ ఇచ్చాడు. షణ్ముఖ్ - ఈ విలన్ లేకపోతే నేను హీరో కాలేనంటూ రవికి విలన్ ఇచ్చి సిరికి హీరో ఇచ్చాడు. యానీ మాస్టర్ - ఫస్ట్ వీక్ నుంచి కంఫర్ట్ గా లేనని.. కాజల్ కి విలన్ ఇచ్చి, విశ్వకి హీరో ఇచ్చింది.
విశ్వ - గేమ్ ఛేంజర్ అంటూ శ్రీరామ్‌కి హీరో ఇచ్చి, ప్రియాంకకి విలన్ ఇచ్చాడు. జెస్సీ - తనకు చాలా సపోర్ట్ చేస్తుందని.. సిరికి హీరో ఇచ్చి, కాజల్ కి విలన్ ఇచ్చాడు. మానస్ - ప్రియాంకకు హీరో ఇచ్చి, రవికి విలన్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో హీరో ఆఫ్ ది హౌస్ గా విశ్వ, విలన్ ఆఫ్ ది హౌస్ గా ప్రియాంక గెలిచారు. ఇక చివరిగా నామినేషన్ లో ఉన్న ఆరుగురి చేతుల్లో బాక్సులు పెట్టారు. ఆ బాక్స్‌లో బ్లాక్ కలర్ రోజ్ వస్తే అన్ సేఫ్.. వైట్ రోజ్ వస్తే సేఫ్ అని చెప్పారు. సన్నీకి వైట్ రోజ్ రావడంతో అతడు సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. ఇంకా కాజల్, ప్రియాంక, శ్రీరామ్, విశ్వ, జెస్సీ నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments