బిగ్‌బాస్ 5 తెలుగు: దొరికిందే ఛాన్స్.. షణ్ముఖ్‌ని ఆడుకున్న సిరి, కాజల్ డబ్బు కొట్టేసిన రవి
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా రోజుల తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో మంచి వినోదం లభించింది. విశ్వ ఎలిమినేట్, జెస్సీని సీక్రెట్ రూమ్‌లోకి పంపిన బాధ నుంచి ఇంటి సభ్యులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బిగ్‌బాస్ పంపిన స్వీట్ ఎవరు తినాలా అన్న గందరగోళానికి సీక్రెట్ రూమ్‌లో వున్న జెస్సీ తెరదించాడు. మరోవైపు సిరి తన యాటిట్యూడ్ చూపిస్తుంది. కాఫీ కలుపుకుని రావాలంటూ షణ్ముఖ్‌కు ఆర్డర్ వేస్తుంది. మరి ఇలాంటి సంగతుల గురించి తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
ముందు రోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ పంపిన స్వీట్‌ని హౌస్‌లో ఎవరు తినాలనే దానిపై ఇంటి సభ్యులు డిష్కస్ చేసుకున్నారు. కెప్టెన్‌గా తనకు అర్హత ఉందని యానీ మాస్టర్ అంటే.. కాదు తాను తినాలనుకుంటున్నట్టు రవి, సన్నీ, సిరి, శ్రీరామ్, కాజల్‌లు సైతం తమ మనసులోని మాటను చెప్పారు. దీనిపై నీ ఓపీనియన్ ఏంటీ అని ప్రియాంకని అడగ్గా ఆమె మానస్‌కి ఇస్తానని చెప్పింది. దీంతో సన్నీ ఆమెపై జోకులు వేశాడు. ఆ తరువాత సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీని ఆ కేక్ తినడానికి అర్హులెవరో చెప్పమని బిగ్ బాస్ అడగ్గా.. రవి పేరు చెప్పాడు. దీంతో రవి ఆ స్వీట్‌ని ఫస్ట్ టేస్ట్ చేశాడు, తర్వాత కాజల్, సన్నీ తినేశారు. దీనిపై కెప్టెన్ యానీ మాస్టర్ సీరియస్ అయ్యింది. తనను అడగకుండా ఎలా తింటావంటూ సన్నీని నిలదీసింది. దానికి సన్నీ బదులిస్తూ ఆకలేసింది తినేశా అని చెప్పాడు.
అనంతరం బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సభ్యులంతా హోటల్ స్టాఫ్‌గా చేయాల్సి ఉంటుంది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో రోల్ ఇచ్చాడు. యానీ మాస్టర్ చెఫ్‌గా, మేనేజర్‌గా చేయాల్సి ఉంటుంది. శ్రీరామ్, షణ్ముఖ్ వెయిటర్స్ గా, రవి హౌస్ కీపర్‌గా, కాజల్ యాటిట్యూడ్ చూపించే గెస్ట్ గా, సిరి డాన్ కూతురిగా, మానస్- ప్రియాంక హనీమూన్‌కి వచ్చిన జంటగా నటించాల్సి ఉంటుంది. సన్నీ ఓ గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిలా డిఫెరెంట్‌గా బిహేవ్ చేశాడు.
అయితే ఈ గేమ్‌కి ముందు రవికి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో అన్ని పనులను డిస్టర్బ్ చేయడం, డబ్బులు కొట్టేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఎవరికీ అనుమానం రాకుండా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో సభ్యులు అత్యధికంగా డబ్బుని సంపాదించాల్సి ఉంటుంది. చివరిలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్లు కెప్టెన్సీ టాస్క్‌కి క్వాలిఫై అవుతారు. ఇక గేమ్ మొదలైన తర్వాత సిరి, కాజల్‌లు రెచ్చిపోయారు. శ్రీరామ్, షణ్ముణ్, రవిలను కాజల్ ఓ రేంజ్‌లో ఆడుకుంది. అటు సిరి సైతం షణ్ముఖ్‌కి చుక్కలు చూపించింది. స్విమ్మింగ్ పూల్‌లో స్ఫూన్‌తో వాటర్ కాఫీ కప్‌లో పోయిస్తుంది. ఇంకో వైపు తప్పు చేసిన శ్రీరామ్‌ని సోఫాల చుట్టూ తిప్పిస్తూ సారీ చెప్పించుకుంటుంది. ఇలా సిరి, కాజల్‌లు హోటల్ సిబ్బందిగా వున్న ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తుంటారు.
ఆ తరువాత మానస్-ప్రియాంక కొత్తగా పెళ్లయిన జంటగా హోటల్‌కి వచ్చారు. వాళ్లతో సన్నీ మాట్లాడే ప్రయత్నం చేశాడు. మానస్ చనువు ఇచ్చాడు కదా అని.. ప్రియాంక ఇంకా క్లోజ్ అయ్యింది. దీంతో సన్నీ.. 'కొంచెం ఆమెతో జాగ్రత్తగా ఉండరా బాబు' అంటూ పంచ్ పేల్చాడు. ఇంతలో రవి తన సీక్రెట్ టాస్క్ ప్రకారం.. కాజల్ డబ్బులు కొట్టేశాడు. ఆ తర్వాత శ్రీరామ్, షణ్ముఖ్‌లకు టిప్పు ఇవ్వాలనుకుని తన డబ్బు లేకపోవడంతో రచ్చ చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments