బిగ్‌బాస్ 5 తెలుగు: తగ్గేదేలే అన్న యానీ మాస్టర్, పింకీ.. సిరి ఏడుపుపై పింకీ సెటైర్లు, మానస్ ఫైర్

  • IndiaGlitz, [Friday,November 05 2021]

బిగ్‌బాస్ 5 తెలుగు హౌస్ మరోసారి రణరంగమైంది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రియాంకను అవతలి టీమ్ వాళ్లు ముప్పు తిప్పలు పెట్టారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా విజయవంతంగా ఆ టాస్కులన్నీ పూర్తి చేసి ఔరా అనిపించుకుంది పింకీ. ఆ తర్వాత షన్ను- సిరిల మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. క్యారెక్టర్ గురించి మాట్లాడటంతో సిరి తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. మరి వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటీ..? కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్' కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా ఇంట్లో సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక గ్రూపు సూపర్ విలన్స్, మరో గ్రూప్ సూపర్ హీరోస్. హీరోస్ గ్రూపులో షణ్ముక్, ప్రియాంక, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ ఉండగా.. విలన్స్ గ్రూపులో రవి, యానీ మాస్టర్, సన్నీ, జెస్సీ, విశ్వ, సిరి వున్నారు. గురువారం ఈ టాస్క్ కంటిన్యూ అయింది.

ఈ రోజు సూపర్ హీరోస్ నుంచి ప్రియాంక సింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు సూపర్ విలన్స్. టాస్క్‌లో భాగంగా తనకు గుడ్డు పడదని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా పచ్చి గుడ్డు తాగేసింది ప్రియాంక. అంతేకాకుండా పైన పేడనీళ్లు పోశారు. ఏవేవో కలిపి ఇచ్చిన జ్యూస్ లు తాగింది. పచ్చి ఆనియన్స్ తిన్నాక పెయింట్‌లో ఎగ్ కలిపి ఇచ్చి ముఖానికి రాసుకోమని చెప్పగానే రాసేసుకుంది. చేతులు స్ట్రైట్ గా పెట్టి 25 టైమ్స్ గుంజీలు తీసింది. 25 గుంజీలు తీసిన తర్వాత చేతులు స్ట్రైట్‌గానే ఉంచి బకెట్ తగిలించి కొద్దిసేపు అలాగే ఉంచారు. హెయిర్ కట్ చేసుకోవాలంటూ సిరి కత్తెర ఇవ్వగా.... చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడం తన డ్రీమ్ అని పైగా క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేందుకు పెంచుతున్నానని చెప్పింది. దీనికి స్పందించిన సిరి.. నువ్వు ఏమంటావోనని టెస్ట్ చేశాం అని చెప్పింది. పాట పాడుతుండగా బజర్ మోగడంతో ప్రియాంక సింగ్ టాస్క్ పూర్తైంది.

తర్వాత సిరి, షణ్ముఖ్‌లు డిస్కషన్ పెట్టారు. పర్సనల్ గా తనను టార్గెట్ చేశావంటూ షణ్ముక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పింకీకి సపోర్ట్ చేశావ్ అంటూ గొడవకు దిగింది. సారీ చెప్పాకదా అన్నా... సిరి వినకపోవడంతో షన్నూ పది గుంజీలు తీశాడు. తర్వాత అందరికీ వినిపించేలా సారీ చెప్పమంది. దీనికి షణ్ముక్ ఓకే అనడంతో వెళ్లి అతనిని హగ్ చేసుకుంది సిరి. తర్వాత తమ టీమ్‌లో ఒకర్ని ఇంకో టీమ్‌లో ఒకరితో స్వాప్ చేసుకునే బంపరాఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ విషయంలో షణ్ముక్-సన్నీ వాదించుకున్నారు. ఎవరూ కూడా జట్టు నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించలేదు.

సూపర్ విలన్స్ టీమ్ లో ఉన్న రవి, యానీ మాస్టర్ ఇద్దరూ మాట్లాడుకుని ట్రేలో ఉన్న తాళాలు ట్రే కింద పెట్టేశారు. అయినప్పటికీ హీరోస్ టీమ్ తాళం కనిపెట్టడంతో సూపర్ హీరోస్ కి ఛాన్స్ వచ్చింది. దీంతో వాళ్లు యానీ మాస్టర్‌ని సెలక్ట్ చేసుకున్నారు. సాస్ లు, ఎగ్స్, పాలు అన్నీ మిక్స్ చేసిన జ్యూస్ ఇచ్చారు. మిర్చి తినిపించారు. పెయింట్ ఒళ్లంతా పూసుకుంది. ఐస్ వాటర్, పేడ మిక్స్ చేసిన వాటర్ మీద పోసుకుంది. దీంతో ఆమెతో ఐ క్విట్ అని ఎలా చెప్పించాలో తెలియక హీరోస్ టీమ్స్ మల్లగుల్లాలు పడ్డారు.

మరోవైపు షణ్ముఖ్- సిరిల మధ్య మళ్లీ గొడవ స్టార్ట్ అయ్యింది. సిరిపై కారణం లేకుండా అరుస్తున్నావంటూ జెస్సీ... షణ్ముక్‌పై కేకలు వేశాడు. తన టీమ్‌లోకి రానందుకే షణ్ముక్ ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఆరోపించాడు. విలన్స్ టీమ్‌లో ఉన్న సిరి... శ్రీరామ్ దుస్తులన్నీ విసిరి పడేసింది. శ్రీరామ్ కూడా అలాగే చేశాడు. ఈ వ్యవహారం షన్నూకి ఆగ్రహం తెప్పించడంతో ఆయన సిరితో గొడవ పడ్డారు. ఈ లోగా బజర్ మోగడంతో తాళం తీసుకునే ఛాన్స్ విలన్స్ టీమ్ దక్కించుకున్నారు. ఇన్న‌ర్స్ ఎందుకు బ‌య‌ట‌కు తీశావ‌ని ప్ర‌శ్నించడంతో వాటిరి స‌ర్దేయ‌డానికి అంగీకరించింది. కాక‌పోతే కాస్త టైమ్ కావాలని చెప్పింది.. అందుకు అంగీక‌రించ‌ని ష‌ణ్ను.. వెంటనే ఇన్నర్స్ సర్దేయాలని ఆదేశించాడు.

దీంతో మండిపడిన సిరి.. తాను ఇన్నర్స్ సర్దనని తేల్చి చెప్ప‌ింది. ఆపై ఇది ‘‘నీ క్యారెక్ట‌ర్’’.. అని నోరు జారాడు ష‌ణ్ను. బ‌ట్ట‌లు సర్దడానికి, క్యారెక్ట‌ర్‌కు సంబంధం లేద‌ని వెక్కివెక్కి ఏడ్చింది. ఇది చూసిన పింకీ కామెంట్ చేసింది. దీనిపై మానస్ అభ్యంతరం తెలిపాడు. రేపు నువ్వు ఏడ్చినా కూడా అందరూ అలాగే అంటారు అని చురకలు వేశాడు. నీకు ఎవరైనా హానీ చేస్తే వాళ్లు నాశనం అయిపోవాలని అని కోరుకుంటావు అది తప్పు అని సూచించాడు.

More News

హీరో రాజ‌శేఖ‌ర్‌ ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి వరదరాజన్ గోపాలన్ కన్నుమూత

దీపావళి పండుగ వేళ సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.

కె. విశ్వనాథ్ ఇంటికి చిరంజీవి దంపతులు.. ఆశీస్సులు తీసుకున్న మెగాస్టార్

దీపావళి పర్వదినం సెలబ్రిటీలు ఉత్సాహంగా గడుపుతున్నారు. తమ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు, సాంగ్స్, ప్రోమోలు, ట్రైలర్లు,

దీపావళి నాడు స్పెషల్ సర్‌ప్రైజ్.. ముగ్గురు హీరోయిన్ల గుట్టు విప్పిన నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘ శ్యామ్ సింగ రాయ్ ’’ సినిమా మీద టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.

దీపావళి పండుగ సందర్భంగా రక్షిత్ అట్లూరి 'నరకాసుర' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నరకాసుర. ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతూ దర్శకత్వం

వెయ్యి మంది డ్యాన్స‌ర్స్‌తో పుష్ప సాంగ్ చిత్రీక‌ర‌ణ‌.. వెండితెరపై పూనకాలే..!!

ఈ ఏడాది సంక్రాంతికి ‘‘అల వైకుంఠపురంలో’’ అనే చిత్రంతో మెగా హిట్‌ను అందుకుని రికార్డులను తిరగరాశాడు.