close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

Tuesday, November 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

బిగ్‌బాస్ 5 తెలుగు 11వ వారంలోకి ప్రవేశించింది. గత వారం జెస్సీ అనారోగ్యం.. సీక్రెట్‌ రూమ్‌కి పంపడం, చివరికి ఆయన ఎలిమినేషన్ సైతం అయ్యారు. ఇక సోమవారం కావడంతో ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే గతంలో మాదిరిగా గొడవలు, వివాదాలు లేకుండా కాస్త కూల్‌గానే నామినేషన్స్ జరిగాయని చెప్పొచ్చు. మరి ఈ రోజు ఎపిసోడ్‌ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

ఏ వ్యక్తినైనా నామినేట్‌ చేస్తే.. అందుకు గల కారణాలను ధైర్యంగా చెప్పాలని బిగ్‌బాస్‌ ఆదేశించడంతో.. ఇంటి సభ్యులు తమలో దాగిఉన్న అక్కసును వెళ్లగక్కారు. ఇందులో కెప్టెన్‌ రవి ఈ వారం నామినేషన్ల ప్రక్రియని ప్రారంభించాడు. ఆయన సన్నీ, కాజల్‌‌లను నామినేట్‌ చేశాడు. సన్నీ.. తనకు ఫేక్‌ ట్యాగ్‌ ఇవ్వడంపై.. కాజల్‌ తీరుని వ్యతిరేకిస్తూ నామినేట్‌ చేశాడు. మరోవైపు షణ్ముఖ్‌..కాజల్‌, ప్రియాంకలను నామినేట్‌ చేశాడు. కాజల్‌ హౌజ్‌ నుంచి వెళ్లిపోతే గొడవలు ఆగిపోతాయనే పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

ప్రియాంకకు సంబంధించి ఆమె పదే పదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విధానాన్ని వ్యతిరేకించాడు. మరోవైపు మానస్‌.. యానీ మాస్టర్‌, షణ్ముఖ్‌లను నామినేట్‌ చేశాడు. అలాగే శ్రీరామ్‌.. సన్నీ, మానస్‌లను నామినేట్‌ చేశాడు. సిరి.. ప్రియాంక కాజల్‌లను నామినేట్‌ చేయగా, ప్రియాంక.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్‌ చేసింది. సన్నీ.. శ్రీరామ్‌, సిరిలను నామినేట్‌ చేశారు. యానీ మాస్టర్‌.. మానస్‌, కాజల్‌లను నామినేట్‌ చేసింది. మానస్‌ని నామినేట్ చేసి.. రీజన్స్ చెప్తుండగా.. 'మాస్టర్ ఇంక చాలు' అని అన్నాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

ఆ తరువాత కాజల్‌ని నామినేట్ చేస్తూ..'నీతో నాకు నెగెటివ్ వైబ్ వచ్చింది' అని యానీ మాస్టర్ చెప్పింది. నేను అంతర్యామిని కాదు అన్నీ తెలియడానికి' అంటూ కాజల్ ఫైర్ అయింది. తనని కాజల్‌ నామినేట్‌ చేసిన సమయంలో వెటకారంగా డాన్సు వేసింది యానీ. ఇదే తనకు నచ్చదని కాజల్‌ చెప్పినా వినకుండా అలానే చేసింది. మరోవైపు తాను నామినేట్‌ చేసే సమయంలోనూ అదే మాదిరిగా డాన్సు చేసింది. ఇందులో యానీ మాస్టర్‌ వ్యవహరించిన విధానం పట్ల కాజల్‌తోపాటు ఇతర సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

ఫైనల్‌గా ఈ వారం నామినేషన్‌లో కెప్టెన్ రవి తప్ప షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, యానీ మాస్టర్‌, ప్రియాంక, మానస్‌, కాజల్‌, సన్నీ ఇలా అందరు ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ ఉత్కంఠ రేకెత్తించబోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సరయు, లహరి, ప్రియ, శ్వేతా వర్మ, నటరాజ్ మాస్టర్, ఉమా దేవి, లోబో, జెస్సీ, విశ్వలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో... ఇందులో ఎవరు టాప్‌ 5లోకి వెళ్తారనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment