బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్‌లో గ్రూప్ రాజకీయాలు.. అంతా ఒక్కటయ్యారంటూ షణ్నూ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్‌తో షాక్‌కు గురైన ఇంటి సభ్యులు కోలుకున్నారు. సోమవారం కావడంతో యథావిధిగా నామినేషన్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ వారం మాత్రం ఎవరెవర్ని నామినేట్ చేయాలా అని హౌస్‌మేట్స్ తికమకపడ్డారు. మరి ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారు.. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
షో మొదలవ్వగానే.. కిచెన్ రూమ్‌లో వంట చేస్తుంది ప్రియాంక. ఆమె దగ్గరకు వెళ్లి మటన్ పీస్ లు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టు అంటూ హమీద చెప్పింది. 'ఎలా లెక్కబెడతారు.. నేను వడ్డిస్తానులే' అని ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది. అయినా.. హమీద మాత్రం ఫోర్స్ చేసింది. దీంతో ప్రియాంక అసహనం వ్యక్తం చేస్తూ కిచెన్ నుంచి వెళ్లిపోయింది. ''మటన్ కొట్టువాడు నా హస్బెండా.. మటన్ ముక్కను నన్ను లెక్కపెట్టమంటాది.. పదేళ్లుగా వంట చేస్తున్నా.. నాకు తెలియదా ఏం చేయాలో.. పక్కనే ఉంటూ టీచ్ చేస్తున్నారు. ఇంతకాలం తిన్నది ఏంటో..?'' అంటూ కాజల్ కి చెబుతూ హమీదపై మండిపడింది ప్రియాంక. మరోవైపు గేమ్‌లో గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేయాలి కానీ ఒకరిని తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే అంతకన్నా లేకిడివాళ్లు ఎవరూ ఉండరు అని జెస్సీ.. యాంకర్ రవి మీద ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేశాడు. హౌస్‌లో విశ్వ, రవి, లోబో, సన్నీ, మానస్ ఒక గ్రూప్ అయ్యారని షణ్నుతో చెప్పుకొచ్చాడు.
అనంతరం నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్ ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి, హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లను, అందుకు తగిన కారణాలను చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. ప్రతివారం ఫేస్ టూ ఫేస్ జరుగుతున్న నామినేషన్స్ ఈసారి గోప్యంగా జరుగుతుండటంతో ఇంటి సభ్యులందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా జెస్సీ రవిని నామినేట్ చేస్తూ.. 'నేను ఆడే గేమ్ కరెక్ట్ కాదని, నన్ను మానిప్యులేట్ చేస్తున్నారని' రీజన్ చెప్పారు. లోబోని నామినేట్ చేస్తూ 'కెప్టెన్సీ టాస్క్ లో నాకు శిక్ష పడడానికి అతడే కారణం. హౌస్ లో నువ్ చాలా వీక్ అని తక్కువ చేస్తున్నాడని' కారణం చెప్పాడు. సన్నీ-షణ్ముఖ్‌ని నామినేట్ చేస్తూ.. అతడితో ఎలాంటి బాండింగ్ రావడం లేదని కారణం చెప్పాడు. ప్రియాని నామినేట్ చేస్తూ.. షణ్ముఖ్ కి చెప్పిన కారణమే చెప్పాడు. విశ్వ-జెస్సీని నామినేట్ చేస్తూ.. 'కెప్టెన్ గా ట్రిప్ అయ్యాడు.. నోరు జారి చాలా మాటలు అన్నాడు' అని రీజన్ చెప్పాడు. షణ్ముఖ్ రేషన్ మేనేజర్ అయ్యాక మొత్తం బిహేవియర్ మారిపోయిందని.. చాలా పొగరుగా బిహేవ్ చేశాడని అతడిని నామినేట్ చేశాడు.
కాజల్-రవి, సన్నీని నామినేట్ చేస్తూ.. నన్ను నామినేట్ చేసిన వారిని నామినేట్ చేస్తా అని తన ఉద్దేశం ఏంటో చెప్పింది. లోబో-మానస్, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు. ప్రియాంక-హమీదను నామినేట్ చేస్తూ.. 'సరదాగా మాట్లాడినా సీరియస్‌గా తీసుకుంటుంది.. రేషన్ మేనేజర్ అయ్యాక చాలా కమాండింగ్ చేస్తోంది అని రీజన్ చెప్పింది. లోబోని నామినేట్ చేస్తూ.. 'టాస్క్ లో ఇంకొంచెం గట్టిగా నిలబడాలని ' చెప్పింది.
సిరి- రవిని నామినేట్ చేస్తూ.. 'తన గేమ్ కంటే పక్కవాళ్ళ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని' రీజెన్ చెప్పింది. హమీదకి మొదటి రెండు వారాలలో ఉన్న ఫైర్ ఇప్పుడు తగ్గిపోయిందని.. రేషన్ మేనేజర్ అయ్యాక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని ఆమెని నామినేట్ చేసింది. రవి-జెస్సీని నామినేట్ చేస్తూ ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్, అతడి చుట్టూ చాలా నెగెటివిటీ అనిపిస్తుందని రీజన్ చెప్పాడు. షణ్ముఖ్‌ని నామినేట్ చేస్తూ.. 'ఎలాంటి రీజన్ లేకుండా లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశాడని' కారణం చెప్పాడు.
యానీ మాస్టర్- తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని రవి, విశ్వలను నామినేట్ చేసింది. షణ్ముఖ్- విశ్వని నామినేట్ చేస్తూ.. 'సెకండ్ వీక్ నుంచి తగ్గిపోతున్నాడు.. ఇండిపెండెంట్ గేమ్ మర్చిపోయాడనిపించింది' అంటూ రీజన్ చెప్పాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేశాడు. హమీద-ప్రియాని నామినేట్ చేస్తూ.. ఆమె తనతో సరిగా మాట్లాడరని కారణం చెప్పింది. షణ్ముఖ్‌ని సెకండ్ వీక్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా.. కానీ ఇప్పుడు సరిగ్గా ఉండడం లేదని కారణం చెప్పింది. శ్వేతా-కాజల్, మానస్ ని నామినేట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో తనను సపోర్ట్ చేయలేదని రీజన్ చెప్పింది.
ప్రియా- షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. 'ఎవరి గేమ్ వాళ్లు ఆడాలని చెప్పాడు.. కానీ అది తన విషయంలోనే పాటించడం లేదని' రీజన్ చెప్పాడు. సన్నీను నామినేట్ చేస్తూ.. ప్రతీసారి తననే టార్గెట్ చేస్తున్నాడనిపిస్తుందని రీజన్ చెప్పాడు. మానస్-జెస్సీ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు. శ్రీరామచంద్ర- జెస్సీ చాలా హైపర్‌గా ఉంటున్నాడని.. షణ్ముఖ్ వేరే ప్రపంచంలో ఉంటుంటారని కారణాలు చెప్పి ఇద్దరినీ నామినేట్ చేశాడు.
అయితే ఎవరు ఎవరిని నామినేట్ చేశారో.. బిగ్ బాస్ టీవీలో వేసి చూపించగా హౌస్ మేట్స్ అంతా ఉలిక్కిపడ్డారు. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు లోబో, జెస్సీ, షణ్ముఖ్, ప్రియా, సన్నీ, రవి, మానస్, విశ్వ, హమీద.
అయితే ‘అలా చూపించకుండా ఉండి ఉంటే, నేను నిన్ను గతవారం నామినేట్ చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నా. పేర్లు చెప్పి బిగ్‌బాస్ మంచి పని చేశాడు’ అంటూ సన్నీ కామెంట్ చేశాడు. తనని అత్యధికమంది నామినేట్ చేయడంతో వీకెండ్‌లో నాగార్జున సర్ పచ్చి మిర్చి తినిపించినప్పుడు కలిగిన మంటను షణ్ముఖ్ ఇప్పుడు బయటపెట్టాడు. ‘ఇప్పటివరకూ నా ఆట ఏంటో చూడలేదు. ఇక నుంచి చూస్తారు’ అంటూ జెస్సీ, సిరిలతో చెప్పాడు. హౌస్‌మేట్స్ అందరూ ఒక గ్రూప్‌గా ఏర్పడి, తనని కావాలని నామినేట్ చేశారని షణ్ముఖ్ బాధపడ్డాడు.
ఫేస్ టు ఫేస్ ఆడినప్పుడు అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని సిరి, జెస్సీ మాట్లాడుకున్నారు. 'నాకు నీతో మాట్లాడాలని లేదని' మానస్.. శ్వేతతో చెప్పగా.. 'అంత యాటిట్యూడ్ అవసరం లేదు' అని శ్వేతా చెప్పింది. దీనికి 'నీక్కూడా అంత యాటిట్యూడ్ అవసరం లేదని' మానస్ రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత జెస్సీతో రవి డిస్కషన్ పెట్టాడు. 'గే లవ్ స్టోరీ ఎలా ప్లాన్ చేస్తారని..' జెస్సీ ప్రశ్నించగా.. నిన్ను గ్రాంటెడ్ గా తీసుకొని ఉంటాం.. మమ్మల్ని క్షమించు అని రవి, లోబోలు చెప్పారు. ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో రవి.. షణ్ముఖ్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. అతడు కోపంగానే తీసుకున్నాడు. ఆపై రవి,సన్నీ, లోబో, విశ్వా, మానస్ కలిసి డిస్కషన్ పెట్టుకున్నారు.
వీరి మధ్య డిస్కషన్ నడుస్తుండగానే కిచెన్ వైపునకు వచ్చిన జెస్సీతో కెప్టెన్ శ్రీరామ్ రోటీల కోసం పిండిని ఉండలుగా చుట్టమన్నాడు. అయితే అది తన పని కాదని, ఇప్పటికే గిన్నెలు, కిచెన్ శుభ్రం చేస్తున్నానని చెప్పాడు. తాను ఆ పని చేయనని గొడవకు దిగాడు. దీంతో కోపం వచ్చిన శ్రీరామ్, సాయం చేయకపోతే ‘ఎవరి వంట వాళ్లే చేసుకోవాలి’ అనడంతో జెస్సీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షణ్ముఖ్, సిరి, కాజల్ దగ్గరకు వెళ్లి ‘నాకు ఫుడ్ పెట్టరట. నన్నే వండుకుని తినమంటున్నారు’ అంటూ ఊగిపోయాడు. వెంటనే కిచెన్‌లోకి వచ్చిన షణ్ముఖ్, సిరిలు... శ్రీరామ్, ఇతర టీమ్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ‘విషయం తెలియకుండా మధ్యలో వచ్చి కలగజేసుకోవద్దు’ అంటూ షణ్ముఖ్‌కు శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘నా ఫ్రెండ్ కోసం వచ్చా. ఫుడ్ పెట్టనని చెప్పడానికి నువ్వెవరు’ అంటూ షణ్ముఖ్, సిరిలు శ్రీరామ్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అనీ మాస్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, జెస్సీ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. చివరకు శ్రీరామ్ వచ్చి, జెస్సీ, షణ్ముఖ్‌లకు ఫుడ్ తినిపించాడు. అయినా కూడా షణ్ముఖ్ తగ్గకుండా గొడవను కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. మరి కిచెన్ గొడవకు ఫుల్‌స్టాప్ పడిందా? లేదా? తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments