బిగ్‌బాస్ 5 తెలుగు: షణ్ముఖ్, సిరిలను బయటకు వెళ్లిపోమన్న నాగ్.. యానీ మాస్టర్‌కు క్లాస్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం కావడంతో ఎప్పటిలాగే నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు కూడా నాగార్జున హౌస్ మేట్స్‌కి బాగానే క్లాస్ పీకాడు. ముఖ్యంగా హౌస్‌లో ప్రేమలో మునిగిపోయిన షణ్ముఖ్, సిరిలకు హితబోధ చేశాడు. ఇక్కడ వుండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్. మరి ముందు రోజు ఎపిసోడ్‌లో ఎవిక్షన్ పాస్ ఎవరికి వచ్చిందో.. ఈ వారం ఎవరెవరిని నాగార్జున సేవ్ చేశారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
శుక్రవారం నాటి ఎవిక్షన్ పాస్ లభించే గేమ్ ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. మానస్, కాజల్ ఫైర్ ఇంజిన్‌లో ఉండే ఎదురుగా యానీ మాస్టర్, సిరిలలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇద్దరి ఫోటోలు కాలిపోయాయి. దీంతో సన్నీ ఒక్కడే మిగలడంతో ఆయనకు ఫ్రీ ఎవిక్షన్ పాస్ లభించింది. దీంతో తమిళ హీరో విజయ్ సినిమా పాటలకు డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ ఎవిక్షన్ పాస్ ఎక్కడ, ఎప్పుడు వాడాలో తాను చెబుతానని బిగ్‌బాస్ తెలిపారు. ఈ టాస్క్ లో ప్రియాంక, మానస్, కాజల్, సన్నీ కలిసి గేమ్ ఆడారని, నాటకాలు ఆడుతున్నారంటూ యానీ మాస్టర్ కామెంట్ చేయడంతో పాటు వెక్కి వెక్కి ఏడ్చింది. యానీ మాస్టర్‌కు సపోర్ట్‌గా శ్రీరామ్ కూడా వాదనకు దిగాడు.
ఆ తర్వాత ‘‘కోల్గేట్ ఫ్రెష్’’ అంటూ చిన్న గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇంటి సభ్యులు ఎవరు ఫ్రెష్‌గా తమ ఆలోచనలు మార్చుకోవాలనేది చెప్పాల్సి ఉంది. ముందుగా యానీ మాస్టర్ పేరుని కాజల్, కాజల్ పేరుని సిరి, యానీ మాస్టర్, శ్రీరామ్ పేరుని మానస్, మానస్ పేరుని శ్రీరామ్, షణ్ముఖ్ పేరుని సన్నీ, సిరి పేరుని షణ్ముఖ్, యానీ మాస్టర్ పేరు రవి చెప్పారు.
ఆ వెంటనే నాగ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే ఈ వారం బాగా ఆడిన వారికి గోల్డ్ ఇవ్వాలని, వరస్ట్‌గా ఆడిన వారికి కోల్ ఇవ్వాలని రవికి చెప్పాడు. ఇందులో రవి ... పింకీకి, మానస్‌కి, యానీ మాస్టర్‌కి, శ్రీరామ్‌కి గోల్డ్ ముద్దలిచ్చాడు. సన్నీ, కాజల్, షణ్ముఖ్, సిరిలకు బొగ్గు ఇచ్చాడు. చివరికి తాను కూడా బొగ్గే తీసుకోవడం విశేషం. అనంతరం సిరి, షణ్ముఖ్‌లను విడివిడిగా పిలిచి పెద్ద షాక్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోమ్మంటూ తలుపులు తెరిచాడు. ముందుగా సిరిని... షణ్ముఖ్‌తో గొడవ పడి బాత్‌రూమ్‌లో బాదుకోవడాన్ని ప్రస్తావించాడు నాగార్జున. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో కనెక్షన్ ఇంకా ఎమోషనల్ అయిపోతోందని సిరి చెప్పింది. తనకు ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా చేయాలనిపిస్తే చేసేస్తున్నా' అని వివరణ ఇచ్చుకుంది. ఇంకోసారి ఇలా నీకు నువ్వు గాయపర్చుకుంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇవ్వడంతో... మరోసారి ఇలా చేయనని మాటిచ్చింది సిరి.
ఆ తర్వాత షణ్ముఖ్‌ని పిలిపించి.. సిరితో నీ ప్రవర్తన ఏంటంటూ నాగ్ మండిపడ్డారు. తనకు దీప్తి గుర్తొస్తుందని.. మెంటల్లీ వీక్ అవుతున్నానని చెప్పాడు. సిరితో అలా ప్రవర్తించడం వెనుక తప్పు తనదే అని అంగీకరించాడు. దీప్తిని మిస్ అవుతున్నట్లుగా వుంటే ఇప్పుడే హౌస్ నుంచి వెళ్లిపోవచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగ్. దీంతో బుద్ధి తెచ్చుకున్న షణ్ముఖ్ మళ్లీ ఇలా జరగనివ్వనని.. కొత్త షణ్ముఖ్‌ని చూస్తారని చెప్పాడు.
తర్వాత మానస్‌ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు నాగ్.. ప్రియాంక తన మీదే ఎక్కువగా దృష్టి పెడుతోందని, అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకుంటుందని మానస్ చెప్పాడు. ఏం చెబితే ఎలా తీసుకుంటుందోనని తనకు భయంగా వుందని తెలిపాడు. దీనికి స్పందించిన నాగ్.. ప్రియాంక మానస్ గురించి మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించారు. ఆ వెంటనే ఆట బాగానే ఆడుతున్నావ్.. ఈ సిచ్యువేషన్‌ని కూడా హ్యాండిల్ చేసుకుంటావ్ అని అనుకుంటున్నా అంటూ చెప్పారు నాగార్జున. ఆ తరువాత యానీ మాస్టర్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. కాజల్ విషయంలో లైన్ క్రాస్ అవుతున్నావ్ అని హెచ్చరించారు. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని నాగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తన ప్రవర్తన మార్చుకుంటానని మాట ఇచ్చింది యానీ మాస్టర్.
అనంతరం నామినేషన్‌లో ఉన్న ఎనిమిది మందికి కొన్ని ఎన్వలాప్స్ ఇచ్చి అందులో ఏముందో చదవాల్సిందిగా చెప్పారు నాగ్. వాటిల్లో శ్రీరామచంద్రకి సేఫ్ అని వచ్చింది. ఆ తర్వాత నామినేషన్‌లో ఉన్న ఏడుగురిని నిలబడమని చెప్పిన నాగార్జున.. వారి ముందు సూట్ కేస్ పెట్టారు. అందులో షర్ట్ ఉంటుందని.. దానిపై సేవ్ అయ్యేవారి ఫోటో ఉంటుందని చెప్పారు. దానిని తెరిచి చూడగా.. సన్నీ ఫోటో ఉండటంతో అతడు సేవ్ అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments