బిగ్‌బాస్ 5 తెలుగు: ధూంధాంగా దీపావళీ ఎపిసోడ్.. చివరిలో లోబో ఎలిమినేషన్.. !!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు దీపావళీ వేడుక ధూమ్ ధామ్‌గా జరిగింది. ప్రత్యేక కార్యక్రమాలతో, స్పెషల్ గెస్ట్‌లతో హౌస్ సందదిగా మారింది. నామినేషన్స్ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేఖలు అందుకోలేకపోయిన వారికి నాగార్జున లేఖలు అందజేశారు. ఇక యాంకర్ సుమ, విజయ్ దేవరకొండ బ్రదర్స్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ దివి, అవికా గోర్, మోనాల్ గజ్జర్, అవినాష్, బాబా భాస్కర్, కల్పన, సంతోష్ శోభన్, మెహ్రీన్, డైరెక్టర్ మారుతీలతో పాటు సీనియర్ హీరోయిన్ శ్రీయలు హౌస్‌లో సందడి చేశారు. మరి ఆ వివరాలు తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
దీపావళి కావడంతో హౌస్ మొత్తం లైట్లు, దీపాలతో నిండిపోయింది. నాగ్ సహా హౌస్ మేట్స్ అంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. ముందుగా ఇంటి సభ్యులకు స్వీట్స్ పంపించారు నాగార్జున. బిగ్‌బాస్ షో మొదలై 60 రోజులు కావడంతో ఆ జర్నీను హౌస్ మేట్స్ కి వీడియో రూపంలో చూపించారు నాగ్. అలానే నామినేషన్ ప్రాసెస్‌లో లెటర్స్‌ను త్యాగం చేసిన హౌస్ మేట్స్‌ని మెచ్చుకుని ఆ లెటర్స్‌ను ఇచ్చారు నాగార్జున. ఈ క్రమంలో షణ్ముఖ్ లెటర్‌ని సిరి చదవగా.. షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. అలానే మానస్, రవి కూడా తమ లెటర్స్‌ను చదివి వినిపించగా.. కన్నీళ్లు పెట్టుకున్నారు. రవిని కంట్రోల్ చేయడం అసలు ఎవరితరం కాలేదు. అతడు చాలాసేపటివరకు ఏడుస్తూనే ఉన్నాడు. పెళ్లి తరువాత తన లైఫ్ చాలా మారిపోయిందని.. నిత్య(రవి వైఫ్) తనకు సపోర్ట్ సిస్టంలా మారిందని చెప్పాడు. ఇకపై తనేంటో గేమ్ లో చూపిస్తానని చెప్పాడు రవి.
అనంతరం లోబో తనకొచ్చిన లెటర్ చదువుకొని ఎమోషనల్ అయ్యాడు. అలానే సిరి లెటర్ ను షణ్ముఖ్ చదవగా.. ఆ లెటర్ ఎంతో రొమాంటిక్ అండ్ స్వీట్ గా ఉందని షణ్ముఖ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అలానే హోస్ట్ నాగార్జున ముప్పై ఏళ్ల క్రితం అమల తనకిచ్చిన లెటర్‌ని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నానని చెప్పారు. ఆ తరువాత ఆయన హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు.
బెస్ట్ జోడీ ఆఫ్ ది హౌస్ : ఈ టాస్క్ లో భాగంగా స్వీట్ అండ్ ది స్పూన్ అనే గేమ్ ఆడించారు. ఇందులో రవి-జెస్సీ టీమ్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత నామినేషన్ ఉన్న ఆరుగురిలో మానస్ సేవ్ అయినట్లుగా అనౌన్స్ చేశారు. ఆ తరువాత స్టార్ యాంకర్ సుమని పిలిచారు నాగార్జున. ఎప్పటిలానే తన మాటలు, పంచ్‌లతో ఆమె నాగార్జునపై కౌంటర్లు వేసింది. ఆ తరువాత హౌస్ లోకి వెళ్లింది సుమ. గ్లాస్ కేస్‌లో నుంచి హౌస్ మేట్స్ తో మాట్లాడి అల్లరి చేసింది. అలాగే హౌస్‌లో జరిగిన కొన్ని విషయాల గురించి కంటెస్టెంట్స్‌ను అడిగింది. ఇదే సమయంలో షణ్ముఖ్-సిరిల ముద్దు టాపిక్ ప్రస్తావిస్తూ కాసేపు వారిద్దరినీ ఏడిపించింది. అలానే కాజల్‌ని సైతం చెడుగుడు ఆడుకుంది
తర్వాత ‘‘ దీపికా.. పాచికా’’ అనే టాస్క్ ఆడించారు నాగార్జున. పాచిక ఏ నంబర్ పడితే అన్ని దీపాలు పక్క వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆట అయిపోయేసరికి ఎవరి దగ్గర ఎక్కువ దీపాలు ఉంటాయో వాళ్లే విజేతలని చెప్పారు. ఈ టాస్క్ లో షణ్ముఖ్-సిరి విజేతలుగా నిలిచారు. నామినేషన్‌లో మిగిలిన ఐదుగురిలో.. ఎవరి కుటుంబసభ్యుల వాయిస్ అయితే వినిపిస్తుందో వాళ్లే సేఫ్ అని చెప్పగా.. షణ్ముఖ్ అమ్మగారి గొంతు వినిపించడంతో ఆయన సేవ్ అయినట్లుగా నాగ్ ప్రకటించారు.
ఆ తరువాత స్టేజ్ పైకి విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు. విజయ్ వస్తూ వస్తూనే.. సార్ .. మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటనీ నాగార్జునని అడగ్గా...ఏం జరిగినా.. అది మైండ్‌లోకి తీసుకోనని.. పడుకుంటే 30 సెకన్లలో నిద్రపట్టాలని.. అది తన తండ్రి దగ్గర నేర్చుకున్నట్లు చెప్పారు కింగ్. అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడిన విజయ్ దేవరకొండ, నాగార్జున వారికి క్విజ్ పోటీ పెట్టారు. ఈ టాస్క్ లో రవి-జెస్సీ టీమ్ గెలిచింది.
ఎలిమినేషన్స్‌లో ఉన్న నలుగురిలో ఒకరిని విజయ్ దేవరకొండ సేవ్ చేస్తారని నాగార్జున చెప్పారు. దీనిలో భాగంగా ఒక బాంబుని పోలిన టాయ్ ని స్టేజ్ పైకి తెచ్చిన నాగార్జున, తాను పేరు చెబుతున్నప్పుడు ఒక్కో వైర్ కట్ చేయాలని, వైర్ కట్ చేసినప్పుడు బాంబు పేలిన సౌండ్ వచ్చినవారు సేవ్ కానట్లు, పేలిన సౌండ్ రాకపోతే సేవ్ అయినట్లు చెప్పారు. మొదట లోబో పేరు చెప్పగా విజయ్ వైర్ కట్ చేశారు. బాంబు పేలిన సౌండ్ రావడం జరిగింది. దానితో లోబో సేవ్ కాలేదు. రెండో వైర్ శ్రీరామ్ కోసం కట్ చేయగా మరలా సౌండ్ వచ్చింది. అలా లోబో, శ్రీరామ్ సేవ్ కాలేదు.
తన హ్యాండ్ బాగోలేదని విజయ్ దేవరకొండ కట్టర్ ఆనంద్ చేతికి ఇచ్చారు. సిరి పేరు చెప్పగా, ఆనంద్ వైర్ కట్ చేశారు. సౌండ్ రాకపోవడంతో సిరి సేవ్ అయ్యారు. తనను ఆనంద్ సేవ్ చేశాడన్న ఆనందంలో సిరి... '' ఐ లవ్ యూ ఆనంద్' అంటూ చెప్పింది. ఆమెకు ఆనంద్ సైతం ఐ లవ్ యూ టూ చెప్పారు. ఇక రవి సైతం సేవ్ కాలేదు. అనంతరం గెస్ట్‌గా వచ్చిన హీరోయిన్ అవికా గోర్ .. ఎలిమినేషన్‌లో వున్న రవి, లోబో, శ్రీరామ్ నుండి శ్రీరామ్ సేవ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఎలిమినేషన్స్‌లో రవి, లోబో మిగిలారు.
ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్‌లోకి ముక్కు అవినాష్, బాబా భాస్కర్ మాస్టర్ వెళ్లారు. గ్లాస్ కేజ్ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా ప్రియాంకను ఇమిటేట్ చేసి ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు అవినాష్, బాబా మాస్టర్. ఆ తరువాత సిరి-షణ్ముఖ్, సన్నీ-శ్రీరామ్ లను అనుకరించి హౌస్‌మేట్స్‌ను నవ్వించారు. అనంతరం స్టేజ్ పైకి సింగర్ కల్పనను పిలిచారు నాగార్జున. ఆమెతో హౌస్‌మేట్స్ కోసం కొన్ని పాటలు పాడించారు. ఆ తరువాత హౌస్ లోకి సోహైల్, అరియనా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి వీరంతా గేమ్ ఆడించారు. గేమ్ తరువాత హౌస్ గిఫ్ట్‌లను ప్రజంట్ చేశారు.
ఇదే సమయంలో బిగ్‌బాస్ స్టేజ్‌పైకి సంతోష్ శోభన్, మెహ్రీన్ డాన్స్ కనిపించారు. ఆ తరువాత నాగార్జున.. దర్శకుడు మారుతిని స్టేజ్ పైకి పిలిచారు. అలా వచ్చిన మారుతి 'మంచిరోజులు వచ్చాయి' సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు నాగార్జున. ఈ టాస్క్ లో షణ్ముఖ్-సిరిలు గెలిచారు. ఆ తరువాత స్టేజ్ పైకి శ్రియను పిలిచారు నాగ్. అనంతరం హౌస్‌మేట్స్‌తో డాన్స్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఇందులో రవి-జెస్సీ విన్ అయ్యారు .
ఎపిసోడ్ చివర్లో రెండు చిచ్చు బుడ్లు తీసుకొచ్చిన నాగార్జున ఒకదానిపై లోబో, మరొకదానిపై రవి పేరు రాశారు. తాను ఈ రెండు చిచ్చుబుడ్లను వెలిగిస్తానని.. ఎవరి చిచ్చుబుడ్డి అయితే వెలుగుతుందో వారు సేఫ్, రెండవవారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. నాగార్జున రెండు చిచ్చుబుడ్లను మార్చి మార్చి వెలిగించడం జరిగింది. చివరకు రవి పేరు రాసి ఉన్న చిచ్చుబుడ్డి వెలగడంతో.. లోబో ఎలిమినేట్ అయ్యాడు.
అనంతరం హౌస్‌మెట్స్ వద్ద వీడ్కోలు తీసుకున్న లోబో... స్టేజ్‌పైకి వచ్చాడు. తనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కాజల్‌ను కోరాడు. ఈ సందర్భంగా లోబో నాకు ఎప్పుడూ బూస్ట్ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్ అని తెలిపాడు. అలాగే కాజల్, సన్నీ, రవి కూడా తన ఫ్రెండ్సేనని పేర్కొన్నాడు. యానీ గనుక కెప్టెన్ అయితే మా గల్లీలో పటాకులు కాలుస్తానన్నాడు. దీనిని బట్టి హౌస్‌లో మిగిలిన షణ్ముఖ్, జెస్సీ, సిరి, మానస్, పింకీ, శ్రీరామ్.. శత్రువులని చెప్పకనే చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments