ఆ ఇద్దరు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌‌కు దశ తిరిగిందిగా.. ఏకంగా చరణ్- శంకర్‌ల సినిమాలో ఛాన్స్..?

  • IndiaGlitz, [Thursday,November 18 2021]

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి భారతదేశంలో ఉన్న క్రేజ్‌ ఏంటో అందరికి తెలిసిందే. హాలీవుడ్ నుంచి హిందీకి ఆ తర్వాత దేశంలోని ప్రాంతీయ భాషల్లోకి బిగ్‌బాస్ దిగుమతి అయ్యింది. స్టార్‌లు హోస్ట్‌లుగా రావడంతో బిగ్‌బాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఇంటిల్లిపాదికి వినోదం కల్పించడంతో భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా.. ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగులో అయితే ఈ షోకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మిగతా రీజనల్ లాంగ్వేజ్‌ల కంటే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. గత నాలుగు సీజన్ల టీఆర్పీ రేటింగ్స్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌గా వ్యవహరించి బయటకు వచ్చిన వారికి యువతలో క్రేజ్ బాగానే వుంటుంది. ఆ వెంటనే ఎందరికో సినిమాల్లో అవకాశాలు వచ్చిన ఘటనలు వున్నాయి. ఇక బిగ్‌బాస్ ఐదో సీజన్‌ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో పాల్గొన్న ఇద్దరికి సినిమా అవకాశాలు దక్కినట్లుగా టాలీవుడ్ టాక్. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు విశ్వ అయితే మరొకరు లొబో. వీరిద్దరికీ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సినిమాలో ఛాన్స్ దొరికినట్లు కథనాలు వస్తున్నాయి. తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ - రామ్ చరణ్‌ల కాంభినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో లోబో, విశ్వలు నటించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ చెర్రీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. మరి లోబో, విశ్వలకు నిజంగానే చరణ్ సినిమాలో ఛాన్స్ దక్కిందో లేక ఏదైనా సందర్భంలో దిగిన ఫోటోనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.