బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌కు కెప్టెన్సీ ఇక లేనట్లే.. అంతా శ్రీరామ్ వల్లే, బాత్రూమ్లో కన్నీళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
రోజులు గడిచేకొద్ది బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ మరింత ఉత్కంఠగా మారుతోంది. సోమవారం నామినేషన్స్ సందర్భంగా జరిగిన గొడవ ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. గత వారం నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో షణ్ముఖ్- సిరిలు కాస్త వొళ్లు దగ్గర పెట్టుకుని వుంటున్నారు. నిన్నటి నామినేషన్స్ సందర్భంగా చోటు చేసుకున్న విషయాలపై కాజల్- శ్రీరామ్‌ల మధ్య కిచెన్‌లో పెద్ద వాదనే జరిగింది. ఇక కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో మళ్లీ కాస్తంత రగడ జరిగింది. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
శ్రీరామ్ సోలో గేమ్ ఆడుతున్నానని చెప్పి.. రవి, యానీ మాస్టర్లతో కలిసి ఆడాడని, కానీ ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకునే దమ్ము లేదంటూ సన్నీ-కాజల్‌లు డిస్కస్ చేసుకున్నారు. అదే సమయానికి అక్కడకి వచ్చిన శ్రీరామ్‌తో కాజల్‌కి గొడవ జరిగింది. ఇక రాత్రి షణ్ముఖ్-సిరిలకు చిన్న గొడవ జరిగింది. ఎప్పటిలానే షణ్ముఖ్ బెడ్ పైకి వెళ్లి అతడిని హత్తుకొని సారీ చెప్పింది. అదే సమయంలో సిరి రియలైజ్ అయ్యింది. తన గేమ్‌ల విషయంలో సరిగా ఆడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చేసిన తప్పులని గుర్తు చేసుకుని సిరి ఎమోషనల్ అవ్వగా.. ఆమెని షణ్ముఖ్ ఓదార్చాడు. పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇకపై బాగా ఆడు అంటూ సలహా ఇచ్చాడు.
ఇక బిగ్‌బాస్ 5వ సీజన్లో చివరి కెప్టెన్సీ టాస్క్ షురూ అయ్యింది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఓ సింహాసనం ఏర్పాటు చేశారు. బజర్ మోగినప్పుడల్లా ఆ సింహాసనంలో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్ వరకు వాళ్లు సేఫ్ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరిలో ఒకరిని సేవ్ సైడ్ చేసే పవర్ నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. అలా సేవ్ అయిన వారు కెప్టెన్ పోటీదారులు అవుతారంటూ బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను డిజైన్ చేశారు.
ముందుగా సిరి కుర్చీలో కూర్చుంది. మిగిలిన హౌస్ మేట్స్ కి హ్యాట్స్ కి సంబంధించిన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సన్నీ, రవి లాస్ట్ లో మిగిలిపోయారు. దీంతో వీరిద్దరిలో ఒకరిని సిరి సేవ్ చేయాలి. రవి-సన్నీ ఆమెని కాపాడమని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనికి సిరి.. తనకు ఇద్దరితో మంచి ర్యాపో ఉందని.. కానీ గేమ్ ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి కాబట్టి రవిని సేవ్ చేయాలనుందని చెప్పింది. దానికి సన్నీ 'కెప్టెన్సీ కంటెండర్స్ కి ఇది లాస్ట్ ఛాన్స్ ఒక్కసారి ఆలోచించు' అని సిరిని అడిగాడు. కానీ సిరి రవినే సేవ్ చేయడంతో సన్నీ హర్ట్ అయ్యాడు. కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారని.. సిరి మనసులో ఏదో పెట్టుకొని తనను గేమ్ నుంచి తప్పించిందని సన్నీ వాపోయాడు.
దీంతో సిరి తొలుత సింహాసనాన్ని దక్కించుకుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో హుక్స్‌కి వేలాదదీసి వుంచి క్యాప్‌లను చేతితో ముట్టుకోకుండా తలకు పెట్టుకుని... పక్కనే ఉన్న హుక్స్‌కి తగిలించాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరికి మిగిలారు. దీంతో రవి-సన్నీలు తమను కాపాడాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనికి సిరి.. తనకు రవిని సేవ్ చేయాలనుందని చెప్పింది. వెంటనే రియాక్ట్ అయిన సన్నీ 'కెప్టెన్సీ కంటెండర్స్కి ఇదే చివరి అవకాశమని, తన గురించి ఒక్కసారి ఆలోచించు' అని సిరిని బ్రతిమలాడాడు. కానీ సిరి తను చెప్పినట్లుగానే రవినే సేవ్ చేయడంతో సన్నీ హర్ట్ అయ్యాడు. కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రతిసారి తననే టార్గెట్ చేస్తున్నారని.. సిరి మనసులో ఏదో పెట్టుకొని తనను గేమ్ నుంచి తప్పించిందని షణ్ముఖ్ దగ్గర వాపోయాడు.
ఇక రెండో రౌండ్లో శ్రీరామ్ నియంత కుర్చీని దక్కించుకోవడంతో మిగిలిన హౌస్ మేట్స్‌కి స్లిప్పర్స్‌కి సంబంధించిన టాస్క్ ఇచ్చారు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరు సభ్యులు నియంత దగ్గరకు వెళ్లాల్సి వుంటుంది. ఇందులో రవి, కాజల్ లాస్ట్ రావడంతో.. వారిద్దరూ నియంత శ్రీరామ్‌ని రిక్వెస్ట్ చేసుకున్నారు. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్ బ్యాండ్ వేసుకోవాలని చెబుతూ.. అతను కూడా రవిని సేవ్ చేయడంతో కాజల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోగొట్టాడంటూ కాజల్ ఎమోషనల్ అయ్యింది. బాత్రూమ్లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేసింది. అనంతరం శ్రీరామ్ వెళ్లి కాజల్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు.
ఇక మూడో రౌండ్లో రవి నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిన సభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా తలపై ఆరెంజ్‌లను పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరంలో ఉన్న బుట్టలో వేయాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో మానస్, షణ్ముఖ్ చివరి స్థానాల్లో నిలవడంతో తమను సేవ్ చేయాల్సిందిగా నియంత రవిని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇద్దరి వాదనలు విన్న రవి.. షణ్ముఖ్‌ని సేవ్ చేశాడు.
నాల్గోసారి ప్రియాంక కుర్చీలో కూర్చోవడంతో.. మిగిలిన హౌస్ మేట్స్‌కి డ్రమ్స్‌కి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో షణ్ముఖ్-శ్రీరామ్ లాస్ట్‌లో రావడంతో.. ఇద్దరూ తమను సేవ్ చేయమని ప్రియాంకను రిక్వెస్ట్ చేసుకున్నారు. దీంతో షణ్ముఖ్‌ని సేవ్ చేస్తున్నట్లు చెప్పింది. చివరి రౌండ్లో బజర్ మోగగానే సిరి, ప్రియాంక ఒకేసారి కూర్చీలో కూర్చొన్నారు. దీంతో 'నేనే ముందు కూర్చున్నా..' అంటూ వాదించుకున్నారు. దీంతో సంచాలక్‌గా వున్న మానస్.. ప్రియాంకకే జై కొట్టాడు. దీనిపై సిరి నొచ్చుకుంది. అయినప్పటికీ మానస్.. ప్రియాంకకే సపోర్ట్ చేయడంతో ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయి... బెడ్ రూమ్‌లో ఏడ్చేసింది. నువ్వు ఎమోషనల్ అవ్వడం నచ్చలేదని ... నా ఫ్రెండ్ ఇంత వీక్‌గా ఉండొద్దని షణ్ముఖ్ సిరిపై మండిపడ్డాడు. మరి బిగ్‌బాస్ 5వ సీజన్లో చివరి కెప్టెన్ ఎవరో తెలియాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com