బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ ఔట్ .. ఇంట్లో గొడవలకి కారణం నేనేనంటూ సారీ, టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే

  • IndiaGlitz, [Monday,December 13 2021]

బిగ్‌బాస్ 5 తెలుగులో సరదా సండే వచ్చేసింది. ఆటలు, పాటలతో పాటు ఎలిమినేషన్ కూడా వుండేది ఈరోజే. అందుకే ఇంటి సభ్యులు ఆనందంగా వున్నా... లోలోపల టెన్షన్ పడుతూ వుంటారు. హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఎప్పటిలాగే సరదా టాస్క్‌లు ఆడించారు. దీనితో పాటు సిరి, షణ్ణూలను మూడు, నాలుగో కంటెస్టెంట్‌గా అనౌన్స్ చేశారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌లో చివరి ఎలిమినేషన్ జరిగింది. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు..? ఈ రోజు హౌస్‌లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

హౌస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు నాగ్. డిసెంబర్ 19న బిగ్‌బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే వుంటుందని అనౌన్స్ చేశారు. హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్ ఆడించారు. ఉన్న ఆరుగురిని రెండు టీమ్ లుగా విడగొట్టి.. వారికి సాంగ్స్ టాస్క్ ఇచ్చారు. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్ ఒక టీంగా... మానస్, సన్నీ, సిరి మరొక టీం‌గా గేమ్ ఆడారు. టాస్క్‌లో భాగంగా ప్రతి జట్టు నుండి ఒక సభ్యుడు వచ్చి, స్లిప్‌లో ఉన్న పాటను నటించి చూపాలి, తమ టీమ్ సభ్యులు ఆ పాట ఏమిటో గెస్ చేయాలి. ఎక్కువ సార్లు గెస్ చేసిన శ్రీరామ్ టీం...మానస్ టీంపై గెలిచింది.

ఆ తర్వాత సెకండ్ ఫైనలిస్ట్‌ను ఫస్ట్ ఫైనలిస్ట్ రివీల్ చేసే బాధ్యతను సన్నీకి ఇచ్చార్ నాగ్. స్విమ్మింగ్ పూల్ దగ్గరకి సన్నీని వెళ్లమని చెప్పిన నాగ్.. అక్కడున్న పుల్లీను బయటకు తీయమని చెప్పారు. దానిపై సిరి ఫొటో ఉండడంతో ఆమె సంతోషానికి అవధుల్లేవు. వెంటనే వెళ్లి షణ్ముఖ్ ని హగ్ చేసుకుంది. అనంతరం బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు కొన్ని ప్రశ్నలను సంధించగా హౌస్‌మేట్స్‌ వాటికి సమాధానాలు చెప్పారు.

1. ముందుగా ముందుగా జెస్సీ.. 'షన్ను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. నీకు సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. వేరే జనాలు ఏం అనుకుంటున్నారో.. నువ్ ఎప్పుడైనా ఆలోచించావా..?

దానికి షణ్ముఖ్ బదులిస్తూ.. 'సిరితో నా రిలేషన్ ఏంటో నీకు తెలుసు.. కానీ అది బయటకు ఎలా వెళ్తుందో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చిన తరువాతనే తెలిసింది.. సిరి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తనకి ఎప్పటికీ అండగా ఉంటాను' అని చెప్పుకొచ్చాడు.

2. యానీ మాస్టర్ మాట్లాడుతూ.. సన్నీ, నేను హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత కూడా నువ్వు నన్ను బ్యాక్ బిచ్ చేస్తున్నావ్.. నేను చాలా బాధ పడుతున్నా..? అని అంది.

దానికి సన్నీ బదులిస్తూ నేనెప్పుడూ అలా చేయలేదు.. నా అభిప్రాయం చెప్పాను. ఆమె చెప్పేవన్నీ చెబుతుంది కానీ దానిపై స్టాండ్ తీసుకోరు. ఆమె ఎప్పటికీ నాకు మంచి ఫ్రెండ్' అని చెప్పాడు సన్నీ.

3. నటరాజ్ మాస్టర్.. శ్రీరామ్ ని ప్రశ్నిస్తూ.. 'ఐస్ టాస్క్ లో నీకు పింకీ ఇచ్చిన ట్రీట్మెంట్ వలన హెల్త్ పాడైంది. ఆ తరువాత నువ్ ఎలా ఆడతావో అనుకున్నా. పింకీ చేసిన ట్రీట్మెంట్ గేమ్ పరంగా నీకు ప్లస్ అయిందా..? మైనస్ అయిందా..?'

బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను.. కానీ లోపల నా ఆట నేను ఆడలేకపోయానే అనే బాధ ఉంది. సో.. మైనస్ అయిందనే అనుకుంటున్నాను' అని ఆన్సర్ ఇచ్చాడు శ్రీరామ్

4. ఆ తరువాత ప్రియాంక లైన్‌లోకి వచ్చింది. మానస్.. నేను నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. ఇన్నిరోజులు హౌస్‌లో నువ్వు నన్ను భరించావా..? లేక నటించావా..? అని ప్రశ్నించింది.

దానికి మానస్ రిప్లయ్ ఇస్తూ.. భరించాను.. ఎప్పుడూ నటించలేదు. జెన్యూన్ ఎమోషన్స్ డిస్ ప్లే చేశాను' అని బదులిచ్చాడు.

5. జెస్సీ ఈసారి షణ్ముఖ్‌-సిరికి కూడా కలిపి ప్రశ్న వేశాడు. 'నువ్ బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడడానికి వెళ్లావ్ కదా సిరి.. ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను.. అది కనెక్ట్ అయిపోతున్నాను.. ఇది కనెక్ట్ అయిపోతున్నాను అని పిచ్చెక్కిపోతున్నావ్. అవసరమా నీకు..?

దీనికి సిరి స్పందిస్తూ.. నేను బి‌గ్‌బాస్‌కి గేమ్ ఆడడానికే వచ్చాను.. కానీ మధ్యలో కొన్ని ఎమోషన్స్ వచ్చాయి. బట్ నేనెప్పుడూ గేమ్ లో ఎమోషన్స్ పెట్టలేదు' అని చెప్పింది.

6. ఆ తరువాత ప్రియా.. కాజల్‌కి ప్రశ్న వేసింది. నువ్వు బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది.. నిజంగా నువ్వ ఇలానే ఉంటావా..? లేక గేమ్ వరకేనా..?' అని ప్రశ్నించింది.

దానికి కాజల్ ఆన్సర్ ఇస్తూ.. 'నేనిక్కడ ఎలా ఉంటున్నానో అదే నేను. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలానే ఉంటాను.. ఇలానే రియాక్ట్ అవుతాను' అని చెప్పింది .

అనంతరం నాల్గో ఫైనలిస్ట్‌ను రివీల్ చేసే బాధ్యతను సిరికి ఇచ్చారు నాగార్జున. సిరి గార్డెన్ ఏరియాలో కర్టైన్‌తో కప్పబడి ఉన్న ఫోటోను... రివీల్ చేసింది. అందులో షణ్ముఖ్ ఫోటో ఉండడంతో అతడు నాలుగో ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు. దీనితో కాజల్, మానస్‌లలో ఎలిమినేట్ అయ్యేదెవరు? ఫైనల్ కి వెళ్ళేదెవరనే ఉత్కంఠ కొనసాగింది. ఆ తరువాత హౌస్‌మేట్స్‌కి మరో టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇంటి సభ్యుల ఫొటోలతో ఉన్న బోర్డులను మెడలో వేసుకొని వారిలా మాట్లాడాలిని చెప్పారు. ముందుగా మానస్.. శ్రీరామ్ ఫొటోను, శ్రీరామ్.. కాజల్‌ ఫోటోని, షణ్ముఖ్ ఫొటోని కాజల్, సన్నీ ఫొటోని షణ్ముఖ్ వేసుకుని నవ్వించారు.

ఇక ఫైనల్ ఎలిమినేషన్‌కి టైం ఆసన్నమైంది. స్వయంగా నాగార్జునే ఆ బాధ్యత తీసుకున్నారు. మానస్ పేరు బోర్డు‌పై ప్రత్యక్షం కాగా... కాజల్ ఎలిమినేషన్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ మానస్, సన్నీ ఎమోషన్ తట్టుకోలేపోయారు. చివరికి బిగ్‌బాస్ 5 తెలుగు ఫైనలిస్ట్స్‌గా సన్నీ, మానస్, శ్రీరామ చంద్ర, సిరి, షణ్ముఖ్ డిక్లేర్ అయ్యారు.

ఇదే సమయంలో బిగ్‌బాస్ వేదికపైకి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వచ్చి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'ను ప్రమోట్ చేశారు. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. అలానే ప్రతీఒక్కరూ మూడు మొక్కలను నాటాలని ఆయన కోరారు. అనంతరం నాగార్జున కూడా తాను 1000 ఎకరాల ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని చెప్పారు.

ఆపై స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ గేమ్‌ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు అంకితమివ్వాలన్నాడు. సన్నీకి 5 టైమ్స్ ఎంటర్టైన్మెంట్, మానస్ కి 5 టైమ్స్ ఫ్రెండ్షిప్, సిరికి 5 టైమ్స్ ఎమోషన్, శ్రీరామ్‌కి 5 టైమ్స్ యాక్షన్, షణ్ముఖ్‌కి 5 టైమ్స్ డ్రామా ఇచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకుని సారీ చెప్పింది. కానీ అవేవీ తను కావాలని చేయలేదని కాజల్ స్పష్టం చేసింది.

More News

మా బుద్ధి వంకరా.. సమంత ఐటెం సాంగ్‌పై ‘‘మగాళ్ల’’ సంఘం ఫైర్, బ్యాన్ చేయాలంటూ ఫిర్యాదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఈ నెల 17 థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.

21 ఏళ్ల విరామానికి తెర.. మిస్‌ యూనివర్స్‌గా భారతీయ యువతి

దాదాపు 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం భారతదేశానికి దక్కింది. మిస్ యూనివర్స్ 2021గా హర్నాజ్ కౌర్ సంధు ఎంపికయ్యారు.

'కలసి ఉంటే కలదు సుఖం'... స్టార్ మా లో...

విలక్షణమైన సీరియల్స్ అందించడంలో మొదటి నుంచీ తన ముద్ర తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న స్టార్ మా ఇప్పుడు మరో సరికొత్త ధారావాహిక సిద్ధం చేసింది.

ఆహా సరికొత్త ఒరిజిన‌ల్ ఫిలిం ‘సేనాప‌తి’.. క్రైమ్ డ్రామా సిరీస్‌తో న‌ట కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఓటీటీ ఎంట్రీ !

మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన

సుమ నటించిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి -  రానా దగ్గుబాటి

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో కనిపించబోత్నారు.