బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ రూమ్‌కు జెస్సీ.. గేమ్స్, టాస్క్‌లు లేక కబుర్లలో మునిగిపోయిన హౌస్మేట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషన్స్‌తో సాగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ వ్యవహారం ఇంటి సభ్యులను ఆవేదనకు గురిచేసింది. జెస్సీ ఆరోగ్యం గురించి ఆరా తీసిన బిగ్‌బాస్.. ఆయనను తక్షణం హౌస్ నుంచి బయటకు రావాలని ఆదేశించడంతో ఇంటి సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇదే సమయంలో నామినేషన్ల గురించి డిస్కస్ చేసుకున్న ఇంటి సభ్యులు... ఉంటే కలిసి ఉందాం. పీకితే కలిసే పోదాం... ఈ వారం ఒకళ్లం, వచ్చే వారం ఇంకొకళ్లం అవుతామనుకున్నారు. మరి హౌస్‌లో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేద్దాం.
షో ప్రారంభమైన కొద్దిసేపటికి బిగ్‌బాస్ జెస్సీని కన్ఫెషన్ రూమ్పి పిలిపించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇప్పుడు ఫర్వాలేదన్నాడు జెస్సీ. అయితే వైద్యుల సమక్షంలో ఇన్వెస్టిగేషన్ జరగాలని, టెస్టులు చేయాల్సి ఉందని, తక్షణమే హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పాడు బిగ్‌బాస్. అందుకు సరేనన్న జెస్సీ హౌస్ నుంచి వెళ్లిపోవాలనే మాటతో కంటతడి పెట్టుకున్నాడు. హౌస్‌లోకి వచ్చి సభ్యులతో అదే విషయం చెప్పాడు. దీంతో అందరూ షాక్‌కి గురయ్యారు. షణ్ముఖ్, సిరి కన్నీళ్లు పెట్టుకోగా... యానీ మాస్టర్, ప్రియాంక సైతం ఎమోషనల్ అయ్యారు. అయితే ఇది తాత్కాలికమేనని మళ్లీ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చి పంపించాడు.
అనంతరం జెస్సీని వైద్యపరీక్షల నిమిత్తం సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్. ఆ తర్వాత జెస్సీ వెళ్లిపోవడంపై ఇంటి సభ్యుల మధ్య డిస్కషన్ నడిచింది. శ్రీరామ్‌తో కాజల్ మాట్లాడుతూ.. తనని ఎందుకు సేవ్ చేశావని అడగ్గా ఓ మంచి ఉద్దేశంతోనే సేవ్ చేశానని చెబుతాడు. అయినప్పటికీ అతని మాటలను అనుమానిస్తుంది కాజల్.
అటు ప్రియాంకని మళ్లీ దూరం పెడుతూ వస్తున్న మానస్‌ని.. సన్నీ, కాజల్ ప్రశ్నించడంతో మనసు మార్చుకున్నాడు. ప్రియాంకతో మాట్లాడాలన్నా.. ఆమె తెచ్చిన ఫుడ్ తినాలన్నా ముద్దు పెట్టాలని మానస్ కండీషన్ పెట్టాడు. దీంతో రెండు ముద్దులిచ్చింది ప్రియాంక. మరోవైపు అందరి ముందు తనని కామెంట్ చేయడం, నవ్వడంపై సిరిపై భగ్గుమన్నాడు షణ్ముఖ్. దీంతో సిరి.. షణ్ముఖ్‌పై కోప్పడింది. ఎందుకు నవ్వుతాడో, ఎందుకు దగ్గరికి తీసుకుంటాడో, ఎందుకు దూరం పెడతాడో అర్థం కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అన్ని ఎమోషన్స్ తనపైనే తీర్చుకుంటాడని వాపోయింది.
మరోవైపు పింకీ బల్లిని తయారు చేసి సన్నీపై వేసి భయపెట్టించింది. తర్వాత స్విమ్మింగ్ పూల్ వద్ద షణ్ముఖ్, జెస్సీలను ఇమిటేట్ చేసి కామెడీ చేశాడు రవి. ఇక చివరగా ఇంటి సభ్యులకు స్వీట్ పంపించారు బిగ్‌బాస్. అయితే దానిని తీసుకునే అర్హత ఒక్కరికి మాత్రమే ఉందని అందులో రాసి ఉంది. దీంతో ఆ ఒక్కరు ఎవరంటూ ఇంటి సభ్యులు టెన్షన్ పడ్డారు. ఇలా మొత్తంగా మంగళవారం ఎలాంటి గేమ్‌లు, టాస్క్‌లు ఇవ్వకుండా హౌస్‌మేట్స్‌ని కాస్త ఫ్రీగా వదిలేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com