బిగ్‌బాస్ 5 తెలుగు: మాట తప్పిన నాగ్.. జెస్సీకి సారీ, హౌస్ నుంచి ఔట్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు సక్సెస్‌ఫుల్‌గా పది వారాలు, 71 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆదివారం అందులోనూ చిల్డ్రన్స్ డే కావడంతో హోస్ట్ నాగార్జున .. ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు ఇచ్చారు. ఇక సీక్రెట్ రూమ్‌లో వున్న జెస్సీని త్వరలోనే ఇంట్లోకి పంపుతానన్న నాగ్.. అతనికి షాకిచ్చాడు. మరి సండే హౌస్‌లో జరిగిన విషయాలు.. జెస్సీకి నాగ్ ఇచ్చిన షాక్ గురించి తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
స్టేజ్ పైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. సండే ఫన్ డే అనుకుంటున్నారా..? సండే పనిష్మెంట్స్ అయిపోతాయ్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తరువాత గంగవ్వకి బిగ్‌బాస్ కట్టించిన ఇంటిని వీడియో ద్వారా ఇంటి సభ్యులకి చూపించారు నాగ్. ఆ తరువాత హౌస్ మేట్స్ ని రెండు జట్లుగా విడగొట్టి గేమ్ ఆడించారు. బాలల దినోత్సవం కావడంతో చిన్నప్పటి గేమ్స్ ఆడిస్తూ ఫన్నీ పనిష్మెంట్స్ ఇచ్చారు నాగార్జున. టీమ్ ఏలో షణ్ముఖ్, యానీ, ప్రియాంక, సన్నీ ఉండగా మిగిలినవారంతో టీమ్ బీ లో ఉన్నారు. మానస్ సంచాలకుడిగా వ్యవహరించాడు.
తొలి గేమ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నాగార్జున ఫైర్, ఐస్, వాటర్ అని పలికినప్పుడు ఆయా బోర్డుల దగ్గరకు పరిగెత్తుకెళ్లాలి. చివరగా ఎవరైతే వెళతారో వారు ఓడిపోయినట్లు లెక్క. ఆయన ఆదేశం ప్రకారం ఆ మూడింటిలో సరైన బాక్స్ లో నిల్చోవాలని, చివరిగా బాక్స్ లోకి వెళ్ళినవారు, ఎలిమినేట్ కావడంతో పాటు తాను విధించిన శిక్ష అనుభవించాలని చెప్పారు. మొదటిగా శ్రీరామ్ ఎలిమినేట్ కాగా నోటిపై వేలు పెట్టుకోవాలి అని శిక్ష వేశాడు. ఆ తర్వాత ప్రియాంకను బెంచిపై నిల్చోవాలని, రవిని గోడ కుర్చీ వేయాలని, షణ్ముఖ్ మోకాళ్లపై నిల్చోవాలని, సిరిని ఒంటికాలిపైన నిల్చోవాలని చెప్పి వాళ్లకు శిక్షలు వేశాడు. ఈ గేమ్ లో చివరి వరకు ఉండి, సన్నీ విజేతగా నిలిచాడు.
ఈ సందర్భంగా నామినేషన్‌లో ఉన్న నలుగురిని పిలిచి వారి చేతిలో రిసెప్షన్ బెల్ చేతిలో పెట్టి.. 'రెస్టారెంట్ క్లోజ్డ్' అనే సౌండ్ వస్తే నాట్ సేవ్ అని.. 'ఆర్డర్ ప్లీజ్' అని సౌండ్ వస్తే సేఫ్ అని చెప్పారు. ఈ టాస్క్ లో సిరి సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
ఆ తర్వాత కంటెస్టెంట్స్‌ని రెండు టీమ్స్ గా విభజించి... టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు చూపించి గేస్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాజల్, కీర్తి సురేష్, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోలు ప్రదర్శించగా.. హీరోలను ఈజీగా గుర్తుపట్టిన కంటెస్టెంట్స్, హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇబ్బందిపడ్డారు . ఈ టాస్క్ లో కూడా టీమ్ ఏ నే గెలిచింది. అనంతరం నామినేషన్ లో ఉన్న ముగ్గురిని నిలబడమని చెప్పిన నాగ్.. వాళ్ల ముందు బజర్ పెట్టి.. ఒక్కొక్కరిని చేయి పెట్టమని చెప్పారు. యాక్సెస్ గ్రాంటెడ్ అంటే సేఫ్.. యాక్సెస్ డినైడ్ అంటే అన్ సేఫ్ అని చెప్పారు. ఇందులో రవి సేవ్ అయినట్లు ప్రకటించారు. తర్వాతి గేమ్‌లో కొన్ని పదాలున్న మెడల్స్‌ను దానికి సరిగ్గా సరిపోయే వ్యక్తికి వేయాలని ఆదేశించాడు. దీంతో సన్నీ.. ఫేక్ అన్న మెడల్‌ను రవికి వేశాడు. మానస్.. ప్రియాంక తనకు తలనొప్పిగా మారిందన్నాడు. శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పాడు.
ఇక నామినేషన్‌లో మిగిలిన కాజల్, మానస్‌లను గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున.. అక్కడున్న రెండు బాక్స్‌ల ముందు నుంచోమని ఆదేశించారు. వాటిలో ఎవరి చేతికి గ్రీన్ కలర్ వస్తుందో వాళ్లు సేఫ్ అని చెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా ఇద్దరి చేతులకు పసుపు రంగు అంటుకుంది. దీంతో ఏం జరుగుతుందో కంటెస్టెంట్స్‌కి అర్ధం కాలేదు. ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్లు ఎలిమినేట్ అవ్వాల్సిన దానికి బదులు హౌస్ నుంచి ఇంకో హౌస్ మేట్ వెళ్లిపోతున్నారని అనౌన్స్ చేశారు నాగార్జున. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ ఆరోగ్యం బాగోలేనందున అతడిని పంపించివేయక తప్పదని వెల్లడించాడు. దీంతో జెస్సీ ఒక్కసారిగా షాయ్యాడు.
అనంతరం స్టేజ్ పైకి వచ్చిన జెస్సీకి సారీ చెప్పారు నాగార్జున. ఆ తరువాత అతనికి ఫోన్ ఇచ్చి.. ఒక్కో హౌస్ మేట్ తో మాట్లాడమని చెప్పారు నాగ్. జెస్సీ మాట్లాడేది ఆ హౌస్ మేట్ కి తప్పే వేరెవరికీ వినిపించదు. ఈ సందర్భంగా షణ్ముఖ్‌తో మాట్లాడుతూ... దీపుకి ఏం చెప్పాలి రా అని అడగ్గా... చూసిందే చెప్పారా అని బదులిచ్చాడు షణ్ముఖ్. ఆ తరువాత ''ఫస్ట్ వీక్ వెళ్లిపోతావ్ అనుకున్నారు.. కానీ పదవ వారం వరకు వుండి వేరే వాళ్లకు లైఫ్ ఇచ్చి వెళ్తున్నావ్ అదిరా నువ్వు అని ఫ్రెండ్‌ని ప్రశంసించాడు షన్నూ. నిజానికి ఓటింగ్‌లో కాజల్‌కు తక్కువ ఓట్లు వచ్చి కంటెస్టెంట్స్ అందరిలోకీ చివరి స్థానంలో ఉంది. దీంతో పదవ వారం ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అనుకున్నారంతా. కానీ హెల్త్ ఇష్యూ పేరు చెప్పి జెస్సీని పంపించేయడంతో కాజల్‌ను సేవ్ చేసినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com