బిగ్‌బాస్ 5 తెలుగు : నేరము - శిక్ష, సన్నీ మెడలో గిల్టీ బోర్డ్... జెస్సీపై నాగ్ కీలక నిర్ణయం

  • IndiaGlitz, [Sunday,November 14 2021]

బిగ్‌బాస్ 5 తెలుగులో వీకెండ్ ఎపిసోడ్ ఎప్పటిలాగే నాగార్జున మార్క్ క్లాసులతో సాగింది. కంటెస్టెంట్స్ చేసిన తప్పుల్ని, వారంలో వారు ఇతరులతో పడిన గొడవలపై విశ్లేషణ చేశారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో చాలా వరకు జెస్సీ టాపిక్కే నడిచింది. అనారోగ్యం కారణంగా సీక్రెట్ రూమ్‌లోనే వున్న అతను .. తిరిగి వస్తాడని భావించిన వారికి నాగ్ షాకిచ్చాడు. హెల్త్ ఇష్యూ కారణంగా జెస్సీని కొన్నిరోజుల పాటు సీక్రెట్ రూమ్‌‌కే పరిమితం చేశారు. మరి శనివారం హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

ఇక స‌న్నీ గురించి సిరి, ష‌ణ్ముల మధ్య డిస్కషన్ నడిచింది. అతను నోటికి ఎంత మాటొస్తే అంతలా మాట్లాడాడని సిరి ఏడ్చింది. ఓ ప‌క్క‌ అత‌డి మీదున్న అక్కసును చెబుతూనే... మ‌రోవైపు ష‌ణ్నుకు హ‌గ్గుల మీద హగ్గులిస్తూ ఐ ల‌వ్‌యూ చెప్పింది. ఇక కాజ‌ల్ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న యానీ మాస్టర్.. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంత‌వ‌ర‌కు ఆమెతో మాట్లాడేది లేదని, కనీసం ముఖం కూడా చూడ‌న‌ని తేల్చిచెప్పింది. అటు మాన‌స్ కూడా పింకీ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు కనిపిస్తోందని ఆమెను క‌ట్ చేయాల‌ని అనుకున్నాడు.

శనివారం కావడంతో భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడారు. వచ్చీ రావడంతోనే 'ఎఫ్‌ఐఆర్‌' గేమ్‌ ప్రారంభించారు. ఇందులో ఒక కంటెస్టెంట్..మరో కంటెస్టెంట్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. జైలులో పెట్టి వారు చేసిన తప్పేంటి చెప్పాలని, అతను దోషా కాదా అనేది ఇతర ఇంటి సభ్యులు నిర్ణయించాల్సి ఉంటుంది. యానీ మాస్టర్‌‌తో గేమ్ ప్రారంభించారు. ఆమె కాజల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా పదే పదే ‘‘ ఫాల్త్ గేమ్‌ ’’ అనే పదాన్ని ఎక్కువగా వాడిందని రీజన్ చెప్పింది. కాజల్ తన తరఫున వాదించాలని మానస్‌ని నియమించుకోగా, అతను సరిగా వాదించలేకపోయాడు, దీంతో చేసేదేం లేక కాజలే వాదించుకుంది. ఆమెకి మెజారిటీగా గిల్టీ ఓట్లు పడటంతో కాజల్ దోషిగా తేలింది.

ఈ క్రమంలో సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీని ఇద్దరు డాక్టర్లు కలిశారు. తలతిరగడం, నైట్‌ ఏదో పాకుతున్నట్టుగా ఉంటుందని, షేక్‌ అవుతుందని, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా వుందని చెప్పాడు. అయితే దీనిపై మరింత ఎగ్జామినేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అనంతరం నాగార్జున.. జెస్సీతో మాట్లాడారు. తనకు బాగానే ఉందని, ఇంటిలోకి వెళ్లేందుకు రెడీగానే ఉన్నట్టు చెప్పాడు జెస్సీ. అయితే పూర్తిస్థాయిలో రిపోర్ట్స్ వచ్చాక హౌస్‌లోకి పంపిస్తానని నాగ్‌ హామీ ఇచ్చాడు.

ఆ తర్వాత కెప్టెన్‌ రవి.. సన్నీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు. బ్యాడ్‌ బిహేవియర్‌, కొడతా, అప్పడం అనే పదాలు వాడటం సరికాదని రీజన్ చెప్పాడు. దీనికి మానస్‌ వాదించగా.. సన్నీ విషయంలో పెద్ద చర్చే నడిచింది. తాను ఆ సెన్స్‌లో అనలేదని వాదించుకున్నాడు సన్నీ. అయితే అలాంటి పదాలు వాడటం తప్పు అన్నాడు రవి. ఈ విషయంలో హోస్ట్‌ నాగార్జున కూడా రవికే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. చివరికి వీడియో ప్లే చేసి చూడటంతో సన్నీని మెజారిటీ సభ్యులు దోషిగా నిర్ణయించారు.

సన్నీ.. సిరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు. గేమ్‌ని డిస్టర్బ్ చేసిందని, అది తనకు నచ్చలేదని ఆరోపించాడు. అయితే అది తన స్ట్రాటజీ అని చెప్పింది సిరి. ఈ విషయంలో అందరు సిరిని నిర్దోషిగా తేల్చారు. ఆ వెంటనే సిరి.. సన్నీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తంతా అనే పదం వాడటం, అప్పడం అయిపోతావనేది, ఆడవాళ్లని అడ్డు పెట్టుకుని గేమ్‌ ఆడుతున్నావని అనే పదాలు వాడటం నచ్చలేదని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో కూడా మరోసారి వీడియో ప్లే చేసి నిజం తెలుసుకున్నారు నాగార్జున. దీంతో మరోసారి సన్నీని గిల్టీ అనే తేల్చేశారు.

మానస్‌.. యానీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తూ.. తనని నామినేషన్‌ చేసినప్పుడు ఆమె చెప్పిన రీజన్ నచ్చలేదని, అదొక కారణం కాదని వాదించాడు. అందుకే నామినేట్‌ చేశానని చెప్పింది యానీ మాస్టర్‌. ఆమెని దోషి కాదని ఇంటి సభ్యులంతా చెప్పడం విశేషం. అనంతరం శ్రీరామ్‌.. ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాను ఆమె కోసం పాటలు పాడినా తనకు టిప్పు ఇవ్వలేదని.. తనని చూసి శ్రీరామ్‌ ఫ్లాట్‌ అయిపోయాడని, తాను టిప్పు ఇవ్వకపోయినా పాడతాడని, అందుకే ఇవ్వలేదని రీజన్ చెప్పింది. దీంతో ప్రియాంకను దోషి కాదని తేల్చారు ఇంటి సభ్యులు.

ప్రియాంక.. మానస్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తనపై గట్టిగా అరిచాడని రీజన్ చెప్పింది. దానికి మానస్‌ స్పందిస్తూ, హోటల్‌ టాస్క్‌లో రెడీ అవడానికి చాలా టైమ్‌ తీసుకుందని, డ్రెస్‌ సెలక్షన్‌లో నాలుగైదు డ్రెస్సుల్లో తాను ఒక డ్రెస్‌ని సెలక్ట్ చేశానని, కానీ తను మాత్రం మరో డ్రెస్‌ వేసుకుందని అంత మాత్రానా ఎందుకు అడగాలని చెప్పాడు. ఇందులో మానస్‌ నిర్ధోషిగానే నిలిచాడు. కాజల్‌.. యానీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తనని ఎగతాళి చేసిందని రీజన్ చెప్పింది. అయితే ఆమె వెక్కిరించ‌లేద‌ని, అది త‌న బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించడంతో మెజారిటీ కంటెస్టెంట్లు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ఒకరిని సేవ్‌ చేసే ప్రక్రియ ప్రారంభించారు నాగార్జున. ఇందులో బిబి హోటల్‌కి సంబంధించిన బిల్స్ వచ్చాయి. వాటిలో ఎక్కువ ఎవరికి టిప్పు వస్తే వాళ్ళు సేవ్‌ అయినట్టు. ఇందులో రవికి 400, సిరికి 700 టిప్పు, మానస్‌కి 500, కాజల్‌కి 600, సన్నీకి 1000 పైగా టిప్పు వచ్చింది. దీంతో సన్నీ సేవ్‌ అయినట్లు నాగ్ ప్రకటించారు.

ఆ తర్వాత షణ్ముఖ్‌.. సన్నీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తంతా, అప్పడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం, అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఆడుతున్నారని అనడం, జస్ట్ యూట్యూబ్‌ వరకే అనడం కరెక్ట్ కాదని రీజన్ చెప్పాడు. దీనిపై కూడా వీడియో చూపించాడు నాగార్జున. ఈ కేసులో కూడా సన్నీ దోషిగా నిలిచాడు. హౌస్‌మేట్స్ చేత ఎక్కువగా ఎఫ్ఐఆర్‌కు గురికావడంతో సన్నీ దోషిగా నిలిచాడు. దీంతో ఆయనకు గిల్టీ బోర్డ్ వేశారు.

More News

‘క్యాలీఫ్లవర్‌’ నవంబర్ 26న విడుదల

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్‌’

‘అర్జున ఫల్గుణ’ నుంచి ‘గోదారి వాల్లే సందమామ’ పాట విడుదల

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.

బిగ్‌బాస్ 5 తెలుగు: టాస్క్‌ మధ్యలో కంట్రోల్ తప్పిన షణ్ముఖ్‌-సన్నీ-సిరి... కొత్త కెప్టెన్‌గా రవి

కెప్టెన్సీ పోటీదారుల కోసం జరుగుతున్న బీబీ హోటల్ టాస్క్ ఫన్‌తో పాటు గొడవలు కూడా పెట్టింది. షణ్ముఖ్- సిరి- సన్నీ, యానీ మాస్టర్- కాజల్‌ల మధ్య గొడవ తారాస్థాయికి చేరి..

సస్పెన్స్‌కు తెర... ‘మరక్కర్‌’ థియేటర్స్‌కే వస్తున్నాడు

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్‌’ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.

ప్రమోషన్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు లేవు : ‘‘ పుష్ప ’’ను పోస్ట్ పోన్ చేస్తున్నారా.. అసలేం జరుగుతోంది..?

కోవిడ్ తగ్గుముఖం  పట్టడం, థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో విడుదలకు నోచుకోని చిన్నా, పెద్దా సినిమాలు వరుసపెట్టి క్యూకడుతున్నాయి.