close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

Saturday, December 11, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

బిగ్‌బాస్ 5 తెలుగులో ప్రేక్షకులను ఓట్లు అడిగే టాస్క్ కొనసాగుతోంది. హౌస్‌మేట్స్ తమ పర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అయితే ఈసారి నేరుగా ప్రేక్షకుల నుంచి రకరకాల ప్రశ్నలు ఇంటి సభ్యులకు ఎదురయ్యాయి. షణ్ముఖ్- సిరి రిలేషన్‌పై వచ్చిన ప్రశ్నకు ఈ జంట కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది. మరి మిగిలిన హౌస్‌మేట్స్‌కి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.. వారి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

ఇంటి సభ్యులు స్టార్లుగా నటించాల్సిన టాస్కులో అందరూ బాగా చేశారు. సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి, పవన్‌ కల్యాణ్‌గా మానస్‌, చిరంజీవిగా శ్రీరామ్‌, బాలయ్యగా సన్నీ, శ్రీదేవిగా కాజల్‌ అదరగొట్టారు. ఈ గేమ్‌లో అందరికంటే బాగా కాజల్‌ తన పాత్రలో లీనమై అందరినీ ఆకట్టుకుంది. దీంతో హౌస్‌మేట్స్‌ ఆమెను బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. అలా కాజల్‌కు నేరుగా ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం వచ్చింది. 'నా కల నెరవేరడానికి మీరు ఎంతగానో సహకరించారు. నేను టాప్‌ 5లో నా ఫ్రెండ్స్‌తో పాటు ఉండాలనుకుంటున్నాను, దయచేసి ఓటేయండి' అని ప్రేక్షకులను కోరింది కాజల్‌.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

ఆ తర్వాత ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలున్నాయి.. వాటిని హౌస్‌మేట్స్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. అందులో భాగంగా జనం నుంచి వచ్చిన ప్రశ్నలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవగానే అది ఎవరికి చెందినదైతే వారు దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సరైన సమాధానాలు చెప్పిన వారికి ఓట్‌ ఫర్‌ అప్పీల్‌కు అవకాశం పొందుతారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

1. ముందుగా సిరికి ఇలా వచ్చింది. 'మీరు షన్ను కంటే స్ట్రాంగ్ ప్లేయర్.. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సిడర్ చేసుకోవడం లేదు'..?

దానికి సిరి స్పందిస్తూ.. 'హౌస్ లో కొన్నిసార్లు షణ్ముఖ్ బాగా హెల్ప్ చేశాడని.. తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని.. తాను స్ట్రాంగ్ ప్లేయరే కానీ షణ్ముఖ్ ని టాప్ ప్లేస్ లో చూడాలనుకుంటున్నానని' ఆన్సర్ ఇచ్చింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

2. యానీ మాస్టర్ తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు.. తుడిచినా టిష్యూని సన్నీ మీద కొట్టడం గౌరవం ఇవ్వడమా..?' అనే ప్రశ్న కాజల్‌కి ఎదురైంది..?

దానికి కాజల్ బదులిస్తూ.. 'యానీ మాస్టర్‌తో జరిగిన గొడవలో.. సన్నీతో కూడా గొడవే కానీ దాన్ని కూల్ డౌన్ చేసే యత్నంలో చనువు ఉందనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను' అంటూ చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

3. 'గిల్టీ బోర్డు వేసుకొని తిరిగినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు..? ఆ ఇన్సిడెంట్ తరువాత మీ కాన్ఫిడెన్ ని ఎలా తిరిగి పొందారు..?' అని సన్నీని ప్రశ్నించారు

అది నేను 'చాలా హర్ట్ అయిన సిట్యుయేషన్ .. నా కోపం వలన హౌస్ మేట్స్ ఆ బోర్డు వేశారు. ఆ తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చిన ధైర్యం, కొన్ని టాస్క్ లలో, వీకెండ్స్ లో వచ్చిన కాంప్లిమెంట్స్ అవన్నీ కాన్ఫిడెన్స్ పెరిగేలా చేశాయి' అని సన్నీ సమాధానమిచ్చాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

4. జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ను ఇమ్మెచ్యూర్‌ అని మీరు చెప్పారు. కానీ ర్యాంకింగ్‌ టాస్క్‌లో మీరే షణ్ను మెచ్యూర్‌ అని, తనను సెకండ్‌ ప్లేస్‌లో పెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ను గ్రూపులో ఉన్నారా? అని శ్రీరామ్‌ని ప్రశ్నించారు

అది విని శ్రీరామ్ మాట్లాడుతూ... ఆ తరువాత తనే గ్రూప్ లో లేనని.. జెస్సీ ఇన్సిడెంట్ సమయానికి షణ్ముఖ్ తో పరిచయం లేదని.. ఆ తరువాత షణ్ముఖ్ తో ట్రావెల్ అయిన తరువాత తనేంటో అర్థమైందని వెల్లడించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

5. ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ గా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా..?' అని మానస్ కి ప్రశ్న ఎదురైంది

ఫ్రెండ్ లా వాడుకుంటున్నాడనేది రాంగ్ పెర్స్పెక్టివ్. నేను జెన్యూన్ గా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఒకల్ని వాడుకొని పైకి ఎదగాలనే మనస్తత్వం అతనికి లేదు. మీకు అలా అనిపిస్తే ఆలోచనా విధానం మార్చుకోండి' అంటూ మానస్ సమాధానమిచ్చాడు.

6. సిరి అంటే మీరెందుకు అంత పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు. ప్రతీసారి తనను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు..? తనను తనలా ఎందుకు ఉండనివ్వరు' అనే ప్రశ్న షణ్ముఖ్ కి ఎదురైంది.

దీనికి షణ్ముఖ్ చెబుతూ.. 'నేను యాక్స్పెక్ట్ చేశాను ఇది. నాకే తెలుసు నేను పొసెసివ్ గా ఫీల్ అవుతున్నానని. కొన్ని కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తే బెటర్. ఈ హౌస్ లో అనేది నా పాయింట్. కొన్ని విషయాల్లో సిరి తనలా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. గేమ్ లో నేనెప్పుడూ కంట్రోల్ చేయలేదు. కానీ బయట ఎవరైనా తనతో గేమ్ ఆడాలనుకుంటే మాత్రం కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే సిరిని నేను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను' అని ఆన్సర్ చేశాడు.

7. అందరిముందు కాజల్‌ను ఎందుకు హ్యుమిలియేట్‌ చేస్తారు? స్టాండ్‌ తీస్కొని మీకోసం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తను విన్‌ అయింది అన్న ప్రశ్న సన్నీకి ఎదురైంది

వెంటనే సన్నీ.. కాజల్ ని 'అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా..?' అని ప్రశ్నించాడు. దానికి ఆమె ఫ్రెండ్షిప్ లో ఎప్పుడూ అలా తీసుకోలేదని చెప్పింది. అప్పుడప్పుడు కాజల్ ని ఏడిపిస్తా.. అయితే అది సరదా కోసమే.. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పాడు

8. 'మీరు రవిని నామినేట్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు. మళ్లీ టికెట్ టు ఫినాలే టాస్క్ లో నీకోసం గేమ్ ఆడుతున్నా రవి అని అరవడం కరెక్ట్ అనుకుంటున్నారా..?' అని సిరికి క్వశ్చన్ వచ్చింది

'రవి ఉన్నప్పుడు తన వాల్యూ తెలియలేదు. నిజానికి తను ఎలిమినేట్ అవుతాడని కూడా ఊహించలేదు. కానీ సడెన్ గా వెళ్లిపోయాడు. ఆరోజు గేమ్ ఆడినప్పుడు కూడా రవి గుర్తొచ్చి అలా మాట్లాడాను అంతే' అంటూ ఆన్స్ ఇచ్చింది సిరి.

9. ఇవి ఎలా నచ్చుతున్నాయి, అవి ఎలా నచ్చుతున్నాయి అని ఆడియన్స్ ను జడ్జ్ ఎందుకు చేస్తున్నారు. వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు..?' అనే ప్రశ్న షణ్ముఖ్ కి ఎదురైంది. '

ఆడియన్స్ ను జడ్జ్ కన్నా.. నా ఊహలే అవన్నీ. నేను ఎక్కువ థింక్ చేస్తున్నాను జనాలకు ఏం నచ్చుతుందో అని. ఆడియన్స్ మీద ఫన్ చేసే ఉద్దేశం నాకు లేదు' అని చెప్పాడు షణ్ముఖ్.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

10. 'మీరు బిగినింగ్ నుంచి గ్రూప్ లోనే ఆడుతూ వచ్చారు. కానీ మిమ్మల్ని మీరు లోన్ రేంజర్ గా పోట్రె చేసుకున్నారు. ఇదంతా సింపతీ కోసమా..? మీ స్ట్రాటజీనా..? ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో రవితో కలిసి ఇద్దరి ఫొటోలను కాల్చేయాలని అనుకున్నారు. కానీ అదే కాజల్ చేస్తే మీకెందుకు కోపం వచ్చింది' అని శ్రీరామ్ ను ప్రశ్నించారు.

దీనికి ఆయన బదులిస్తూ.. 'లోన్ రేంజర్ అని నేనెప్పుడూ చెప్పలేదు. నాకు సింపతీ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు. ఫైర్ ఇంజన్ టాస్క్ లో ఓవర్ రియాక్ట్ అయ్యాను. కానీ ఇద్దరు కలిసి ఫొటోలను కాల్చేయడం నేను తీసుకోలేకపోయాను' అని శ్రీరామ్ చెప్పారు.

11. 'మీరు ప్రియాంక, మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తనను బ్యాక్ బిచ్ ఎందుకు చేశారు.?' అని మానస్ ని ప్రశ్నించారు.

'కొన్ని సార్లు ప్రియాంక బిహేవియర్ నచ్చకపోతే వేరే వాళ్లతో డిస్కస్ చేశాను. కానీ తనను తక్కువ చేయాలని అనుకోలేదు. ప్రియాంక ఎప్పటికీ నా ఫ్రెండే' అని చెప్పాడు మానస్.

12. మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ, మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా? అని కాజల్‌కి ప్రశ్న ఎదురైంది.

మొదట్లో షణ్ను నచ్చాడు, కనెక్ట్‌ అయ్యాను. కానీ కొన్ని మాటల వల్ల మా మధ్య గ్యాప్ పెరిగింది. రవితో కనెక్ట్‌ రాలేదు. మానస్‌, సన్నీలతో కనెక్ట్‌ అయ్యాను. ఆట కోసం ఈ కనెక్షన్స్‌ పెట్టుకోలేదని కాజల్ తెలిపింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

అనంతరం ప్రశ్నోత్తరాల టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఎలాంటి దాపరికం లేకుండా ఆన్సర్స్ చేసిన ఒకరిని ఇంటి సభ్యుల్ని ఎన్నుకోమని ఆదేశించారు బిగ్ బాస్. ఇందులో సన్నీకి, సిరికి సమానంగా ఓట్లు రావడంతో శ్రీరామ్ ఓటు కీలకంగా మారింది. అతడు సిరి పేరు చెప్పడంతో.. సన్నీ తన పేరు ఎందుకు చెప్పడం లేదని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అయితే సిరి ఆ అవకాశాన్ని వదులుకుని సన్నీనే వెళ్లమనిన చెప్పింది. దీంతో సన్నీ.. ప్రేక్షకులను ఓటింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నాడు. అమ్మ కోరిక నెరవేర్చడం కోసం తనకు సపోర్ట్ చేయమని వేడుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment