బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ని టార్గెట్ చేసిన ఆ నలుగురు.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు చివరి దశకు చేరుకోవడంతో షో ఉత్కంఠగా మారుతోంది. ఇక కొద్దివారాలే మిగిలి వుండటంతో ఎవరు ఉంటున్నారు..? ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్ ప్రేక్షకుల్లో పట్టుకుంది. రవి హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఆందోళనగా వున్నారు. ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా దీనిపైనే ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. అతను జెన్యూన్‌గా ఆడలేదని.. గొడవలతో నెట్టుకొద్దామని అనుకున్నాడని ఇంటి సభ్యులు ఆరోపించారు. ఇక సోమవారం కావడంతో ఎప్పటిలాగే నామినేషన్ల ప్రక్రియ నడిచింది. ఇక సిరితో తన రిలేషన్ గురించి చెప్పాడు షణ్ముఖ్. దీంతో వీరిద్దరి మధ్యా మళ్లీ గొడవ నడిచింది. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లోకి వెళ్లారో ఒక్కసారి చూస్తే.
రవి ఎలిమినేషన్ గురించే ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. సన్నీ-కాజల్, మానస్-కాజల్ మధ్య ఇదే టాపిక్ నడిచింది. రవి వెళ్లిపోవడంపై షణ్ముఖ్, సిరి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది ఎలిమినేట్ అయ్యారు బాధపడ్డాను, కానీ రవి వెళ్లిపోతే చాలా బాధగా అనిపించిందని సిరి ఆవేదన వ్యక్తం చేసింది. రవిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయని.. ఆయన వాటిని రీచ్ కాలేదని, దీని వల్ల ఓట్లు తగ్గిపోయాయని సిరి అభిప్రాయపడింది.
దీనికి షణ్ముఖ్ రియాక్ట్ అవుతూ, అంతమాత్రానికే అన్ని ఓట్లు తగ్గిపోతాయా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రవి ఎలిమినేషన్ వెనుక ఏదో జరిగిందంటూ అనుమానపడ్డాడు. రవి ఎలిమినేట్ అయిన కాసేపటికే సన్నీ, కాజల్ జోకులు వేసుకుని నవ్వుకున్నారని... అటు రవి వెళ్లిపోవడంతో శ్రీరామ్ ఒంటరివాడైపోయాడని, ఆయనతో మాట్లాడాలని అనుకున్నారు షన్ను, సిరి. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో కాకుండా ప్రేక్షకుల ఓట్లతో తాను సేవ్ అయ్యానని.. అందుకు హ్యాపీగా వుందని కాజల్.. మానస్ దగ్గర చెప్పింది. రవి జెన్యూన్‌గా లేడని.. అందరితో గొడవ పెట్టుకోవాలని అనుకున్నాడని, అదే ఆయనకు దెబ్బకొట్టిందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.
ఇక ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారంటూ సన్నీ- కాజల్‌లు మాట్లాడుకున్నారు. నువ్వంటే హౌస్‌లో అందరికీ ఇష్టమని.. కాబట్టి నిన్ను నామినేట్ చేయరని చెప్పింది. ఇక రవి ఎలిమినేషన్ గురించి కిచెన్‌లో ఒంటరిగా వున్న ప్రియాంక కంటతడి పెట్టింది. ఆ సమయంలో సిరి ఆమెను ఓదార్చింది. ఆ తర్వాత షన్ను ఆమెతో మాట్లాడాడు. మానస్,సన్నీ, కాజల్ కలిసి గేమ్ ఆడుతున్నారని, ఎవరు ఉంటే తమకి దెబ్బ అనే లెక్కలు వేసుకుని ఆడుతున్నారని, నామినేట్ చేసేందుకు ఉన్న అవకాశాలేంటనేది పింకీకి చెప్పాడు షణ్ముఖ్. మొత్తంగా ఆ గ్రూప్ వాళ్లని నామినేట్ చేసేలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు.
మరోవైపు సిరితో రిలేషన్‌కి సంబంధించి షణ్ముఖ్ మాట్లాడుతూ, బయటకు వెళ్లాక నాకు ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. దీంతో సిరి అలిగి వెళ్లిపోయింది. ఆమె వద్దకి వెళ్లి సారీ చెప్పాడు. అయినా సిరి ఒప్పుకోలేదు. ఆ తర్వాత షణ్ముఖ్‌కి హగ్ ఇవ్వాలనుకుంది సిరి. నాకు హగ్ వద్దు బాబోయ్ అంటూ ఆమెకు దూరంగా జరిగే యత్నం చేశాడు. అటు సిరి మదర్ అన్న మాటలను గుర్తు చేస్తూ ఎందుకొచ్చిన గోల ‘‘మళ్లీ మీ మదర్ ఇంకేదో అనుకుంటుందంటూ పారిపోయాడు. అయినా సిరి పట్టుబట్టి హగ్ ఇచ్చింది. అలాగే ఆమెని పూర్తిగా హగ్ చేసుకోలేదు... సరికదా ఇది జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే అంటూ పదే పదే చెప్పే ప్రయత్నం చేశాడు.
అనంతరం ఈవారం నామినేషన్స్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా బిగ్ బాస్ ఇంటి గేట్స్ ని తెరిచారు. ప్రతి ఇంటి సభ్యుల ముందు వారి ముఖంతో బాల్స్ ఉన్నాయి. ఇంటి సభ్యులందరూ తగిన రీజన్స్ చెప్పిన తరువాత వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్ ను ఇంటి బయటకు వెళ్లేలా తన్నాల్సి వుంటుంది.
తొలుత షణ్ముఖ్ షణ్ముఖ్ - కాజల్, ప్రియాంకలను నామినేడ్ చేశాడు. ప్రియాంక-సిరి, కాజల్‌ని.... శ్రీరామ్- మానస్, కాజల్‌లను.... సిరి- ప్రియాంక, కాజల్‌లను... సన్నీ - సిరి, శ్రీరామ్‌లను..... మానస్ - శ్రీరామ్, సిరిలను... కాజల్ - ప్రియాంక, సిరిలను నామినేట్ చేశారు. అలా ఈ వారం నామినేషన్స్‌లో ప్రియాంక, సిరి, మానస్, శ్రీరామ్, కాజల్‌లు వున్నారు. కెప్టెన్ కావడంతో షణ్ముఖ్, ఎవరూ నామినేట్ చేయకపోవడంతో సన్నీ ఈ వారం నామినేషన్స్‌లో లేరు. దీంతో వీరిద్దరూ సేఫ్ జోన్‌లో వున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com